షణ్ముఖ్ కేసులో సంచలనం.. మెడికల్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు.. పోలీసులు ఏం చెప్పారంటే!

సాధారణ యూట్యూబర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయాడు షణ్ముఖ్ జస్వంత్. భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుని తనదైన రీతిలో కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోన్న అతడు తాజాగా గంజాయి కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారిపోయింది. అదే సమయంలో ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ మెడికల్ రిపోర్టు బయటకు వచ్చింది. అందులో ఏమి నిర్దారణ అయిందో మీరే చూడండి!

అన్న కోసం వెళ్తే తమ్ముడు
షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయిని చీట్ చేశాడన్న అభియోగంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో జరిపిన సోదాల్లో 16 గ్రాముల గంజాయి పట్టుబడింది. అదే సమయంలో అక్కడ షణ్ముఖ్‌ జస్వంత్ కూడా ఉడడంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Shanmukh Jaswanth Medical Test Report After Arrest Was Revealed

పోలీసులు ఏం చెప్పారు?
సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్ జస్వంత్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఓ ఉన్నతాధికారి 'ఓ కేసు విచారణలో భాగంగా సంపత్‌ కోసం వచ్చాము. అక్కడ సోదాలు చేస్తున్నప్పుడు గంజాయి దొరికింది. దీంతో అనుమానితులుగా ఉన్న సంపత్, షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారణం చేస్తున్నాము' అని వివరించారు.

షణ్ముఖ్‌పై అనుమానమే
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఈ కేసులో షణ్ముఖ్ జస్వంత్‌ గంజాయి సేవిస్తూ పట్టుబడలేదని ప్రాధమికంగా తెలిసింది. అయినప్పటికీ అతడిపై అనుమానంతోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు. దీంతో ఈ కేసు నుంచి అతడు బయటపడతారని అభిమానులు అంతా అనుకున్నారు.

మెడికల్ టెస్టు బయటకు
సంపత్ వినయ్, షణ్ముఖ్ జస్వంత్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీళ్లు గంజాయి తీసుకున్నారా? లేదా? అనే విషయంపై పలు రకాల టెస్టులు చేయించారు. ఈ రిపోర్టు వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఇందులో ఇద్దరూ గంజాయి సేవించినట్లుగా నిర్దారణ అయినట్లు తెలిసింది.

కేసు నమోదు చేశారు
షణ్ముఖ్ జస్వంత్‌తో పాటు సంపత్ వినయ్ యూరిన్, బ్లడ్ శాంపిల్స్‌లో గంజాయి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో నార్సింగ్ పోలీసులు వీళ్లిద్దరిపై కేసు నమోదు చేశారని సమాచారం. కొంత కాలంగా వీళ్లిద్దరూ గంజాయి తీసుకుంటున్నట్లు విచారణలో స్పష్టం అయినట్లు కూడా న్యూస్ లీకైంది. దీనిపై పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

Shanmukh Jaswanth Medical Test Report After Arrest Was Revealed

ఎవరు అందించారంటూ
సంపత్ వినయ్, షణ్ముఖ్ జస్వంత్‌లు గంజాయి సేవిస్తున్నట్లు నిర్దారణ అవడంతో.. అసలు వీళ్లకు అది ఎలా దొరికింది అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. దీని వెనుక ఎంత మంది ఉన్నారు అనే కూపీని లాగే ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఇప్పుడీ కేసుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X