ఆమెతో బ్రేకప్? కొత్త లవర్‌తో రొమాంటిక్‌గా బిగ్ బాస్ కంటెస్టెంట్
యూట్యూబ్ నుంచి బిగ్‌బాస్ వేదిక వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షణ్ముఖ్ జశ్వంత్ ( Shanmukh Jaswanth). తాజాగా ఈ యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్, నటుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత సింగిల్‌గా ఉన్న షణ్ముఖ్, తాజాగా తన కొత్త ప్రేయసిని పరిచయం చేస్తూ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కొత్త అమ్మాయి ఎవరూ? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
షణ్ముఖ్ జశ్వంత్ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అతడి యూట్యూబ్ ప్రయాణమే. చిన్న చిన్న వీడియోలు, డ్యాన్స్ కవర్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌తో మొదలైన అతడి కెరీర్, క్రమంగా వెబ్ సిరీస్‌ల వరకు చేస్తూ వచ్చారు. తన ఎనర్జీ, స్టైల్‌తో యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న షణ్ముఖ్, టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొనే అవకాశం అతడి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

బిగ్‌బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఆట, ఎమోషన్స్, రిలేషన్షిప్ ట్రాక్స్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీశాయి. విన్నర్ అవుతాడని భావించినప్పటికీ రన్నరప్‌గా నిలిచాడు. అయితే షోలో అతని ప్రవర్తన, ముఖ్యంగా సిరి హన్మంత్‌తో అతడి క్లోజ్‌నెస్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదే సమయంలో బయట ఉన్న అతడి ప్రేయసి దీప్తి సునయనతో సంబంధాలపై కూడా సందేహాలు మొదలయ్యాయి.
దీప్తి సునయనతో షణ్ముఖ్ లవ్ స్టోరీ ఒకప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలిచింది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ వీడియోలు చేయడం, వెబ్ కంటెంట్‌లో కనిపించడం, ఒకరికొకరు టాటూలు వేయించుకోవడం వరకు వెళ్లారు. వీరి జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. కానీ కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, చివరకు బ్రేకప్ జరిగిందని అధికారికంగా ప్రకటించారు. బిగ్‌బాస్ తర్వాత ఈ బ్రేకప్ మరింత ఫైనల్ అయిందన్న ప్రచారం బలంగా నడిచింది.
దీప్తితో విడిపోయిన తర్వాత షణ్ముఖ్ కొంతకాలం డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు స్వయంగా అంగీకరించాడు. అయితే ఆ దశ నుంచి బయటపడి మళ్లీ తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. వెబ్ సిరీస్‌లు, ఓటీటీ సినిమాలతో బిజీగా మారాడు. 'లీలా వినోదం'వంటి సినిమాలతో నటుడిగా మంచి మార్కులు కొట్టాడు. ప్రస్తుతం 'ప్రేమకు నమస్కారం'అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాలో శివాజీ, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులతో కలిసి నటించడం అతడి కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారింది.
ఇలాంటి సమయంలోనే షణ్ముఖ్ చేసిన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సంచలనంగా మారింది. న్యూ ఇయర్ తర్వాతి రోజు, తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ అమ్మాయితో కాస్త చనువుగా, రొమాంటిక్ గా దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆమెకు బర్త్‌డే విషెస్ తెలిపాడు. అయితే ఆ ఫోటోలలో ఆమె ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. 'Happy Birthday V... This is God's Plan'అంటూ క్యాప్షన్ ఇవ్వడం ద్వారా ఆమె పేరు 'V' అక్షరంతో ప్రారంభమవుతుందన్న సంకేతం మాత్రమే ఇచ్చాడు.
ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. 'ఆ అమ్మాయి ఎవరు?, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తేనా?, ఆ అమ్మాయి కొత్త ప్రేయసా?, పెళ్లి ఎప్పుడూ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు షణ్ముఖ్ కొత్త జీవితం ప్రారంభించినందుకు పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గత కొన్నేళ్లుగా షణ్ముఖ్ పేరు చుట్టూ అనేక వివాదాలు కూడా తిరిగాయి. డ్రగ్స్ ఆరోపణలు, యాక్సిడెంట్ కేసులు వంటి నెగిటివ్ వార్తలు అతడిని ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ వాటన్నింటిని ఎదుర్కొని, మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











