Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Bigg Boss Telugu 5: టాప్ 5లో ఉన్నది ఎవరంటే? వాళ్ళందరికీ షాక్.. జనం సర్వేలో తెలిందిదే!
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఎట్టకేలకు ఈ రోజుతో 11 వారాలు పూర్తి చేసుకుంటుంది. గడిచిన పది వారాలకు గాను పది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతానికి హౌస్ లో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవబోతుండగా అసలు టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఒక పాపులర్ సర్వే సంస్థ చేసిన సర్వే ప్రకారం టాప్ ఫైవ్ లో గత వారానికి గాను ఈ ఐదుగురు నిలిచారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆ సంస్థ సర్వే
ఓఆర్ మాక్స్ అని ఒక పాపులర్ మీడియా సంస్థ సినిమాలు అలాగే బుల్లితెర విశేషాలకు సంబంధించి ప్రేక్షకులు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనే అంశం మీద పోలింగ్ నిర్వహిస్తూ ఉంటుంది.. అయితే తాజాగా నవంబర్ 13వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ప్రేక్షకులు బిగ్ బాస్ 5 లో టాప్ ఫైవ్ లో ఉంటారు అని భావించింది ఐదుగురు పురుషులు గా తేలింది. మొదటి స్థానం షణ్ముఖ్ జస్వంత్ దక్కించుకోగా రెండవ స్థానం సన్నీ దక్కించుకున్నాడు.

ఆమెను తప్పిస్తే
ఇక మూడవ స్థానం యాంకర్ రవి దక్కించుకోగా నాలుగవ స్థానం శ్రీ రామచంద్ర దక్కించుకున్నాడు. మానస్ 5వ స్థానానికి పరిమితమయ్యాడు. ప్రస్తుతానికి హౌస్లో షణ్ముఖ్ జస్వంత్, సన్నీ , రవి, శ్రీరామ చంద్ర, మానస్, ప్రియాంక సింగ్, కాజల్, అని మాస్టర్, సిరి ఉన్నారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఆదివారం నాడు అనీ మాస్టర్ ఎలిమినేట్ అవబోతుంది. ఈ నేపథ్యంలో ఆమెను తప్పిస్తే ఎనిమిది మంది హౌస్ లో ఉంటారు.

ఆ ఐదుగురూ మగవారే
అయితే తాజాగా సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం ఐదుగురు కంటెస్టెంట్ లు మగవారే కావడం గమనార్హం. హౌస్ లో ఉన్న ఐదుగురు మగవాళ్ళు టాప్ ఫైవ్ లో ఉంటారు అని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి హౌస్ లో ఉన్నది తొమ్మిది మందే అయినా వాళ్లలో వాళ్లు గ్రూపులు పెట్టుకుని కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అనీ మాస్టర్, షణ్ముఖ్ జస్వంత్, సిరి శ్రీరామచంద్ర, రవి ఒక జట్టుగా కనిపిస్తూ ఉండగా సన్నీ, మానస్, ప్రియాంక సింగ్ ఒక జట్టుగా కనిపిస్తున్నారు.

టాప్ ఫైవ్ లో ఎవరు?
షణ్ముఖ్ జస్వంత్ అలాగే సిరి ఇద్దరూ కలిసి ఎక్కువగా సన్నీ ని టార్గెట్ చేస్తున్నారు.. అందుకు యాంకర్ రవి సహకరిస్తున్నాడు కూడా. మరోపక్క కాజల్ ను అనీ మాస్టర్ ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ఈ సంగతులు పక్కన పెడితే హౌస్ లో మరో సభ్యురాలు ఎలిమినేట్ అవబోతుండడంతో మొత్తం ఉన్న ఎనిమిది మందిలో టాప్ ఫైవ్ లో ఎవరు నిలుస్తారు ? అనేది ఆసక్తికరంగా మారింది..
Recommended Video

ఎవరు గెలుస్తారు?
టాప్ ఫైవ్ లో నిలబడిన ఇద్దరిలో ఒకరు విన్నర్ గా మరొకరు రన్నర్ గా నిలిచే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు టాప్ ఫైవ్ కి వెళ్ళాము అంటూ సరిపెట్టుోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఏడాది బిగ్ బాస్ కప్ ఎవరు గెలుచుకాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.