ఆ రెండ్రోజులు భయం భయంగా... నటి శైలజా ప్రియ షాకింగ్ కామెంట్స్
బుల్లితెరపై అడుగుపెట్టి వెండితెరపైనా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు శైలజా ప్రియా. సీరియల్స్‌తో పాటు సినిమాలతోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరో హీరోయిన్లకు తల్లిగా, అక్కగా, వదినగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటున్నారు. అటు బుల్లితెరపైనా సీరియల్స్‌తోనూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా ఓ సినిమా విషయంలో చోటు చేసుకున్న పరిస్థితులను శైలజా ప్రియ పంచుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
బుల్లితెర, వెండితెరలపై ముద్ర
తొలుత మాస్టర్, రాజకుమారుడు, గోకులంలో సీత, కత్తి కాంతారావు, మిర్చి, సన్నాఫ్ సత్యమూర్తి, రారండోయ్ వేడుక చూద్దాం సహా దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు శైలజా ప్రియ. ఇదే సమయంలో బుల్లితెరపైనా అవకాశాలు దక్కడంతో లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, జ్వాల, కొత్త బంగారం, మానస, చిన్న కోడలు, కృష్ణ ముకుందా మురారి, శశిరేఖా పరిణయం, నెం 1 కోడలు, నంది వర్సెస్ నందిని తదితర సీరియల్స్‌తో ఇక్కడా సత్తా చాటారు. బిగ్‌బాస్‌లోనూ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు. 7 వారాల పాటు బిగ్‌బాస్‌లో ఉన్న ఆమె టాప్ 5లో ఉంటారని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా శైలజా ప్రియ ఎలిమినేట్ అయ్యారు.

హీరోయిన్లను మించిన గ్లామర్
45 ఏళ్ల వయసులోనూ హీరోయిన్లను మించిన గ్లామర్‌తో మెరిసిపోతున్నారు శైలజా ప్రియ. సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌తో స్టార్స్‌కి పోటీ ఇస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన శంబాల సినిమాలో శైలజా ప్రియ కీలకపాత్ర పోషిస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్ సినిమాను నిర్మించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు నటించారు.
డిసెంబర్ 25న శంబాల
శ్రీచరణ్ పకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 22న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శైలజ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సీన్ కోసం 30 టేకులు తీసుకున్నా
శంబాలలో ఓ కీలక సన్నివేశం చిత్రీకరించడానికి డైరెక్టర్ గారు ఎంతో కష్టపడ్డారు. దాదాపు 25 నుంచి 30 టేక్స్ తీసుకున్నారు. ఇంటికొచ్చాక కూడా నేనే అదే ఫీలింగ్‌తోనే ఉన్నా. ఎక్కడి నుంచో గాల్లో పడుతున్న ఫీలింగే ఉంది. ఈ సినిమాలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సినిమా చేసేటప్పుడు ఒక్కో ఆర్టిస్ట్‌కు ఒక్కోలా ఫీలింగ్ ఉంటుంది. అరే ఈ సినిమా బలే ఉంటుంది.. ఈ సినిమా ఆడుతుందన్న వైబ్ ఉంటుంది. శంబాల చేసేటప్పుడు నిజంగా నాకు ఆ వైబ్ వచ్చింది. మరీ ముఖ్యంగా డబ్బింగ్ చెప్పేటప్పుడు. యాక్టింగ్ చేసేటప్పుడు కంటే డబ్బింగ్ చెప్పాక ఒకసారి ప్రీ ప్లే చేస్తారు కదా ఆ రష్ చూసేటప్పుడు ఆ సన్నివేశాలు నన్ను రెండ్రోజుల పాటు వెంటాడుతూనే ఉన్నాయి అని ప్రియ చెప్పారు. ఇంతలో దర్శకుడు సినిమా గురించి ఎలాంటి లీక్స్ ఇవ్వొద్దని సైగలు చేయడంతో ప్రియ అలర్ట్ అయ్యారు.
రెండ్రోజులు నన్ను వెంటాడాయి
నేను శంబాల సినిమా గురించిన ఈ సన్నివేశం గురించి చెప్పదలచుకోలేదు. కానీ ఈ సినిమా, సన్నివేశాలు నన్ను రెండ్రోజుల పాటు వెంటాడాయి. నేను కాల్ చేసి ఈ విషయాన్ని సాయిగారికి చెప్పాను. సాయిగారు ఎలా ఉందంటే అసలు గూస్‌బంప్సే. ఇంతకీమించి నేను ఏం చెప్పదలచుకోలేదు. మీరంతా ఈ నెల 25న దగ్గరలోని థియేటర్‌లో తప్పక చూడండి అని శైలజా ప్రియ చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శంబాలపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.


Click it and Unblock the Notifications











