షణ్ముఖ్ జస్వంత్ సంచలన పోస్ట్: గర్ల్‌ఫ్రెండ్‌పై ఘోరంగా.. నన్ను తప్ప అందరినీ అంటూ!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దీన్ని మంచిగా వాడుకుని ఎంతో మంది తెలుగు యువకులు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను, ఆఫర్లను దక్కించుకుంటోన్నారు. అందులో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్ వంటివి చేస్తూ యూత్‌లో ఫాలోయింగ్ పెంచుకున్న అతడు.. బిగ్ బాస్ వల్ల మరింత పేరు తెచ్చుకున్నాడు. అయితే, దీప్తి సునైనాతో బ్రేకప్ తర్వాత అతడికి ఎన్నో షాక్‌లు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో షన్నూ తాజాగా చేసిన పోస్ట్ సంచలనం అవుతోంది. ఆ వివరాలు మీకోసమే!

అలా వచ్చాడు.. ఫుల్ పాపులర్

అలా వచ్చాడు.. ఫుల్ పాపులర్

టీనేజ్‌లోనే షణ్ముఖ్ కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు సహా 'వైవా' సిరీస్‌లో నటించాడు. అలా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్స్ చేసి అలరించాడు. దీంతో అతడికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అతడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యాడు. ఫలితంగా ఫుల్ పాపులర్ అయిపోయాడు.

బిగ్ బాస్‌ షో వల్ల చెడ్డపేరుతో

బిగ్ బాస్‌ షో వల్ల చెడ్డపేరుతో


సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన షణ్ముఖ్ జస్వంత్ గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ, హౌస్‌లో సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రచ్చ వల్ల అతడికి చెడ్డ పేరు వచ్చింది. అలాగే, ట్రోఫీ గెలవడంపైనా ప్రభావాన్ని చూపింది.

బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా

బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా


షణ్ముఖ్ జస్వంత్‌ బిగ్ బాస్‌లో సిరి హన్మంత్‌తో వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో దీప్తి సునైనా కూడా అతడిపై అసంహనంగా ఉంది. ఫలితంగా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ గత ఏడాది అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన వదిలింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని వెల్లడించాడు.

ఆ సిరీస్‌తో.. మంచి రెస్పాన్స్

ఆ సిరీస్‌తో.. మంచి రెస్పాన్స్


బిగ్ బాస్ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల నిరాశ చెందాడు. ఇక, కొంత గ్యాప్ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'తో వచ్చి అలరించాడు.

జానూ అంటూ మరో భామతో

జానూ అంటూ మరో భామతో

గతంలో షణ్ముఖ్ జస్వంత్ వరుసగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేశాడు. అయితే, ఇప్పుడతను అంత స్పీడుగా ప్రాజెక్టులు చేయట్లేదని ఫ్యాన్స్ బాధ పడుతోన్నారు. ఇలాంటి సమయంలో ఈ యూట్యూబర్ ఇప్పుడు 'జానూ' అనే సాంగ్‌తో రాబోతున్నాడు. ఇందులో సుస్మితా శెట్టి అనే అమ్మాయి ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోను కూడా వదిలారు.

షన్నూ పోస్ట్.. ఫ్యాన్ కామెంట్

షన్నూ పోస్ట్.. ఫ్యాన్ కామెంట్

'జానూ' పాట సమయంలో సుస్మితతో తీసుకున్న ఓ ఫొటోను షణ్ముఖ్ జస్వంత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి తన అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన దక్కుతోంది. అదే సమయంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ 'హేయ్ చక్కని బైకుంది.. హేయ్ పక్కన పిల్లుంది.. హేయ్ చల్లని గాలుంది.. అటు లాగింది' అంటూ ఈ పిక్‌కు కామెంట్ చేశాడు.

ఫన్నీ రిప్లై.. ఎవరి గురించి?

ఫన్నీ రిప్లై.. ఎవరి గురించి?


సదరు నెటిజన్ చేసిన కామెంట్‌కు షణ్ముఖ్ జస్వంత్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. 'అవి అన్నీ వీడియోలోనే బాగుంటాయి. రియల్ లైఫ్‌లో.. హేయ్ చక్కని బైకుంది.. హేయ్ పక్కన పిల్లుంది.. హేయ్ తను నన్ను తప్ప అందరినీ చూస్తుందీ' అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ కామెంట్ తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునైనాను ఉద్దేశించే చేశాడని పలువురు చెప్పుకుంటోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X