హార్ట్ బ్రేక్ అయిన బాధలో దీప్తి.. అన్నీ వదిలేసి చిల్ మూడ్ లో సిరి, షణ్ముఖ్..కానీ!
సోషల్ మీడియాలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు పెట్టే ఫొటోలకు, వీడియోలకు లక్షల్లో లైకులు వస్తుంటాయి. డబ్స్మాష్ లతో కెరీర్ మొదలు పెట్టిన దీప్తి యూట్యూబర్ గా మారినప్పటి నుంచి తన కో స్టార్ షణ్ముఖ్ తో రిలేషన్ లో ఉంది. అయితే అనూహ్యంగా దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పగా షణ్ముఖ్, సిరి పార్టీకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

కెరీర్‌పై దృష్టి పెట్టలేదని
దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ విడిపోవడం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హాట్ టాపిక్ అయింది. న్యూ ఇయర్ ముందు రోజు షణ్ముఖ్, దీప్తి సునైనా విడిపోయారని ప్రకటించారు. అభిమానులతో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ఇంటరాక్షన్‌లో, దీప్తి తన అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తూ లైవ్ సెషన్‌ను ప్రారంభించింది, ఇక విడిపోయిన కారణంగా తాను సైలెంట్ గా ఉండనని చెప్పింది. లైవ్ సెషన్‌లో ఆమె మానసికంగా కుంగిపోయింది. తానెప్పుడూ తనపై, తన కెరీర్‌పై దృష్టి పెట్టలేదని, ఇప్పుడు తన కెరీర్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పింది.

వినయ్‌కి ధన్యవాదాలు
ఆమె తన ఇటీవలి ఆన్‌లైన్ వీడియోలను రూపొందించిన వినయ్‌కి ధన్యవాదాలు తెలిపింది, అతనే తన అతిపెద్ద సపోర్ట్ సిస్టమ్ అని చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ హౌస్ లో ఉన్నంతకాలం దీప్తి సపోర్ట్ చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో క్యాంపైన్ కూడా కండక్ట్ చేసింది. షణ్ముఖ్ పై జరిగిన ట్రోలింగ్ ను బలంగా ఎదుర్కొంది. తన మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. తట్టుకొని షణ్ముఖ్ కి అండగా నిలిచింది.

సిరితో సన్నిహితంగా షణ్ముఖ్
లోపల ఏం జరుగుతుందో? మీకు తెలియదు అనవసరంగా ఒక కొలిక్కి రావద్దని చెప్పేది, కానీ అనూహ్యంగా షణ్ముఖ్ మాత్రం హౌస్ లో సిరితో బాగా క్లోజ్ అయిపోయాడు. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడంతో వారిద్దరి హగ్గులు, ముద్దుల గురించి పెద్ద రచ్చయే జరిగింది. ఈ విషయంలో దీప్తి చాలా హర్ట్ అయి, షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. దీప్తి సునైనా తనకు ఏమీ వివరించడానికి షణ్ముఖ్‌ను అనుమతించలేదు. సిరితో షణ్ముఖ్ సన్నిహితంగా ఉండటం చూసి దీప్తి చాలా బాధ పడ్డారని అంటున్నారు.

ఆస్క్ మి ఎనీథింగ్ చాట్ సెషన్‌లో
ఈ విషయాన్ని స్వయంగా షన్ను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆస్క్ మి ఎనీథింగ్ చాట్ సెషన్‌లో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా తన కాంటాక్ట్ నంబర్‌ను బ్లాక్ చేసిందని వెల్లడించాడు. షణ్ను ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా, దీప్తి మాత్రం షణ్ణూ సాకులను వినే మూడ్‌లో లేదని అంటున్నారు. హార్ట్ బ్రేక్ అవ్వడంతో దీప్తి చాలా బాధ పడుతోందని తెలుస్తోంది. అయితే షణ్ముఖ్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ లు షేర్ చేస్తున్నా కానీ తన లైఫ్ లో మూవ్ ఆన్ అయినట్లు చెబుతున్నారు.
Recommended Video

సిరి, జెస్సీలతో కలిసి చిల్
హౌస్ లో బాగా క్లోజ్ అయిన సిరి, జెస్సీలతో కలిసి చిల్ అవుతున్నాడట షణ్ముఖ్. రీసెంట్ గా సిరి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోగా దానికి షణ్ముఖ్ అటెండ్ అయ్యాడని కానీ ఫోటోలు బయటకు రాకుండా చూసుకున్నారని తెలుస్తోంది. షణ్ముఖ్ బ్రేకప్ కు కారణమైన సిరితో ఇంకా క్లోజ్ గా ఉంటుండడంతో ఏం సంకేతాలు ఇస్తున్నారని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క దీప్తిని ధైర్యంగా ఉండమని కూడా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











