వివాదాస్పద బిగ్ బాస్ రియాలిటీ షోపై షకీలా... కామెంట్స్
ఇండియాలో ప్రసారం అవుతున్న కాంట్రవర్సల్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బిగ్ బాస్ సీజన్ 3 రన్ అవుతోంది. తెలుగు షోను అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండగా, తమిళ షోను కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒకప్పటి శృంగార నటి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న షకీలా రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ షో నేను ఏ భాషలోనూ చూడటం లేదు. కమల్ సర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి... శని, ఆదివారం ఆయన హోస్ట్ చేసే షో మాత్రం చూస్తున్నట్లు వెల్లడించారు.

కన్నడలో మూడు వారాలు ఉన్నా, తెలుగులో ఆర్టిస్టులు ఎవరూ తెలియదు
బిగ్ బాస్ కన్నడ సీజన్ 2లో నేను పాల్గొన్నాను. 3 వారాలు ఉన్నాను. కానీ నా వల్ల కాలేదు. టాస్కుల్లో గెలవలేక పోయాను. ఈ గేమ్ నా వల్ల కాదని వచ్చేశాను. తమిళం అప్పుడప్పుడు చూస్తాను, అది కూడా కమల్ సర్ కోసమే. తెలుగు బిగ్ బాస్ షోలో ఆర్టిస్టులు ఎవరూ నాకు తెలియదని... షకీలా చెప్పుకొచ్చారు.

సంపూకు అలా ఉండటం చేతకాదు
తెలుగులో ప్రసారమైన గత బిగ్ బాస్ సీజన్లలో సంపూ వెళ్లింది చూశాను, సంపూ బయటకు వచ్చింది చూశాను. మిగతా ఏవీ చూడలేదు. కొబ్బరి మట్ట షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఈ విషయం గురించి టాపిక్ వచ్చేది. నన్ను సంపూ... అమ్మా అని పిలుస్తాడు. ‘‘బిగ్ బాస్ హౌస్‌లో ఉండే పరిస్థితి నేను తట్టుకోలేను, అలా ఉండలేను'' అని సంపూ చెప్పేవాడని షకీలా తెలిపారు.

మళ్లీ వెళ్లే ఆసక్తి లేదు
తెలుగు సీజన్స్‌కు సంబంధించి హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళతారా? అనే ప్రశ్నకు షకీలా స్పందిస్తూ... ఎండమోల్ సంస్థ ఒకసారి తీసుకుంటే వారిని మళ్లీ తీసుకోరని అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను కన్నడలో చేశాను. అయినా నాకు వెళ్లే ఆసక్తి కూడా లేదు. ఆ గొడవలు అవన్నీ నా వల్లకాదని ఆమె అన్నారు.

నన్ను అందరూ మలయాళీ అనుకున్నారు
కన్నడలో పాల్గొన్నపుడు నేను మలయాళీ అనుకుని అందరూ చేచీ చేచీ అని పిలిచేవారు. బాత్రూం కడగమంటే నాకు రాదు అని చెప్పేశాను. వారు వండిన వంటలు తినడం నా వల్ల కాలేదు. అందుకే వంటలు మాత్రం చేసుకుంటూ ఉన్నాను.

అక్కడ ఉండే పరిస్థితులే గొడవలకు కారణం
బిగ్ బాస్ షోలో కావాలని రేటింగ్స్ కోసం గొడవలు పెట్టుకోండి అని సూచనలు ఇస్తారనే ఒక అపవాదు ఉంది, అది నిజమా? అనే ప్రశ్నకు షకీలా రియాక్ట్ అవుతూ.... అలాంటిది ఏమీ లేదు. అక్కడ ఉండే పరిస్థితులే మనల్ని ఫ్రస్టేషన్ కు గురి చేస్తాయి, కోపం వస్తుంది. సభ్యుల ప్రవర్తన కూడా గొడవలు ఎక్కువ కావడానికి మరో కారణమని తెలిపారు.


Click it and Unblock the Notifications











