Bigg Boss 7 Telugu రతిక రోజ్ జాతకాన్ని బయటపెట్టిన షకీలా!

బిగ్‌బాస్ రియాలిటీ షో 7వ సీజన్‌ భావోద్వేగాలతో సాగుతూ రెండోవారంలోకి అడుగుపెట్టింది. తొలివారం ఆట ఉల్లాసంగాను, ఉత్సాహంగాను సాగింది. తొలివారం ఎలిమినేషన్‌లో భాగంగా కిరణ్ రాథోడ్ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇక రెండోవారం నామినేషన్లు భారీగా వాగ్వాదాలతో ముగిసాయి. దాంతో ఇంటిలో కొంత ప్రశాంత వాతావరణం నెలకొన్నది. అయితే నామినేషన్ల గొడవ తర్వాత రతిక, షకీలా మధ్య ముచ్చట్లు ఆసక్తికరంగా సాగాయి. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో అందరి కంటే వయసులో పెద్దగా షకీలా అడుగుపెట్టింది. ఇంటిలో అందరూ ఆమెను అమ్మ అంటూ ప్రేమగా పిలుచుకొంటున్నారు. ఇంటి సభ్యులను కూడా షకీలా ప్రేమగా చూసుకొంటూ తగిన సలహాలు ఇస్తూ కనిపిస్తున్నది. అంతేకాకుండా కెరీర్ పరంగా ఎలా ఉండాలి? ఇండస్ట్రీలో రాణించాలంటే ఏం చేయాలి? సూచనలు ఇస్తూ పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్నది.

 Shakeela Palmistory talent: Actress tells Rathikas Future In Bigg Boss 7 Telugu

షకీలా అంటే మలయాళ చిత్ర పరిశ్రమలో శృంగారతారగానే గుర్తుకు వస్తుంది. బిగ్‌బాస్ షోలోకి రావడానికి ప్రధాన కారణం నా మీద ఉన్న ఇమేజ్‌ తడిచిపెట్టుకోవాలనుకొంటున్నాను అని చెప్పారు. అంతేకాకుండా తాను ట్రాన్స్‌జెండర్లకు ఎలాంటి సహాయం, ప్రేమను పంచుతున్నారనే విషయాన్ని కూడా తెలియజేశారు. షకీలాలో మనకు తెలియని మరో కోణం కూడా భయటకు వచ్చింది. ఆమెకు చేతిరేఖల ద్వారా జాతకం చెప్పే ప్రతిభ కూడా ఉందనే విషయం తాజా ఎపిసోడ్‌లో స్పష్టమైంది.

రెండోవారం నామినేషన్ల ప్రక్రియ తర్వాత రతికతో షకీలా ప్రశాంతంగా ముచ్చటించుకొన్నారు. ఆ సందర్భంగా రతిక చేతిని తన చేతిలోకి తీసుకొని జాతకాన్ని చెప్పింది. వచ్చే ఆరు నెలల్లో నీకు మంచి పాపులారిటీ వస్తుంది. ఇండస్ట్రీలో నీకు ఊహించని పాపులారిటీ వస్తుంది. సినీ ఇండస్ట్రీ గానీ, నీవు కోరుకొనే ఏ రంగంలోనైనా నీకు పాపులారిటీ లభిస్తుంది అని రతిక జాతకాన్ని షకీలా చెప్పింది.

రతిక చేతి రేఖలను చూస్తూ.. ఇంతకు ముందు నీకు ఓ ఛాన్స్ వచ్చింది. కానీ నీవు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అవకాశం మరోసారి నీ వద్దకు వచ్చింది అని షకీలా చెప్పగానే.. రతిక ఆశ్చర్యపోయింది. అయితే మీకు జీవించడానికి సరిపోయేంతగా డబ్బు, హోదా ఉంది. నీకు తల్లి నుంచి ఉందా? తండ్రి నుంచి వచ్చిందా? అనేది నాకు తెలియదు అని షకీలా చెప్పింది.

ఇదిలా ఉండగా, రెండోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న నామినేషన్ జాబితాలో 9 మంది నామినేట్ అయ్యారు. ఆ జాబితాలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, డాక్టర్ గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, షకీలా, శివాజీ తదితరులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X