హైపర్ ఆది వల్ల సూసైడ్, నరకాన్ని చూపిస్తాడు.. జబర్దస్త్ వెనుక జరిగేది ఇదే: షేకింగ్ శేషు షాకింగ్ కామెంట్స్

జబర్దస్త్ టాప్ మోస్ట్ కామెడీ షో అయినప్పటికీ దాని వెనుక నిత్యం ఏదో ఒక వివాదం వైరల్ అవుతూనే ఉంటుంది. అమ్మోరు, అరుంధతి వంటి సినిమాలను నిర్మింసిగిన ప్రఖ్యాత మల్లెమాల సంస్థ నుంచి వచ్చిన ఆ షో 2013నుంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఎంత రేటింగ్ వచ్చినా కూడా షోపై ఎప్పటికప్పుడు విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మిగతా ఛానెల్స్ కూడా

మిగతా ఛానెల్స్ కూడా

జబర్దస్త్ కు వివాధాలు కాంట్రవర్సీలు కొత్తేమి కాదు. షో హిట్టయిన తరువాత మిగతా ఛానెల్స్ కూడా అదే ఫార్మాట్ లో కొన్ని కామెడీ షోలను ప్లాన్ చేశాయి. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. అలాగే జబర్దస్త్ ద్వారా కొత్త తరహా కమెడియన్స్ కూడా ఇండస్ట్రీకి వచ్చారు. మరికొందరు ఉన్న క్రేజ్ కూడా కోల్పోవాల్సి వస్తోంది.

జబర్దస్త్ కు దూరంగా ఉండడానికి కారణం

జబర్దస్త్ కు దూరంగా ఉండడానికి కారణం

అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షేకింగ్ శేషు జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా వయసుకు తగ్గ స్కిట్స్ చేయకపోవడం వలన ప్రజలు కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేశారని అలాగే ఎప్పుడు ఒకే తరహాలో చేయడం కూడా తనకు అంతగా నచ్చలేదని, అందుకే జబర్దస్త్ లో లీడర్ రోల్ ను వదిలేయాల్సి వచ్చినట్లు చెప్పారు.

కండిషన్ నచ్చలేదు

కండిషన్ నచ్చలేదు

ఎవరైనా పిలిస్తే మాత్రం కేవలం వాళ్ళ టీమ్ లో ఒక పాత్ర చేసి వస్తాను గాని టీమ్ లీడర్ గా చేయాలని అనుకోవడం లేదని అన్నారు. ఎందుకంటే మల్లెమాల ఇప్పుడు కఠిన నియమాలు తీసుకుందని జబర్దస్త్ తో అగ్రిమెంట్ కుదుర్చుకొని బయట షోలు చేసుకోవద్దని కండిషన్ పెట్టడం తనకు నచ్చలేదని అన్నారు. మొన్న అవినాష్ కూడా అదే తరహాలో వచ్చాడని శేషు అన్నారు.

జబర్దస్త్ రెమ్యునరేషన్స్..

జబర్దస్త్ రెమ్యునరేషన్స్..

ఆడదాని వయసు, జబర్దస్త్ రెమ్యునరేషన్స్ ఆడక్కూడదు. జబర్దస్త్ లో అందరికి సమానమైన రెమ్యునరేషన్స్ ఉండవు. వాళ్ళ అనుభవానికి తగ్గట్టుకుగానే ఇస్తారు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ఉంటాయి. అలా విధంగా చాలా మంది జబర్దస్త్ వల్ల ఇల్లు కూడా కట్టుకున్నారు.. అని తెలిపారు.

హైపర్ ఆది బాధ పెడతాడు

హైపర్ ఆది బాధ పెడతాడు

ఇక హైపర్ ఆది స్కిట్స్ గురించి మాట్లాడుతూ.. ఆది ఎక్కువగా ఎదుటి మనిషి తప్పుల్ని లోపాల్ని గెలుగుతూ కాన్సెప్ట్స్ లేపుతూ ఉంటాడు. దొరబాబూ, పరదేశి చేసిన తప్పుల్ని ఇంకా వాడుతూనే ఉన్నాడు. అయితే ఎదుటి మనిషి ఎంత బాధ పడతాడు అనేది అతనికి అవసరం లేదు. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని బాధ పెట్టకుండా చేయగలిగితేనే కామెడీ అంటారు.

సూసైడ్ చేసుకోవాలి అనేలా..

సూసైడ్ చేసుకోవాలి అనేలా..

వెనకాల సూదితో గుచ్చి ప్రేక్షకుల నవ్వించడం ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. రైజింగ్ రాజను, శాంతి స్వరూప్ వంటి వారిని కూడా ఎంతగానో అవమాన పరుస్తాడు. కానీ తను మాత్రం అవమానపడడు. టీమ్ లో ఎదుటి వారిని అతి దారుణంగా హింసిస్తాడు. కొన్నాళ్లకు అవతలి వ్యక్తి తిట్లకు సూసైడ్ చేసుకోవాలి అనేలా స్కిట్స్ చేస్తాడు. అతని స్టైల్ అదే అంటూ.. అలా కాకుండా మంచి కామెడీ చేస్తే బావుంటుందని షేకింగ్ శేషు అభిప్రాయం వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X