Bigg Boss Telugu 6: ఐదుగురు గర్ల్​ ఫ్రెండ్స్​, సినిమా ఛాన్స్​ రోజే తల్లి మరణం.. షానీ సాల్మన్​ ఎమోషనల్​

ఎంతో పాపులరై అత్యధిక అభిమానులను సంపాదించుకున్న బిగ్​బాస్ తెలుగు రియాలిటీ షో కొత్త సీజన్​ చాలా గ్రాండ్​గా ప్రారంభమైంది. సెప్టెంబర్​ 4వ తేది ఆదివారం రోజున ప్రారంభమైన ఈ సీజన్​లో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు, కమెడియన్​ షానీ సాల్మన్​ వీడియో ఎంట్రీతో స్టేజ్​ పైకి అడుగుపెట్టాడు. స్వతహాగా అథ్లేట్​ అయిన షానీ సై, ఘర్షణ, దేవదాస్​, హ్యాపీ, రెడీ చిత్రాలతో అలరించాడు. ఇక స్టేజ్​ పైకి వచ్చిన సాల్మన్​ పలు విషయాలు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

మరింత జోష్​తో..

మరింత జోష్​తో..

బిగ్​బాస్​ తెలుగు ఆరో సీజన్​ జోరుగా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున గ్రాండ్​ ఎంట్రీతో ప్రారంభమైన ఈ సీజన్​.. బిగ్​ బాస్​ హౌజ్​లోకి సెలబ్రిటీలు అడుగుపెట్టడంతో మరింత జోష్​ వచ్చింది. ఈ క్రమంలోనే 14వ కంటెస్టెంట్​గా సై సినిమా ఫేమ్​ షాని సాల్మన్​ ఎంట్రీ ఇచ్చాడు.

సినిమా ఛాన్స్​ రోజే..

సినిమా ఛాన్స్​ రోజే..

ఒకప్పుడు అథ్లేట్​ అయిన షానికి లెగ్ ఇంజూరి కావడంతో ఆటలకు దూరమైనట్లుగా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి సై సినిమాకు ఆడిషన్స్​ జరుగుతున్నాయని తెలుసుకున్న షానీ అక్కడకు వెళ్లాడు. అయితే జక్కన్న సినిమా ఛాన్స్​ వచ్చిన రోజే తన తల్లి చనిపోయిందని తెలిపాడు.

ఐదుగురు గర్ల్​ఫ్రెండ్స్​..

ఐదుగురు గర్ల్​ఫ్రెండ్స్​..

ఈ విషయాన్ని నాగార్జునతో చెప్పుకుంటూ చాలా ఎమోషనల్​ అయ్యాడు షానీ. అలాగే తనకు ప్రస్తుతం ఐదుగురు ఎక్స్​ గర్ల్​ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా అందులో మొదటి ఎక్స్​ గర్ల్​ఫ్రెండ్​ పేరు నుంచి షానీ అని పెట్టుకున్నాని తెలిపాడు సాల్మన్​.

టాస్క్​లు ఇచ్చిన నాగార్జున..

టాస్క్​లు ఇచ్చిన నాగార్జున..

ఇదిలా ఉంటే షానికి కొన్ని టాస్క్​లు ఇచ్చాడు నాగార్జున. హౌజ్​లో ఒకరు తన వద్ద రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నట్లు.. మరో కంటెస్టెంట్​ను నమ్మించాలని చెప్పాడు. అలానే ఒక కంటెస్టెంట్​ క్యాస్టూమ్​ బావుందని.. కానీ, వారికి సూట్ అవ్వలేదని చెప్పమన్నాడు. ఇక చివరి టాస్క్​గా.. హౌజ్​లో ఉన్న ఎవరినైనా.. నువ్ కూడా ఒక సెలబ్రిటీవా? అని కామెంట్​ చేయాలని చెప్పాడు నాగార్జున. దీంతో కాస్తా ఇబ్బంది పడుతూనే ఒప్పుకున్నాడు షానీ.

కీలక పాత్రలో..

కీలక పాత్రలో..

కాగా 2003లో వచ్చిన సై సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షానీ సాల్మన్. ఆ తర్వాత ఘర్షణ, దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్క మగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసాని, అమరన్, గ్రే వంటి తదితర చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అలాగే 2021లో వచ్చిన రామ్​ అసుర్​ మూవీలో శివన్నగా కీలక పాత్ర పోషించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X