Shanmukh Jaswanth అమ్మా!క్యాన్సర్‌ను జయించావు అంటూ జస్వంత్.. నీవు లేకపోతే నేను లేను.. అని మాస్టర్ ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ఎనిమిదో వారానికి చేరుకొన్నది. ఇప్పటికే ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఎనిమిదో వారానికి ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియను మొదలు పెట్టగా అందులో భావోద్వేగాల్ పీక్స్‌లో కనిపించాయి. పోస్ట్ మ్యాన్ టాస్క్ సందర్బంగా తమకు వచ్చిన లెటర్లను ఇవ్వకుండా నామినేట్ చేపే ప్రక్రియలో కంటెస్టెంట్లు ఎమోషనల్‌గా కంటతడి పెట్టుకొన్నారు. ముఖ్యంగా సిరి హన్మంతు, లోబో, షణ్ముఖ్ జస్వంత్, అనీ మాస్టర్ ఏడుస్తూ కనిపించారు. తాజా ప్రోమోలో కనిపించిన విషయాలు ఏమిటంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

పోస్ట్ మ్యాన్ టాస్క్‌తో నామినేషన్ ప్రక్రియ

పోస్ట్ మ్యాన్ టాస్క్‌తో నామినేషన్ ప్రక్రియ

పోస్ట్ మ్యాన్ టాస్క్‌లో వచ్చిన ఇంటి సభ్యులకు వచ్చిన ఉత్తరాలను మానస్, శ్రీరామచంద్ర తీసుకొచ్చి లాన్‌లో పచ్చటి గడ్డిపై పోశారు. ప్రియమైన వారి నుంచి వచ్చే లేక మీకు ఎంతో అమూల్యమైనది అంటూ బిగ్‌బాస్ కామెంటరీ వినిపించింది. ఉత్తరాల నుంచి ఓ లెటర్‌ను తీసుకొని లోబో నీ కోసం ఉత్తరం అంటూ మానస్ తీసి చూపించాడు. అలాగే మీ తల్లిదండ్రుల నుంచి ప్రియాంకకు లెటర్ అంటూ శ్రీరామచంద్ర చూపించాడు.

ప్రియాంక కంటతడి పెడుతూ..

ప్రియాంక కంటతడి పెడుతూ..

తనకు వచ్చిన లెటర్ గురించి ప్రియాంక స్పందిస్తూ.. ఎన్నో ఏళ్లుగా మా నాన్నతో సరిగా మాట్లాడలేను అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రియాంక చెప్పిన విషయాలు విని కాజల్‌తో సహ ఇంటి సభ్యులందరూ ఎమోషనల్ అయ్యారు. అయితే యాంకర్ రవికి వచ్చిన ఉత్తరాన్ని ఇవ్వడానికి లోబో నిరాకరించాడు. యాంకర్ రవిని ఉద్దేశించి మాట్లాడుతూ.. నీకు చూసుకోవడానికి నీకు రెండు లెటర్లు ఉన్నాయి. పాప డాల్ ఉంది. టీషర్ట్ ఉన్నాయి.. కానీ శ్రీరామచంద్రకు ఏమీ లేవు అంటూ... అందుకే వాడికి ఆ లెటర్ ఇస్తాను అని లోబో చెప్పడం కనిపించింది.

నా పాప డ్రాయింగ్ వేసి అంటూ లోబో

నా పాప డ్రాయింగ్ వేసి అంటూ లోబో

ఇక మానస్‌కు వచ్చిన లెటర్ ఇవ్వలేని పరిస్థితి ప్రియాంకకు ఎదురైంది. నేను ఇది చేయలేను అంటూ ప్రియాంక కన్నీటి పర్యంతమైంది. అలాగే సిరిని ఉద్దేశించి.. నాకు ఈ లెటర్ కావాలి అంటే.. సిరి హన్మంతు ఇచ్చే అతడికి కౌగిలిని ఇచ్చేసింది. ఇక సిరికి తన లవర్ నుంచి వచ్చిన లెటర్ ఇవ్వకుండా దానిని స్క్రాప్ మిషన్‌లో షణ్ముఖ్ వేయడంతో ఆమె ఏడుపులో మునిగిపోయింది. నా పాప డ్రాయింగ్ వేసింది.. కళ్ల ముందు లెటర్ చినిగిపోయింది అంటూ లోబో కంటతడి పెట్టడం కనిపించింది.

 అమ్మా నీవు క్యాన్సర్‌ను జయించావు కదా అంటూ

అమ్మా నీవు క్యాన్సర్‌ను జయించావు కదా అంటూ

ఇక అనీ మాస్టర్‌ కూడా ఎమోషనల్ అయ్యారు. నీవు లేకుంటే నాకు జీవితంలో ఏమీ లేదు అంటూ ఏడుపు అందుకొన్నది. ఇక షణ్ముఖ్ ఎమోషనల్‌గా తొలిసారి నోరు విప్పారు. అమ్మా క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డావు. అమ్మమ్మ చనిపోయినప్పుడు మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొన్నావు. ఇలాంటి విషయాల్లో నీవే నాకు స్పూర్తి. నేను కూడా నీలానే మానసికంగా దృఢంగా ఉంటాను అని షణ్ముఖ్ అంటూ గట్టిగా డైలాగ్స్ కొట్టుకొంటూ వెళ్లిపోతూ కనిపించాడు.

Recommended Video

Bigg Boss Telugu 5: కెప్టెన్ VJ Sunny కి Priya కిస్, Anee కు అందరి ముందే ముద్దులు| FIlmibeat Telugu
 8వ వారం నామినేట్ అయింది వీరే..

8వ వారం నామినేట్ అయింది వీరే..

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో ఎనిమిదో వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియ చాలా ఉద్వేగంగా ముగిసినట్టు స్పష్టమైంది. అయితే ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం ఇంటిలోని ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్, లోబో, మానస్, ఆర్జే కాజల్, యాంకర్ రవి, శ్రీరామచంద్ర ఉన్నట్టు సమాచారం. అధికారికంగా నామినేట్ అయిన వారి వివరాలు రాత్రికి ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X