ఆమె జ్ఞాపకాలు జీవితాంతం నాతోనే... దీప్తి సునైనాతో బ్రేకప్‌పై షణ్ముఖ్ ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షణ్ముఖ్ జస్వంత్ .. బిగ్‌బాస్ బ్యూటీ దీప్తి సునైనాలు పీకల్లోతు ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది. దీనికి కారణాలు తెలియరాలేదు కానీ... వీరిద్దరూ విడిపోవడం మాత్రం అందరినీ బాధించింది. అయితే ఇటీవల ఓ అమ్మాయితో ప్రేమలో పడిన షణ్ముఖ్ జస్వంత్ ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్తితో విడాకుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు షణ్ముఖ్. ఈ వివరాల్లోకి వెళితే..

మన మైండ్ సెట్ వైట్ పేపర్ లాంటిది. ప్రభాస్ గారి చక్రం మూవీలో చెప్పినట్లు మొత్తం వైట్ పేపర్ వదిలేసి మధ్యలో చక్రాన్ని మాత్రమే చూస్తాం. వైట్ పేపర్ హైగా ఉంది.. ఆ చుక్కని మాత్రమే చూడటానికి కాన్సన్‌ట్రేడ్ చేస్తాం. ఆ మైండ్‌సెట్‌ని మనం మార్చలేం. నేను పొలిటీషియన్‌ని కాదు.. పీఎంను కాను. హై నా కంట్రోల్‌లో లేదు.. లో నా కంట్రోల్‌లో లేదు. మనం మారి నలుగురితో బాగుంటే చాలు.. హైదరాబాద్ వచ్చి ఆ కారు కొంటాం... ఈ కారు కొంటాం అనుకుంటాం.. కానీ నేను వైజాగ్ వెళ్లినప్పుడు ట్రైన్‌లోనే వెళ్లేవాడిని ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. మాస్క్ పెట్టుకుని మూలన కూర్చొనేవాడిని అని షణ్ముక్ గుర్తుచేసుకున్నారు.

Shanmukh Jaswanth Opens Up About Breakup with Deepthi Sunaina and His New Engagement

మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ.. బయట మన కన్నా చాలామంది చాలా చేస్తున్నారు. కానీ ఎవ్వరూ బయట చెప్పుకోరు. ఇప్పటికీ మా ఫ్రెండ్స్‌లో ఎవరైనా అర్జెంట్‌గా డబ్బులు పంపించమని చెబితే ఇచ్చేస్తా. అది నిజమో అబద్ధమో కాదో చూడను. ఎందుకంటే ఈ ట్రైన్ జర్నీతో పాటు తనతో పరిచయంతో పూర్తిగా మారిపోయా. లోన్ యాప్స్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. మాకు తెలిసినవాళ్లు కూడా చనిపోయారు. నేను ఒకరోజు షూట్‌లో ఉన్నప్పుడు ఒకతను ఫోన్ చేసి ఇలా చనిపోయాడు అని చెప్పగానే షాకయ్యా. నా ఫ్యామిలీస్ వరకు చాలా ఎమోషనల్.. ఇలాంటివి అస్సలు తట్టుకోలేను. ఫ్యామిలీ అందరినీ నా బర్త్ డే, ఇతర ఈవెంట్స్ వచ్చినప్పుడు లంచ్‌కి తీసుకెళ్తుంటాను. నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే వాళ్ల వల్లే. తను చనిపోయినప్పుడు షాక్ అయ్యా. అందరూ ప్రతిభవంతులే.. కానీ వాళ్లింట్లో ప్రెజర్ వల్ల ఏవేవో చేయాల్సి వస్తుంది. నాకు మా అమ్మానాన్న సపోర్ట్ చేశారు. అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా అని షణ్ముఖ్ పేర్కొన్నారు.

నేను సంపాదించేది అందరి కోసం.. నా కోసం కాదు. సంపాదించేది నలుగురికి పంచి పెడతా. పబ్లిక్‌లో నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి నేను కూడా ఒక టాపిక్‌గా మారాను. కానీ ఇంతకంటే దరిద్ర్యమైన ఫేజ్‌లు చూశా. కానీ నా కంటే ఒకరోజు రాకపోతుందా అని ఎదురుచూశా.. నాలాగే ఎంతో మంది ఆలోచన కూడా ఇదే. ఇలా ఎంతోమంది అబ్బాయిలు రగిలిపోతున్నారు. వాళ్లందరినీ చూసుకునే నా ఇన్స్‌పిరేషన్. ఇంతమంది ఇన్ని ఫేస్ చేస్తున్నప్పుడు నేనెందుకు ఫేస్ చేయలేను అనుకుంటా. బతుకంతా వాడి ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు. అయినా కానీ సక్సెస్ అందుకోలేకపోవడం విచారకరమని షణ్ముఖ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నేను చాలా ఎమోషనల్ పర్సన్‌ని కానీ బయటకు చూపించలేను. చిన్న చిన్న వాటికి కూడా ఏడ్చేస్తూ ఉంటా. షూటింగ్స్‌లోనూ మా డైరెక్టర్ చిన్నది అన్నాడని ఇంటికెళ్లి స్నానం చేయకుండా వెక్కి వెక్కి ఏడ్చా. బయట అంతమంది నన్ను అంటున్నారంటే నేను కూడా మనిషినే కదా? నాకు కూడా ఏడుపు వస్తుంది. దీప్తితో బ్రేకప్ అయ్యాక చాలా ఏడ్చాను. అయితే అవతలి వ్యక్తి మనకంటే ఎక్కువ ఏడ్చి ఉంటాడని అనుకుంటున్నా. నా సైడ్ నుంచి నాది కూడా ఉండొచ్చు కదా. అవతలి వాళ్లకు ఏం కావాలో అది చేసేశాను. వద్దు అంటే వద్దు.. ఓకే. మొండిగా కిందకి రా... ఇది చేస్తా, అది చేస్తా అని టార్చర్ చేయలేదు. నేను బెస్ట్ ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌ని. ఒక్కరిని కూడా నేను టార్చర్ చేసింది లేదని షణ్ముఖ్ వెల్లడించారు.

పెళ్లి తర్వాత ఆ టాటూ తీసేద్దామని అనుకున్నాను. కొత్త అమ్మాయి నా జీవితంలోకి వచ్చాక ఇవన్నీ క్లియర్ చేద్దామని అనుకున్నా. వచ్చే అమ్మాయికి ప్రాబ్లమ్ ఉండొద్దు కదా అని అనుకున్నాం. కానీ నాకు కాబోయే భార్య మాత్రం .. అది మీ మెమొరీ కాదండి.. అది మీ ఇష్టం, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయండి. నేనైతే చెప్పను. అలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. ఇప్పటి వరకు ఆమె నన్ను షన్నూ అని పిలవలేదు అండీ అనే పిలుస్తుంది. షన్నూ అనే పేరు తన నోటి నుంచి వినాలని అనుకుంటున్నా. మా అమ్మ అయితే నీగురించి నేను మరీ ఎక్కువ పూజలు చేసినట్లున్నా అందుకే ఇలాంటి అమ్మాయి దొరికింది అని అంటుంది షణ్ముక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X