Bigg Boss లో భారీ ఫైట్.. మూర్చపోయిన కంటెస్టెంట్.. మెడికల్ రూమ్‌లో
బిగ్‌బాస్ రియాలిటీ షోలో గొడవలు జరగడం సర్వసాధారణంగా మారాయి. కంటెస్టెంట్లు ఒకరిపై దూషించుకోవడం, అరుచుకోవడం షోలో పరిపాటిగా మారుతున్నది. అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో బాలీవుడ్ నటి షమితా శెట్టి, దేవలీనా భట్టాచార్జీ మధ్య ఈ మధ్య గొడవలు భారీగానే జరిగుతున్నాయి. గతంలో కూడా షమితా, దేవలీనా వాగ్వాదానికి దిగడం తెలిసిందే. అ
యితే తాజా బీబీ గేమ్‌లో నాన్ వీఐపీలు గెలుచుకొనే 50 లక్షల ప్రైజ్ మనీ విషయం వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ గేమ్‌లో వీఐపీలకు దేవలీనా సంచాలకురాలిగా వ్యవహరించగా, షమితా నాన్ వీఐపీ టీమ్‌కు సంచలాకురాలిగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో అభిప్రాయబేధాలు తలెత్తడంతో దారుణమైన ఫైటింగ్ చేసుకొన్నారు. వీఐపీలు ఇచ్చిన టాస్క్‌ను నాన్ వీఐపీలు తిరస్కరించడంతో వారిద్దరు గొడవపడ్డారు.

తాజా ప్రోమో ప్రకారం కంటెస్టెంట్లు భౌతిక దాడులకు దిగేంత వరకు వెళ్లడం కనిపించింది. దేవలీనా, షమితా మధ్య జరిగిన గొడవ తర్వాత ఇంటిలో పరిస్థితులు ఆందోళనకరంగా కనిపించాయి. దేవలీనాతో గొడవ తర్వాత శిల్పాశెట్టి సోదరి షమితా షెట్టి మూర్ఛకు గురైంది. వెంటనే కంటెస్టెంట్లు ఆమెను మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లడం కనిపించింది.
Recommended Video
షమితా షెట్టి నీ బుర్ర ఎక్కడుంది మై డార్లింగ్ అంటూ ప్రశ్నించింది. అలా తనను ప్రశ్నించే సరికి దేవలీనాకు కోపం ముంచుకొచ్్చింది. దాంతో నోరు అదుపులో పెట్టుకో అంటూ హెచ్చరించింది. ఆ తర్వాత మాట మాట పెరగడంతో ఒకరికొకరు దాడి చేసుకొనేంత పరిస్థితి కనిపించింది. దాంతో ఒక్కసారిగా దేవలీనా గట్టిగా అరవడంతో మూర్చపోయి కిందపడిపోయింది.


Click it and Unblock the Notifications











