హాస్పిటల్ బెడ్‌పై షణ్ముఖ్.. పెళ్లి తర్వాత బిగ్‌బాస్ స్టార్‌కి ఏమైంది?

బిగ్‌బాస్ స్టార్, సోషల్ మీడియా సంచలనం షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల తన ప్రియురాలు వైష్ణవి చోడిశెట్టిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఎప్పుడో పెళ్లయిపోయిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న వేళ.. వాటిని ఖండిస్తూ ఫోటోలను విడుదల చేశారు షణ్ముఖ్. అందరూ అనుకుంటున్నట్లుగా తన పెళ్లి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇరు కుటుంబాలు ఎంతో జోష్‌లో ఉన్నాయి. ఇలాంటి వేళ షణ్ముఖ్ హాస్పిటల్‌ బెడ్‌పై ప్రత్యక్షం కావడం అభిమానులను, సన్నిహితులను షాక్‌కు గురి చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, వీడియో ఆల్బమ్స్ ద్వారా యువతలో గుర్తింపు తెచ్చుకున్నారు షణ్ముఖ్ జస్వంత్. విశాఖకు చెందిన ఈ కుర్రాడు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్నాడు. యువతకు ఏం కావాలి? ఎలాంటి వాడికి ఆదరణ లభిస్తుంది? అనేది పక్కాగా తెలిసిన షణ్ముఖ్.. ఇప్పటి జనరేషన్‌కు తగ్గ వీడియోలు చేస్తూ దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో మనోడికి ఉన్న పాపులారిటీ సామాన్యమైనది కాదు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సూర్య, స్టూడెంట్ అనే వెబ్ సిరీస్‌లతో షణ్ముఖ్ పేరు యూట్యూబ్‌లో మారుమోగింది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు ఈ కుర్రాడు.

Shanmukh Jaswanth Lands in Hospital Days After Wedding with Vaishnavi Chodisetti

ఈ పాపులారిటీతో బిగ్‌బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. తన ఆటతీరుతో పాటు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో ఫైనల్‌కు అలవోకగా చేరుకున్నాడు. అయితే చివరిలో వీజే సన్నీకి ప్రేక్షకుల మద్ధతు లభించడంతో ఆయన విన్నర్ కాగా.. షన్నూ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్‌బాస్ కారణంగా షణ్ముఖ్ క్రేజ్ మరింత తారాస్థాయికి చేరింది. పలు సినిమాలలోనూ ఆఫర్లు వచ్చాయి. నన్ను దోచుకుందువటే, లీలా వినోదం చిత్రాలలో చిన్నాచితకా పాత్రలు పోషించారు షణ్ముఖ్. ప్రస్తుతం ప్రేమకు నమస్కారం అనే సినిమాలలో ఆయన నటిస్తున్నారు.

ఇదిలాఉండగా.. హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీప్తి సునైనాతో షణ్ముఖ్ ప్రేమలో పడ్డారు. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలలో వీరిద్దరూ కలిసి నటించగా.. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ డేటింగ్ చేశారు. త్వరలో పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ చెబుతారని అభిమానులు ఆశించగా... అనూహ్యంగా ఈ జంట విడిపోయింది. షణ్ముఖ్ బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఆయనతో విడిపోతున్నట్లు దీప్తి ప్రకటించింది. వీరిద్దరి మధ్య బ్రేకప్ జరగడానికి దారి తీసిన కారణాలు ఏంటనేది మాత్రం తెలియరాలేదు.

దీప్తితో బ్రేకప్ తర్వాత రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడి శెట్టితో ప్రేమలో పడిన షణ్ముఖ్ ఇటీవలే ఆమెతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఆ వెంటనే కొన్నిరోజులకు వీరిద్దరూ జంటగా గృహ ప్రవేశం చేయడంతో వీరికి పెళ్లి జరిగిపోయిందని అంతా అనుకున్నారు. దీనికి చెక్ పెడుతూ జూన్ 21న తిరుపతిలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తన పెళ్లి జరిగినట్లు షణ్ముఖ్ పెళ్లి ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. దాంతో అభిమానులు, సన్నిహితులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను షేర్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి చేసుకుని మూడు రోజులు కాకుండానే ఇలా ఆసుపత్రి పాలు కావడం ఏంటీ? అసలు షణ్ముఖ్‌కు ఏం జరిగింది? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే పెళ్లి వేడుకలు, రిసెప్షన్, వరుస ప్రయాణాల కారణంగా షణ్ముఖ్ అస్వస్థతకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై ఆయన త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. షణ్ముఖ్ కోలుకోవాలని సోషల్ మీడియా వేదిక ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X