Bigg Boss లో షణ్ముఖ్ యూటర్న్.. వీజే సన్నీతో రచ్చ.. అలా బుక్కైన సిరి హన్మంతు!

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 14వ వారం టాస్కులతో సరదాగా, గందరగోళంగా గడిచిపోతున్నది. ఇంటిలో మూడో సంఘటన టాస్క్‌ చేయాలని కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ సూచించాడు. ఎవరి వంట వారే అనే టాస్క్‌ను ఇచ్చాడు. శ్రీరామచంద్ర కెప్టెన్‌గా ఉన్న సమయంలో జరిగిన ఐకానిక్ సీన్‌ను రీ క్రియేట్ చేయాలని సూచించారు. జెస్సీకి శ్రీరామచంద్రకు జరిగిన వాగ్వాదం, సిరి హన్మంతు, షణ్ముక్ జస్వంత్ గొడవను మెయిన్ టాపిక్‌గా చేసుకోవాలని సూచించాడు. అయితే ఈ టాపిక్ గురించి చెబుతూ షణ్ముఖ్‌ను పాయింట్ అవుట్ చేసిన వీజే సన్నీపై షన్ను సీరియస్ అయ్యాడు. ఆ సందర్భంగా వీజే సన్నీ, షణ్ముఖ్ మధ్య భారీగానే వాగ్వాదం చోటుచేసుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..

ఎవరి వంట వారే అనే టాస్క్‌

ఎవరి వంట వారే అనే టాస్క్‌


ఎవరి వంట వారే అనే టాస్క్‌ కోసం ఎవరెవరూ ఏ పాత్రలు చేయాలని డిసైడ్ అయ్యారు. వీజే సన్నీ మాత్రం హమీదా రోల్‌ను వేయాలని డిసైడ్ చేసుకొన్నాడు. ఆ గొడవ జరిగిన సందర్భంలో జరిగిన విషయాలను చర్చించుకొంటున్నాను. ఈ గొడవ సందర్భంగా సిరి హన్మంతు, వీజే సన్నీ సీన్‌లోకి వచ్చారు. అయితే అనీ మాస్టర్ ఎవరు అంటూ గట్టిగా సమాధానం ఇవ్వడంతో షణ్ముఖ్ వెనుకకు తిరిగి వెళ్లిపోతూ యూటర్న్ తీసుకొన్నాడు అంటూ సన్నీ చెప్పడంపై షన్ను అభ్యంతరం వ్యక్తం చేశాడు.

వెక్కిరిస్తే నేను ఊరుకోను

వెక్కిరిస్తే నేను ఊరుకోను


అయితే వీజే సన్నీ యూటర్న్ అంటూ వాడిన మాటలపై షన్ను అభ్యంతరం వ్యక్తం చేశాడు. అందుకే నిన్ను చేయవద్దని చెబుతున్నాను. నీకు ఇలాంటి విషయాలు చేయవద్దని నిన్న చెప్పాను. జరగని విషయాలు చేయవద్దని చెప్పాను అని షణ్ముఖ్ అంటే.. అనీ మాస్టర్ గట్టిగా రెస్పాండ్ కావడంతో మీరు యూటర్న్ తీసుకొన్నారు అంటూ షణ్ముఖ్ చెప్పాడు. ప్రతీది గొడవపడకండి.. నేను చాలా కూల్‌గా ఉన్నాను అని సన్నీ అంటే.. నేను కూడా కూల్‌గా ఉన్నాను. నన్ను వెక్కిరిస్తే నేను ఊరుకోను అంటూ షణ్ముఖ్ సమాధానం ఇచ్చాడు. యూటర్న్ తీసుకొన్నావంటే.. కాదంటే.. అన్నీ నీకు నచ్చినవే రైట్ అనడం సరికాదు అని సన్నీ.. నేను ఎప్పుడూ ఏమి చెప్పలేదు. నీవు ఇమిటేట్ చేయడం నాకు నచ్చదు అని షణ్ముఖ్ అన్నాడు.

నన్ను ఇమిటేట్ చేయవద్దు

నన్ను ఇమిటేట్ చేయవద్దు

టాస్క్ అంటే ఆ సీన్‌లో ఏం జరిగిందో చేయాలి. ఏదైనా చేస్తే ఇమిటేట్ చేయొద్దంటే టాస్క్ చేయడమే వేస్ట్. మజాక్ చేసినా దానిని సీరియస్‌గా తీసుకోవడం కరెక్ట్ కాదు అని సన్నీ అంటే.. కాదు బ్రో.. నా పాత్రను నువ్వు చేస్తే దాని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నీవు నన్ను ఇమిటేట్ చేయవద్దు అంటూ షన్ను కామెంట్ చేశాడు. దాంతో నీవు ఎలాంటి ఉంటే సొసైటీలో బతకలేవు. కామెంట్స్ చేస్తే తీసుకోకపోతే నీకు బయట చాలా సమస్యలు ఎదురవుతాయి అని సన్నీ అంటే... నేను అలానే ఉంటాను అని సన్నీ చెప్పాడు.

నా విషయంలో మజాక్ చేయొద్దు

నా విషయంలో మజాక్ చేయొద్దు


పాత్ర ఎలా ఉందో అలా చేస్తే నాకు నచ్చదు అంటే కరెక్ట్ కాదు. బిగ్‌బాస్ ఎలా చెబతే అలా చేయాలి. నాకు నచ్చదు అంటే కుదరదు అని సన్నీ అన్నాడు. అయితే ఆ పాత్ర నేను చేయను అంటూ షణ్ముఖ్ అన్నాడు. దాంతో నీవు బిగ్‌బాస్‌కు చెప్పు. క్యారెక్టర్ విషయంలో మజాక్ చేయొద్దు.. ఇమిటేట్ చేయకూడదు అంటే ఎలా అని సన్నీ ఘాటుగా స్పందించాడు. అయితే నేను ఆ పాత్ర చేయను అంటూ షన్ను మొండికేశాడు.

సన్నీతో మానస్ అభ్యంతరం అంటూ

సన్నీతో మానస్ అభ్యంతరం అంటూ


అయితే యూటర్న్ అంటూ సన్నీ చేసిన కామెంట్‌పై మానస్ స్పందించాడు. ఆ మాటతో షన్ను హర్ట్ అయ్యాడు. నీవు అలా అనకుండా ఉండాల్సింది అని మానస్ అంటే.. అలా అనడం వెనుక నాకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు అని సన్నీ సమాధానం ఇచ్చాడు. అయితే సన్నీ చేసిన కామెంట్‌లో ఏమీ లేదు. హైపర్ ఆది కూడా అదే విషయాన్ని పాయింట్ అవుట్ చేశాడు కదా అని కాజల్ అన్నది. అయితే మానస్ మాత్రం అలా అనకుండా ఉండాల్సింది కాదు అని మానస్ అంటే.. నేను గలీజ్‌గా చేయలేదు. నేను ఏదైనా చేస్తే ప్రతీ విషయానికి ఆయన హర్ట్ అవుతున్నాడు. అది నిన్న విషయం కాదు.. ముందు నుంచి క్యారీ అవుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని అలా బిహేవ్ చేస్తున్నాడు అని సన్నీ అన్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Shanmukh- Siri Upset | VJ Sunny Ultimate || Filmibeat Telugu
సిరికి షన్ను వార్నింగ్

సిరికి షన్ను వార్నింగ్


మూడో సంఘటన టాస్క్‌లో నేను ఏ రోల్ చేయను అని షణ్ముఖ్ అంటే.. అది కాదు.. నీవు చేయి. బిగ్‌బాస్ ఒప్పుకోడు అంటూ సిరి అంటే.. నీవు నా విషయంలో తలదూర్చకు. మీకు అంతా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. నా విషయానికి వస్తే డిఫరెంట్‌గా చేస్తావు. నీవు నాకు ఏమీ చెప్పకు. నీవు నా వద్ద నుంచి వెళ్లిపో అంటూ సిరి హన్మంతుకు షణ్ముఖ్ వార్నింగ్ ఇచ్చాడు. అయితే సన్నీ మాత్రం ఇమిటేట్ చేయలేదు అంటూ కాజల్‌కు శ్రీరామ చంద్ర చెబుతూ కనిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X