Bigg Boss 7 Telugu: షోలో శృంగారం టాపిక్.. చిన్నప్పుడే ఆ పని.. అతడి చెంపపై కొట్టిన లేడీ కంటెస్టెంట్

బిగ్ బాస్.. కొత్త కాన్సెప్టుతో రన్ అవుతోన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్న ఏకైక షో. వేరే భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఏడేళ్ల క్రితమే ఇది పరిచయం అయింది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ప్రారంభించారు. మొదటి రోజు ఎపిసోడ్‌లోనే ఈ షోలో షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీరే చూడండి!

ఉల్టా పుల్టాగానే మొదలైందిగా:తెలుగులో బిగ్ బాస్ ఏడో సీజన్‌ను సెప్టెంబర్ 3న ప్రీమియర్ ఎపిసోడ్‌తో ప్రారంభించారు. ఇందులో కంటెస్టెంట్లు పాటలు, డ్యాన్సులు, కామెడీ చేస్తూ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ముఖ్యంగా ఇది ఉల్టా పుల్టా అంటూ సాగే సీజన్ కావడంతో మొదటి రోజే ఈ షోలో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపించాయి. గతంలో మాదిరిగా కాకుండా చాలా కొత్తగా దీన్ని నిర్వహకులు నడిపించారు.

Shakeela Slaps Tasty Teja In Bigg Boss 7 Telugu Show

ఏడో సీజన్‌ కంటెస్టెంట్లు వీళ్లే:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వారిలో సీరియల్ నటి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, యంగ్ హీరోయిన్ శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, సీరియల్ నటి శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమరదీప్‌లు ఉన్నారు.

ఆమె స్పెషల్‌గా.. ఎమోషనల్:ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్పెషల్‌గా నిలిచారు. వారిలో ఒకప్పటి శృంగార తార షకీలా ఒకరు. చాలా కాలం పాటు తనదైన చిత్రాలతో అలరించి ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె.. వ్యక్తిగత జీవితంలో ఎన్ని గొప్ప పనులు చేస్తున్నారో ఈ షో ద్వారా తెలిసింది. ముఖ్యంగా ఆమె ఎంట్రీ ఎమోషనల్‌గా జరిగింది.

కామెడీని పంచిన టేస్టీ తేజ:ప్రీమియర్ ఎపిసోడ్‌లో షోలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో జబర్ధస్త్ మాజీ కమెడియన్, ప్రముఖ యూట్యూబర్ టేస్టీ తేజ కూడా బాగా ఫోకస్ అయ్యాడు. ఇతడు మాత్రం తనదైన కామెడీని చూపించే ఏవీ ప్రదర్శన అనంతరం వచ్చాడు. అంతేకాదు, ఆహార పదార్థాలతో ప్రింట్ చేసిన డ్రెస్ వేసుకుని హౌస్‌లోకి అడుగు పెట్టాడు. అదే సమయంలో తనదైన పంచులు వేస్తూ యమా నవ్వించేశాడు.

నా హార్ట్‌నే ఇచ్చేస్తా మేడం:టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే అతడితో పరిచయం ఉన్న వాళ్లంతా ఎదురెళ్లి మరీ స్వాగతం పలికారు. ముఖ్యంగా శోభా శెట్టి (మోనిత) వెళ్లి అతడి షర్ట్‌పై ఉన్న బిర్యానీ బొమ్మను చూసి ఇది కావాలని అడగ్గా.. తేజ 'దాని వెనుక ఉన్న గుండేనే ఇస్తాను మేడం' అన్నాడు. ఆ తర్వాత కూడా అందరితో ఇదే తరహాలో సరదాగా మాట్లాడుతూ కామెడీని జనరేట్ చేసేశాడు.

ఇంత పెద్ద ఒళ్లు చూడలేదా:అందరినీ పలకరించిన తర్వాత టేస్టీ తేజ.. షకీలా దగ్గరకు పరుగున వెళ్లాడు. 'మేడం మేడం మిమ్మల్ని చూడలేదు' అన్నాడు. దీనికామె 'ఏరా ఇంత పెద్ద ఒళ్లు ఉంటే కనిపించలేదా' అంటూ అదిరిపోయే పంచ్ వేసింది. ఆ తర్వాత తేజ 'మేడమ్ షకీలా గారూ.. చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగా. నేను మీకు బిగ్ ఫ్యాన్‌‌ను' అని చెప్పి షాక్ ఇచ్చేశాడు.

ఎవరైనా చూస్తారారా అని:తేజ తన సినిమాలు చూశానని చెప్పగానే షకీలా ఊహించని విధంగా అతడి రెండు చెంపలు వాయించింది. అంతేకాదు, 'ఏరా చిన్నప్పుడు ఎవరైనా నా సినిమాలు చూస్తారారా' అంటూ కోలుకోలేని షాక్‌నే ఇచ్చింది. ఇదంతా ఫన్నీగానే సాగినప్పటికీ షకీలా టైమింగ్‌కు, ఆమె వ్యవహరించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. మొత్తానికి ఈ సీన్ బాగా హైలైట్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X