సిరితో రొమాన్స్ గురించి షన్ను బ్రదర్ సంచనలం.. అలా అయితే నో పెళ్లి అంటూ కుండబద్దలు కొట్టేసిన తల్లి!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టి బిగ్ బాస్ ద్వారా ఇప్పుడు మరింత క్రేజ్ తెచ్చుకుంటున్న షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన పెళ్లి గురించి షణ్ముఖ్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే సిరితో షణ్ముఖ్ రిలేషన్ గురించి షణ్ముఖ్ అన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

జస్వంత్ తల్లి సంచలన వ్యాఖ్యలు

జస్వంత్ తల్లి సంచలన వ్యాఖ్యలు

షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయక్కర లేదు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుండగా ఈ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలైన తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సంగతి అధికారికంగా ప్రకటించారు. దీప్తి సునయన కూడా సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ కే ఓటు వేయండి అంటూ ఎప్పటికప్పుడు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

అయితే ఒక రకంగా వీరిద్దరూ సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది ఎందుకంటే షణ్ముఖ్ జస్వంత్ కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇచ్చిన బిగ్ బాస్ యాజమాన్యం దీప్తి సునయనని కూడా లోపలికి తీసుకు వచ్చారు అంటే వీరిద్దరి బంధం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వీరిద్దరి పెళ్లి గురించి తాజాగా షణ్ముఖ్ జస్వంత్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది.

అలా అయితేనే పెల్లో

అలా అయితేనే పెల్లో

అసలు షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా ప్రేమించుకుంటున్నారు అనే సంగతి తమకు తెలియదని ఆమె వెల్లడించింది. తెలుగు ప్రేక్షకులు అందరికి ఎలా తెలిసిందో తమకు కూడా అలాగే తెలిసిందని ఆమె వెల్లడించింది. ఇంతకు ముందు దీప్తి సునయన 2, 3 సార్లు తన ఇంటికి వచ్చిందని ఇద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తూ ఉండే వారు కావడంతో వారిద్దరి మధ్య స్నేహం ఉందని అందరూ అనుకునే వాళ్ళమని ఆమె వెల్లడించింది.

ఇక దీప్తి సునైన తల్లిదండ్రులకు వీరిద్దరికీ పెళ్లి చేయడంలో ఎలాంటి సమస్యలు లేకపోతే తమకు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆమె, వాళ్ళకు ఇష్టం లేదంటే మేము చేయమని ఆమె వెల్లడించారు. అయితే షణ్ముఖ్ జస్వంత్ కి అన్నయ్య ఉన్నాడని ఆయన పెళ్లి అయిన తర్వాత షణ్ముఖ్ పెళ్లి చేస్తామని వారు వెల్లడించారు. షణ్ముఖ్ చిన్న వయసు వాడే కావడంతో ఆయనకు పెళ్లి చేయడానికి మరింత సమయం ఉందని వెల్లడించింది.

ముదిరి పాకాన పడుతున్నట్లు

ముదిరి పాకాన పడుతున్నట్లు

ఇక ఈ సంగతి పక్కన పెడితే షణ్ముఖ్ జస్వంత్ అన్న వినయ్ సంపత్ షణ్ముఖ్ యశ్వంత్ సిరి రిలేషన్ షిప్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి షణ్ముఖ్ జస్వంత్, సిరి రిలేషన్ షిప్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఒక పక్క షణ్ముఖ్ కి దీప్తి సునైనా అనే లవర్ ఎలా అయితే ఉందో సిరికి శ్రీహాన్ అనే ఒక లవర్ ఉన్నాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరి మధ్య జరుగుతున్న వ్యవహారం మాత్రం ముదిరి పాకాన పడుతున్నట్లు అనిపిస్తూ ఉండడంతో ఈ విషయం మీద నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తుంటే తాజాగా ఇదే విషయం మీద సంపత్ స్పందించాడు.

సిరి క్యారెక్టర్ బ్యాడ్

సిరి క్యారెక్టర్ బ్యాడ్

షణ్ముఖ్ జస్వంత్ ప్రేక్షకులు ఏం కావాలని కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అని పేర్కొన్న ఆయన, షణ్ముఖ్ జస్వంత్ సిరిని హౌస్ లో కాపాడుతున్నా, అలాగే వేరే కంటెస్టెంట్ లకి ఆమె క్లోజ్ అవుతుంటే ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాడు అంటే దానికి కారణం వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని కాదు అని చెప్పుకొచ్చారు.

షణ్ముఖ్ ఇప్పటికీ సిరిని ఒక స్నేహితురాలు లాగానే చూస్తున్నాడని, అలా హెల్ప్ చేస్తుంటే దానిని లవ్ ట్రాక్ అనుకోవడం కరెక్ట్ కాదని తద్వారా సిరి క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇదే ప్రచారం గనక జరుగుతూ ఉంటే త్వరలో బిగ్ బాస్ మేకర్స్ సిరిని ఎలిమినేట్ కూడా చేసే అవకాశం ఉందని కానీ షణ్ముఖ్ జస్వంత్ తన స్నేహితురాలు అయిన సిరి ఫైనల్ ఎపిసోడ్ వరకు రావాలని కోరుకుంటున్నానని సంపత్ వెల్లడించాడు.

అలాగే బిగ్ బాస్ కూడా షణ్ముఖ్ జస్వంత్ కి సపోర్ట్ చేయడం లేదు అని ఎందుకంటే షణ్ముక్ గొడవలు పడుతూ మసాలా యాడ్ చేయడానికి సిద్ధంగా లేడు కాబట్టి బిగ్ బాస్ మేకర్స్ షణ్ముఖ్ యశ్వంత్ కి కూడా సపోర్ట్ చేయడం లేదని అన్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Shanmukh- Siri Upset | VJ Sunny Ultimate || Filmibeat Telugu
సపోర్ట్ చేయదు

సపోర్ట్ చేయదు

ఆడియన్స్ కు మసాలా కంటెంట్ ఇవ్వని ఒక కంటెస్టెంట్ ను బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేయదు అని ఒకవేళ బిగ్ బాస్ షణ్ముఖ్ యశ్వంత్ కి సపోర్ట్ చేసినా చేయకపోయినా తాము మాత్రం బయట నుంచి సపోర్ట్ చేస్తాము అని చెప్పుకొచ్చారు. నాకు షణ్ముఖ్ జస్వంత్ మనసు ఎలాంటిదో తెలుసు అని పేర్కొన్న సంపత్ అతని మనసులో ఎలాంటి దుర్బుద్ధి ఉండదని అందుకే మేము అంతా షణ్ముఖ్ జస్వంత్ కి సపోర్ట్ గా నిలబడుతున్నాము అని చెప్పుకొచ్చాడు. అంతేకాక తన తమ్ముడే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ గా గెలిచి వస్తాడని కూడా సంపత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి సంపత్ కోరిక ఎంతవరకు నెరవేరుతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X