దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేర్లకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా వీళ్లిద్దరూ చాలా కాలంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆరంభంలో ఎవరికి వాళ్లు వీడియోలు చేస్తూ వచ్చినా.. ఆ తర్వాత జంటగా మారారు. ఈ క్రమంలోనే ఎన్నో సిరీస్‌లు, డ్యాన్స్ వీడియోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ వంటివి చేశారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో కూడా పడిపోయారు.

అలా చాలా ఏళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చారు. అయితే, ఇటీవలే దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పేసింది. దీంతో అప్పటి నుంచి ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా షన్నూ తండ్రి ఓ సంచలన నిజాన్ని లీక్ చేసేసి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటో మీరూ చూడండి!

జంటగా ఫేమస్.. పెళ్లి కూడా అని

జంటగా ఫేమస్.. పెళ్లి కూడా అని

సోషల్ మీడియా ద్వారా ప్రేమలో పడిన దీప్తీ సునయన.. షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కంటే జోడీగానే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. దీంతో కష్ట సమయాల్లోనూ ఒకరికి ఒకరు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే దీప్తి, షన్నూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

బిగ్ బాస్ వ్యవహారంతో చిక్కులు

బిగ్ బాస్ వ్యవహారంతో చిక్కులు

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో అతడు సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడు ఓడిపోవడంతో పాటు ప్రేమలో చిక్కులు వచ్చాయి.

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన దీప్తి

విడిపోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో న్యూ ఇయర్ రోజు దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును కూడా చేసింది. 'చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ ప్రియుడికి భారీ షాక్ ఇచ్చిందామె.

అంతా మంచే జరగాలన్న షన్నూ

అంతా మంచే జరగాలన్న షన్నూ

బ్రేకప్ గురించి దీప్తి సునైనా ప్రకటించిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కూడా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. ఆల్ ది బెస్ట్ దీపు.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీళ్ల బంధం ముగిసిపోయిందని ఫ్యాన్స్ బాధ పడుతున్నారు.

బ్రేకప్ తర్వాత వీళ్లిద్దరలా చేస్తూ

బ్రేకప్ తర్వాత వీళ్లిద్దరలా చేస్తూ

విడిపోయినట్లు ప్రకటించిన తర్వాత దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ సోషల్ మీడియాలో పలు రకాల పోస్టులు పెడుతున్నారు. దీంతో వీళ్ల బాధను పోస్టుల రూపంలో వ్యక్త పరుస్తున్నారు. తనకు తండ్రి అండగా ఉన్నాడని దీప్తి ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది. షణ్ముఖ్ అయితే కుక్కతో ఫొటోలు దిగి దేవదాసులా ఫోజులిస్తున్నాడు. దీంతో ఇద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త

దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త

దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ తర్వాత ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ తండ్రి దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'వాళ్లిద్దరూ కలిసే ఉంటారు. దీప్తి బ్రేకప్ చెప్పింది కానీ, షణ్ముఖ్ చెప్పలేదు కదా. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు' అని శుభవార్త చెప్పారు.

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh Unstoppable | VJ Sunny Rampage | Filmibeat Telugu
సంచలన నిజం చెప్పిన తండ్రి

సంచలన నిజం చెప్పిన తండ్రి

కొడుకు బ్రేకప్ గురించి షణ్ముఖ్ జస్వంత్ తండ్రి ఇంకా మాట్లాడుతూ.. 'ఆ అమ్మాయి (దీప్తి)కి ఫీలింగ్ అనిపించిందేమో కానీ.. ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉంటారు. ఇందులో ఎవరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కానీ, కలిసేందుకు కొద్దిగా టైమ్ పడుతుంది అంతే' అంటూ సంచలన నిజాన్ని బయట పెట్టారాయన. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తారని అంతా అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X