For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shanmukh Jaswanth: షణ్ముఖ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. పెళ్లి కోరిక తీరకుండానే దూరం

  |

  సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది యువతీ యువకులు సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు ఆఫర్లను కూడా దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్ వంటివి చేస్తూ అతడు అప్‌లోడ్ చేసిన వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా అతడి పేరు ట్రెండింగ్ అయిపోయింది. ఇంతగా పాపులర్ అయిన షన్నూకు ఈ మధ్య కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అతడి కుటుంబంలో విషాదకర సంఘటన జరిగింది. ఈ విషయాన్ని షణ్ముఖ్ స్వయంగా వెల్లడించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

   బిగ్ బాస్ ఎంట్రీ.. పరాభవంతోనే

  బిగ్ బాస్ ఎంట్రీ.. పరాభవంతోనే

  సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయిన షణ్ముఖ్ జస్వంత్ గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ, హౌస్‌లో సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రచ్చ వల్ల అతడికి చెడ్డ పేరు వచ్చింది. ఇది విజయంపై ప్రభావాన్ని చూపించింది.

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  దీప్తి సునైనాతో బంధానికి బ్రేకప్

  దీప్తి సునైనాతో బంధానికి బ్రేకప్


  బిగ్ బాస్‌లో వ్యవహరించిన తీరుతో షణ్ముఖ్ జస్వంత్‌ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో దీప్తి సునైనా కూడా అతడిపై విముఖత వ్యక్తం చేసింది. ఫలితంగా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ కొన్ని నెలల క్రితమే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన వదిలింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని ఓ పోస్టులో తెలిపాడు.

   కెరీర్‌పై ఫోకస్.. ఆ వెబ్ సిరీస్‌తో

  కెరీర్‌పై ఫోకస్.. ఆ వెబ్ సిరీస్‌తో


  బిగ్ బాస్ షో వల్ల చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్'ను ప్రకటించాడు. దీన్ని సుబ్బు కే తెరకెక్కించబోతున్నాడు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్మిస్తోంది. దీనికోసం అతడు సిద్ధం అవుతున్నాడు.

  హీరోయిన్ బెడ్‌రూం వీడియో వైరల్: బట్టలు విప్పేసి మరీ అలా కనిపించడంతో!

  షణ్ముఖ్ జస్వంత్‌తో మరో దెబ్బ

  షణ్ముఖ్ జస్వంత్‌తో మరో దెబ్బ


  ఒకవైపు బిగ్ బాస్ షోలో పిచ్చి పిచ్చి పనులతో పరువు పోగొట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్.. ఆ తర్వాత ప్రియురాలు దీప్తి సునైనాకు కూడా దూరం అయ్యాడు. దీనికితోడు అతడిని అభిమానించే వాళ్లు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇలా వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగిలించుకుంటోన్న అతడికి తాజాగా మరో భారీ షాక్ తగిలింది. తాజాగా షన్నూ కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది.

  షణ్ముఖ్ ‘బామ్మ' కన్నుమూత

  షణ్ముఖ్ ‘బామ్మ' కన్నుమూత


  షణ్ముఖ్ జస్వంత్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే అతడి బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని అతడే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. చాలా కాలంగా వృద్దాప్య సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆమె.. ఆదివారం పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో షణ్ముఖ్‌తో పాటు అతడి కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది.

  అనుష్క శర్మ ఎద అందాల ఆరబోత: తల్లైనా తగ్గకుండా.. కోహ్లీ భార్యను ఇలా చూశారంటే!

  Recommended Video

  Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
  పెళ్లి కోరిక తీరకుండానే దూరం

  పెళ్లి కోరిక తీరకుండానే దూరం


  తన బామ్మ మరణ వార్తను తెలిపేందుకు షణ్ముఖ్ జస్వంత్ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ఆమె ‘నీ పెళ్లి చూసే వరకు కూడా నేను ఉండను. నువ్వు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేవుగా' అని అన్నారు. దీనికి షణ్ముఖ్‌తో పాటు పక్కనున్న వాళ్లు ‘నువ్వు పెళ్లి అయ్యేంత వరకూ ఉంటావులే' అని చెప్పారు. కానీ, ఆమె ఆ కోరిక తీరకుండానే మరణించి అందరికీ శోకాన్ని మిగిల్చారు.

  English summary
  Famous Youtuber Shanmukh Jaswanth Grandmother Passed Away Due To Health Issues. He Shares This News Via Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X