Jabardasth RP పెద్ద మోసగాడు.. ఆ ఇల్లు అతనిది కాదు.. 20 లక్షల మోసం.. బట్టబయలు చేసిన షేకింగ్ శేషు!

ప్రస్తుతం టాలీవుడ్ లో కిరాక్ ఆర్పీ హాట్ టాపిక్గా మారిపోయాడు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితమే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఆర్పీ జీ తెలుగులో అలాగే స్టార్ మాలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. కానీ తాజాగా తన కాబోయే భార్యతో కలిసి ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ మీద మల్లెమాల సంస్థ మీద అలాగే ఆ సంస్థ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి మీద ఆర్పీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే హైపర్ ఆది రాంప్రసాద్ స్పందించి అతను మాట్లాడేది కరెక్ట్ కాదని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వారి జాబితాలో షేకింగ్ శేషు కూడా చేరారు. ఆయన ఆర్పీ పెద్ద మోసగాడు అనే విషయాన్ని బయటపెట్టారు ఆ వివరాల్లోకి వెళితే

ఎక్కడో నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్ లో సర్వర్ గా జీవితం ప్రారంభించిన ఆర్పీ జబర్దస్త్ ద్వారా ఒక కమెడియన్ గా పాపులర్ అయ్యాడు. చాలా కాలం పాటు జబర్దస్త్ లో కొనసాగిన ఆయన నాగబాబు వెళ్లిపోయాక కూడా చాలా కాలం జబర్దస్త్ లోనే ఉన్నారు. తర్వాత నాగబాబు ప్రోత్సాహంతో ఆయన బయటకు వెళ్లి ప్రోగ్రామ్స్ చేస్తున్నాడని అంటూ ఉంటారు. అందులో నిజా నిజాలు ఏం మేరకున్నాయో తెలియదు కానీ ఈ మధ్యనే ఒక అందమైన అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా తన కాబోయే భార్యతో కలిసి ఒక ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్పీ ఈ సందర్భంగా జబర్దస్త్ పైన మల్లెమాల సంస్థ పైన అలాగే మల్లెమాల నిర్వాహకులు శ్యాం ప్రసాద్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు గుప్పించారు.

Shaking Seshu Made Sensational allegations on Kiraak RP

అక్కడ ఫుడ్ బాగోదని, శ్యాం ప్రసాద్ రెడ్డి గారు మనుషులను బానిసల్లాగా చూస్తారని, వేతనాలు పెంచమని అడగడానికి కొన్ని నెలలు పడుతుంది అని ఇలా ఒకటి కాదు కొన్ని పదుల సంఖ్యలో ఆరోపణలు గుప్పించారు. అయితే ఇది నిజం కాదని ఇప్పటికే హైపర్ ఆది రాంప్రసాద్ వంటి వారు సుదీర్ఘ ఇంటర్వ్యూలు ఇచ్చి క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా జబర్దస్త్ కంటెస్టెంట్ అయిన షేకింగ్ శేషు కూడా రంగంలోకి దిగారు. అసలు ఆర్పీ జబర్దస్త్ గురించి మాట్లాడిన మాటల్లో ఏ మాత్రం నిజం లేదని షేకింగ్ శేషు కొట్టి పారేశారు. జబర్దస్త్ యాజమాన్యం సరైన భోజనం కూడా పెట్టరు అంటూ ఆర్పీ ఆరోపణలు చేయడం నిజం కాదని సరైన భోజనం కూడా పెట్టకపోతే ఎనిమిదేళ్లు అదే జబర్దస్త్ లో ఎలా పని చేశాడు అంటూ ప్రశ్నించారు.

ఇక ఆర్పీ ఒక పెద్ద మోసగాడు అని పేర్కొన్న షేకింగ్ శేషు కొన్నాళ్ల క్రితం జేడీ చక్రవర్తి హీరోగా ఆర్పీ దర్శకుడిగా ఒక సినిమా ప్రారంభమైందనే విషయం మీకు గుర్తుండే ఉంటుందని గుర్తు చేశారు. నాగబాబు కూడా దాని ఓపెనింగ్ కి హాజరయ్యారని అన్నారు. అయితే తన ఊరికే చెందిన ఒక నిర్మాతను ఒప్పించి సినిమా చేయడానికి ఆర్పీ ప్లాన్ చేశాడని అన్నారు. అంతా బాగానే ఉంది కానీ సినిమా ఓపెనింగ్ కూడా అయ్యాక షూటింగ్ మొదలుకాకముందే 50 వేల రూపాయలు పెట్టి ఒక ఆఫీస్ రెంటుకు తీసుకున్నాడని, సినిమా కోసం అని చెబుతూ సుమారు 20 లక్షల రూపాయల ఖర్చు చేశాడని వెల్లడించారు. దీంతో నిర్మాత సినిమా ప్రారంభానికి ముందే ఇంత ఖర్చు చేస్తే సినిమా ప్రారంభమయ్యాక నా పరిస్థితి ఏమిటి? నేను సినిమా చేయలేను అని చెప్పేసాడు అని అన్నారు.

అంతేకాక తాను ఖర్చుపెట్టిన 20 లక్షలు తనకు ఇప్పించాల్సిందిగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఆర్పీ మీద ఫిర్యాదు కూడా చేశాడని ప్రస్తుతం దానికి సంబంధించిన కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాక ఆర్పీ హోమ్ టూర్ కూడా ఒక ఫ్రాడ్ అని అతను ఎవరిదో ఇంటిని తన ఇల్లు అని చూపించి తెలుగు ప్రేక్షకులందరికీ మోసం చేశాడని షేకింగ్ శేషు ఆరోపించారు. ఆర్పీ తన ఇల్లుగా చూపించే హోమ్ టూర్ ఇల్లు తనది కాదని ఒక ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్ ఇంటిని తన ఇంటిగా చూపిస్తూ ఆర్పి ఆ హోమ్ టూర్ చేశాడని దానికి మంచి వ్యూస్ కూడా వచ్చాయని డబ్బులు కూడా దండిగానే వచ్చాయి అనే విషయం తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. అది అతని ఇల్లు అనుకుని అతని చంక నాకమని తన భర్త్య తిట్టిందని అన్నారు.

ఇక ఆర్పీ కాబోయే భార్య గురించి మాట్లాడుతూ సుమారు రెండేళ్ల క్రితం ఆ అమ్మాయిని హైదరాబాద్ తీసుకువచ్చాడని కనీసం మా అమ్మాయిని ఇలా ఒకడు తీసుకువెళ్లాడు అని పోలీసులకు కేసు పెట్టేందుకు కూడా సాహసం చేయలేనంత పేద కుటుంబం వారిది అని అన్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం హైదరాబాద్ తీసుకువచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ఇది ఎంతవరకు కరెక్ట్ అని షేకింగ్ శేషు ప్రశ్నించారు. ఇలా పని చేసిన సంస్థ మీద ఆరోపణలు చేసిన వారు ఎప్పటికీ పై స్థాయికి వెళ్లలేరని ఇప్పటికే జబర్దస్త్ నుంచి చాలామంది వెళ్లారు కానీ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడ లేదని శేషు చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X