Siri Hanmanth నిందించొద్దు..అంతా దేవుడి చేతుల్లోనే..అందుకే దీప్తి సునైనాతో బ్రేకప్.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించి ఐదో సీజన్‌లో జరిగిన రచ్చ మరే సీజన్‌లో జరుగలేదనేది అందరి అభిప్రాయం. గత నాలుగు సీజన్లు చాలా పద్దతిగా సాగిపోయాయి. రొమాన్స్ ఉన్నప్పటికీ.. ఐదో సీజన్‌లో షణ్ముఖ్, సిరి హన్మంతు మధ్య ఉన్న మోతాదు హద్దు మీరిందనే అభిప్రాయం అందరి నోట వినిపించింది. అయితే వారిద్దరి రొమాన్స్ వారి జీవితాలపై ప్రభావం చూపడమే కాకుండా తగిన మూల్యం కూడా చెల్లించుకొనే పరిస్థితి ఎదురైంది. అయితే బిగ్‌బాస్ తెలుగు 5 నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాకు ముఖం చాటేసిన షణ్ముఖ్.. తాజాగా వాలంటైన్స్ డే రోజున ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకొన్నారు. బిగ్‌బాస్‌కు ముందు.. ఆ తర్వాత షణ్ముఖ్ పరిస్థితి ఎలా ఉందంటే..

బిగ్‌బాస్‌లో సిరి హన్మంతుతో షణ్ముఖ్
బిగ్‌బాస్ తెలుగు 5 షోలోకి వెళ్లడానికి ముందు షణ్ముఖ్‌కు బిగ్‌బాస్ తెలుగు 2 కంటెస్టెంట్ దీప్తి సునైనాతో అఫైర్ ఉంది. అలాగే సిరి హన్మంతుకు శ్రీహాన్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. అయితే బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లిన తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత వారి మధ్య సన్నిహిత సంఘటనలు కనిపించాయి. ఇంటిలో ఒకరిని విడిచి మరొకరు కాసేపు కూడా ఉండలేని పరిస్థితి కనిపించింది. అయితే వారిద్దరి రొమాంటిక్ మూమెంట్స్ అందరికి ఇబ్బందిని కలిగించాయి.

సిరి, షణ్ముఖ్ లైఫ్స్‌లో బ్రేకప్స్
బిగ్‌బాస్ తెలుగు 5 షో ముగిసే సమయానికే షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు జీవితాల్లో జరిగిపోవాల్సింది జరిగిపోయింది. షణ్ముఖ్‌కు దీప్తి సునైనా, సిరి హన్మంతుకు శ్రీహాన్ బ్రేకప్ చెప్పేసుకొన్నారు. దాంతో సిరి, షణ్ముక్ వ్యవహారం గందరగోళంగా మారింది. ఈ వ్యవహారం నేపథ్యంలో వారిద్దరూ మీడియా ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. చాలా రోజుల తర్వాత షణ్ముఖ్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. దీప్తితో తన లవ్ బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు.

నాపై ఫుల్లుగా నెగిటివిటి
బిగ్‌బాస్ తెలుగు గేమ్ ఫార్మాట్‌కు నా మనస్తత్వం అసలే సరిపోదు. సాధారణంగా ఎవరితోను ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడను. నాది ఒకరకమైన మూడీ మెంటాలిటి.. గుర్తింపు కోసమే నేను బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాను. అయితే నా గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తారని అనుకొన్నా. కానీ బయటకు వచ్చిన తర్వాత నాపై ఎంత ప్రతికూలత ఉందో తెలిసింది. సిరి హన్మంతు, నా జోడి కారణంగా మాపై ఎంత ప్రభావం పడిందో ఆలస్యంగా అర్ధమైంది అని షణ్ముఖ్ తెలిపాడు

సిరి హన్మంతు కారణంగానే వ్యతిరేకత
బిగ్‌బాస్ ఇంటిలో సిరి హన్మంతుతో చనువుగా ఉండటమే ప్రేక్షకుల్లో, అలాగే సోషల్ మీడియాలో నెటిజన్లలో నాపై తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే దీప్తితో నేను, సిరి హన్మంతుతో శ్రీహాన్ రిలేషన్‌లో ఉన్నాం. బిగ్‌బాస్ ఇంటిలో ఉన్నప్పుడు మా మధ్య చనువు పెరిగింది. దాంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఆ కారణంగానే మాపై వ్యతిరేకత పెరిగింది అని షణ్ముఖ్ అన్నాడు.

సిరి హన్మంతు తల్లి అన్న మాటలతో
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ముగింపులో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు లోనికి వచ్చారు. ఆ సందర్భంగా సిరి హన్మంతు తల్లి నాతో మాట్లాడుతూ.. మా అమ్మాయిని ప్రతీసారి హగ్ చేసుకోవడం నాకే మాత్రం నచ్చలేదు అని అనడంతో షాక్ తిన్నాను. కంటెస్టెంట్ల ముందు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. సిరి తల్లి అన్న మాటలకు నేను చాలా భాదపడ్డాను అని షణ్ముఖ్ చెప్పాడు.

అందుకే దీప్తితో బ్రేకప్
దీప్తితో బ్రేకప్‌కు చాలా కారణాలు ఉన్నాయి. బిగ్‌బాస్ షోలో నేను, సిరి చేసిన పనికి దీప్తి చాలా ట్రోలింగ్‌కు గురైంది. నెటిజన్లు నన్ను ట్రోల్ చేసినా ఆమె నాకే సపోర్ట్ చేసింది. సిరి హన్మంతుతో క్లోజ్‌గా ఉడటం ప్రేక్షకులకు ఎలా నచ్చలేదో.. దీప్తి ఇంట్లో వాళ్లకు కూడా నచ్చలేదు. దాంతో దీప్తిపై ఒత్తిడి పెరిగింది. ఆమె సంతోషంగా ఉండాలనే విషయంతో బ్రేకప్ చెప్పుకొన్నాం అని షణ్ముక్ అన్నాడు.
Recommended Video

సిరి హన్మంతును నిందించవద్దు
షణ్ముక్ తన భవిష్యత్ కార్యాచరణ గురించి చెబుతూ.. నాకు ప్రస్తుతం 27 సంవత్సరాలు. వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ లైఫ్‌లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే వాటన్నింటిని ఎదుర్కొంటూ జీవితంలో ముందుకెళ్తాను. దీప్తి నేను కెరీర్‌పై దృష్టిపెట్టాం. మేమిద్దరం మళ్లీ కలుస్తామా? లేదా అనేది భగవంతుడు నిర్ణయించాలి. మా జీవితాల్లో విధి ఎలా రాస్తే అదే జరుగుతుంది. మా బ్రేకప్‌కు సిరి హన్మంతును నిందించడం సరికాదు. తప్పంతా నాదే.. అందుకు నేను బాధ్యుడిని అని షణ్ముఖ్ వేదాంతం ఒలకబోసాడు.


Click it and Unblock the Notifications











