Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆమెతో కలిసున్న ఫొటోతో షణ్ముఖ్ సర్‌ప్రైజ్: పాత రోజులు గుర్తు చేసేలా జంటగా!
సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుని సంచలనంగా మారిపోయారు. అందులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్సులు, మరికొన్ని వీడియోలతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని అందుకున్నాడు.
ఇక, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం షణ్ముఖ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అదే సమయంలో దీప్తి సునైనా కూడా అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇలాంటి పరిస్థితుల్లో షణ్ముఖ్ జస్వంత్ తాజాగా ఓ అమ్మాయితో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి మరి!

తెలుగులో టాప్.. బిగ్ బాస్ ఎంట్రీ
షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియాలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. తద్వారా టాప్ యూట్యూబర్‌గా పేరొందాడు. ఈ క్రేజ్ కారణంగానే అతడు బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులోకి టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా మంచి గేమ్‌తో మెప్పించాడు.
Bheemla Nayak Collections: భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డు.. పవన్ దెబ్బకు పుష్ప, బాహుబలి వెనక్కే!

తప్పులతో ఇమేజ్, టైటిల్ అవుట్
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో మంచి ఆటతీరుతో పేరు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సిరి హన్మంత్‌తో రొమాన్స్ వల్ల విమర్శలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో ఇమేజ్‌తో పాటు టైటిల్‌నూ కోల్పోయాడు.

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి
చాలా కాలంగా షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ ప్రకటించి కోలుకోలేని షాకిచ్చింది.
Bigg Boss Non Stop: షో ప్రారంభానికి ముందు బిగ్ షాక్.. చివరి నిమిషంలో తప్పుకున్న కంటెస్టెంట్

రంగంలోకి.. సిరీస్ స్టార్ చేశాడుగా
బిగ్ బాస్ వల్ల చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ గురించి ప్రకటన చేశాడు. ప్రస్తుతం అతడు ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్' అనే వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. దీన్ని సుబ్బు కే తెరకెక్కించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్', ‘సూర్య' చేశారు. త్వరలోనే షూట్ స్టార్ట్ కాబోతుంది.

అందులో అప్‌డేట్లతో సందడిగా
షణ్ముఖ్ జస్వంత్ పాపులర్ అవడానికి సోషల్ మీడియాలో కారణం అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అతడు ఇప్పటికీ అందులో యాక్టివ్‌గా ఉంటూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన అప్‌డేట్లను ఇస్తుంటాడు. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నాడు. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటున్నాడు.
మితిమీరిన హీరోయిన్ హాట్ షో: లోపలివి కూడా కనిపించేలా.. అసలు ఇది డ్రెస్సెనా!

ఆమెతో కలిసున్న సెల్ఫీ వదిలి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే షణ్ముఖ్ జస్వంత్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేశాడు. ఇందులో అతడితో పాటు ప్రముఖ నటి వైష్ణవి చైతన్య కూడా ఉంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘ద సాఫ్ట్‌వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న ప్రచారం కూడా జరిగిన విషయం తెలిసిందే.
Recommended Video

అప్పుడు ఎంత బాగుండేది వైషు
వైష్ణవి చైతన్య కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్.. దీనికి ‘ద సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లో ఈ మొబైల్ ఫోన్ వాడి ఉంటే ఎంత బాగుండేది వైషూ.. డామిట్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక, ఇందులో షణ్ముఖ్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. దీంతో ఈ పిక్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.