షాక్ ఇస్తున్న షణ్ముఖ్ జశ్వంత్ సంపాదన.. సినిమా యాక్టర్స్ కంటే తక్కువేమి కాదు!
షణ్ముఖ్ జశ్వంత్ అంటే సోషల్ మీడియా జనాలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. షన్ను అనే పేరుతో ఎక్కువగా వైరల్ అయ్యే ఈ టాలెంటెడ్ యాక్టర్ గురించి సంబంధించిన పర్సనల్ విషయాలు బాగానే వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం షణ్ముక్ యూ ట్యూబ్ ఆదాయం ఎంత అనే దానిపైనే అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఆ విషయాలపై ఒక లుక్కేస్తే..

జియో కూడా లేని టైమ్ లో..
యూ ట్యూబ్ ప్రభావం పెరుగుతున్న క్రమంలోనే తెలుగులో భారీగా క్రేజ్ అందుకున్న వైవా గ్రూప్స్ లో షన్ను కూడా ఉన్నాడు. అప్పట్లో ఇంకా జియో కూడా లేదు. అయినప్పటికీ మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటూ వైవా వార్తలతో స్కిట్స్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు. వైవా గ్రూప్ ఎలాంటి కామెడీ ట్రాక్ చేసినా కూడా మొదట్లో షణ్ముక్ ఉండేవారు.

కామెడీ టైమింగ్ తోనే
ఇక తన కంటూ ఒక క్రేజ్ వచ్చిన అనంతరం అక్కడ ఉండడం అంతగా లాభం లేదని సొంతంగా ఛానెల్ పెట్టుకొని తన స్థాయిని అమితంగా పెంచుకున్నాడు. 3 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ను పెంచుకున్న షన్ను తనదైన కామెడీ టైమింగ్ తోనే ఒక్క వీడియోకు ఈజీగా 10మిలియన్ల వ్యూవ్స్ అందుకుంటూ వస్తున్నాడు. అరేయ్.. ఏంట్రా ఇది అనే డైలాగ్ ఎంతగా ఫేమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఆ సిరీస్ తోనే.. భారీ క్రేజ్
''సాఫ్ట్ వేర్ డేవ'లవ్'పర్'' అనే సిరీస్ తోనే అతని ఛానెల్ స్థాయి అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఇక ఆ తరువాత అందులోనే కామెడీ టచ్ తో కాస్త ఎమోషనల్ లవ్ స్టోరీని కూడా కలపడంతో మనోడికి మంచి గుర్తింపు దక్కింది. అదే తరహాలో సూర్య సిరీస్ తో మరింతగా ఆకట్టుకున్నాడు.

సూర్య వెబ్ సిరీస్ కూడా ..
ప్రస్తుతం సూర్య వెబ్ సిరీస్ కు మంచి గుర్తింపు దక్కుతోంది. ఒక్కో వీడియోకు 10మిలియన్స్ కు పైగా వ్యూవ్స్ వస్తున్నాయి. ఇక ఈ స్థాయులో వ్యూవ్స్ వస్తున్నప్పుడు షణ్ముక్ ఆదాయం ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇక మధ్యమధ్యలో ప్రయివేట్ యాడ్స్ ద్వారా కూడా బోనస్ లభిస్తోంది.
Recommended Video

షణ్ముఖ్ జశ్వంత్ ఆదాయం ఎంతంటే?
ఇక ప్రస్తుతం షణ్ముఖ్ జశ్వంత్ ఛానెల్ కు మూడు మిలియన్స్ కు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అయితే వ్యూవ్స్ అంతకంటే ఎక్కువగానే వస్తున్నాయి. ఇక నెలకు అతనికి 10లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్లు టాక్. ఒక రకంగా సినిమాలో నటించే వారిలానే షన్ను కూడా బాగానే సంపాధిస్తున్నాడని చెప్పవచ్చు. ఆ మధ్య ఒక యాక్సిడెంట్ ద్వారా అతనిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ షన్ను ఫాలోవర్స్ సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.


Click it and Unblock the Notifications











