For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆస్పత్రి పాలైన షణ్ముఖ్ జస్వంత్: బర్త్‌డే‌కు ముందే ఇలా.. ఆందోళనలో ఫ్యాన్స్

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఎంతో మంది యువతీ యువకులు సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు ఆఫర్లను కూడా దక్కించుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. యాక్టింగ్, డ్యాన్స్ వంటివి చేస్తూ అతడు అప్‌లోడ్ చేసిన వీడియోలకు భారీ స్పందన దక్కింది. ఫలితంగా అతడి పేరు సెన్సేషన్‌గా మారిపోయింది. ఇంతగా పాపులర్ అయిన షన్నూకు ఈ మధ్య కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలేంటో మీరే చూడండి!

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  చదువుకునే రోజుల్లోనే షణ్ముఖ్ కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించాడు. అలా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లో లీడ్ రోల్స్ చేసి మెప్పించాడు. దీంతో అతడికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అతడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యాడు. ఫలితంగా ఫుల్ ఫేమస్ అయిపోయాడు.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

  బిగ్ బాస్ చాన్స్.. చెడ్డ పేరుతో

  బిగ్ బాస్ చాన్స్.. చెడ్డ పేరుతో

  సోషల్ మీడియాలో సంచలనంగా మారిన షణ్ముఖ్ జస్వంత్ గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ టాలెంటెడ్ గాయ్.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. కానీ, హౌస్‌లో సిరి హన్మంత్‌తో కలిసి చేసిన రచ్చ వల్ల అతడికి చెడ్డ పేరు వచ్చింది. అలాగే, విజయంపై ఎఫెక్ట్ చూపించింది.

  బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా

  బ్రేకప్ చెప్పేసిన దీప్తి సునైనా

  బిగ్ బాస్‌లో సిరి హన్మంత్‌తో షణ్ముఖ్ జస్వంత్‌ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో దీప్తి సునైనా కూడా అతడిపై అసంహనంగా ఉంది. ఫలితంగా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ కొన్ని నెలల క్రితమే అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన వదిలింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని అన్నాడు.

  Manchu Manoj రెండో పెళ్లి.. కాబోయే శ్రీమతితో పూజలు.. ఎవరీ మౌనికారెడ్డి?

  కెరీర్‌పై ఫోకస్.. ఆ వెబ్ సిరీస్‌

  కెరీర్‌పై ఫోకస్.. ఆ వెబ్ సిరీస్‌

  బిగ్ బాస్‌లో కనిపించిన తీరుతో చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు తన కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'ను చేశాడు. దీన్ని సుబ్బు కే తెరకెక్కించాడు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేస్తోంది. దీనికి మంచి స్పందన దక్కుతోంది.

  షణ్ముఖ్ జస్వంత్‌కు దెబ్బలు

  షణ్ముఖ్ జస్వంత్‌కు దెబ్బలు

  గతంలో వరుసగా వీడియోలు చేస్తూ హల్‌చల్ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. ఈ మధ్య కాలంలో వరుసగా ఎదురుదెబ్బలు తగిలించుకుంటోన్నాడు. ఇప్పటికే ప్రియురాలికి దూరమైన అతడు.. అంతగా సక్సెస్ కాలేకపోతోన్నాడు. దీంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇలాంటి సమయంలో షన్నూ ఆస్పత్రిలో చేరాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

  హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

  హాస్పిటల్‌లో చేరిన షణ్ముఖ్

  హాస్పిటల్‌లో చేరిన షణ్ముఖ్

  ఇటీవలి కాలంలో షణ్ముఖ్ జస్వంత్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' వెబ్ సిరీస్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తరచూ షూటింగ్‌లు చేయడం.. జిమ్‌లో తెగ వ్యాయామాలు చేయడం వంటివి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లుండి షణ్ముఖ్ ఆస్పత్రిలో చేరాడు. దీనికి సంబంధించిన ఫొటోను స్వయంగా అతడే షేర్ చేశాడు. ఇందులో అతడు చికిత్స తీసుకుంటోన్నాడు.

  దిష్టి వల్లే.. కోలుకున్న షన్నూ

  దిష్టి వల్లే.. కోలుకున్న షన్నూ

  తన ఫొటోలను షేర్ చేసిన షణ్ముఖ్ జస్వంత్.. 'పుట్టినరోజు నెల ఇది.. దిష్టి తగిలినట్లుంది' అని చెప్పుకొచ్చాడు. దీంతో అసలు అతడికి ఏమైందో అని అభిమానులు తెగ కంగారు పడిపోయారు. ఆ తర్వాత అంటే తాజాగా అతడు ఓ సెల్ఫీ దిగి మరీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టుకున్నాడు. ఇందులో 'కొద్దిగా కోలుకున్నాను' అని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

  English summary
  Famous Youtuber Shanmukh Jaswanth Full Busy with His Projects. Recently He Hospitalized Due to Health Issue.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X