షణ్ముఖ్ కేసులో కీలక మలుపు: అతడిని అరెస్ట్ చేసింది గంజాయి గురించి కాదా.. కల్యాణ్ సుంకర పోస్ట్ వైరల్

షణ్ముఖ్ జస్వంత్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సెన్సేషన్ అవుతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఇతగాడు రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దీనికి కారణం అతడు గంజాయి కేసులో అరెస్ట్ అవడమే. సోషల్ మీడియా వల్ల పెద్ద సెలెబ్రిటీ అయిపోయిన అతడు.. తాజాగా అరెస్ట్ అయ్యాడు. దీంతో అతడి గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ కేసు విషయంలో ఎన్నో రకలా వార్తలు కూడా వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా షణ్ముఖ్ వ్యవహారంపై అతడి తల్లిదండ్రులు ఊహించని విషయాలు వెల్లడించారు. అసలేం జరిగిందో మీరే చూసేయండి మరి!

అన్నతో పాటు షణ్ముఖ్ అరెస్ట్:అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడన్న అభియోగంతో షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్‌పై కేసు నమోదు అయింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వాళ్ల ఫ్లాట్‌కు వచ్చి సోదాలు నిర్వహించారు. అప్పుడు వాళ్లకు 16 గ్రాముల గంజాయి లభ్యం అయింది. దీంతో వినయ్‌తో పాటు షణ్ముక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

 Shanmukh Jaswanth Parents First Reaction On Case

ఎన్నో వార్తలు.. నిజమేనంటూ:షణ్ముఖ్ జస్వంత్‌తో పాటు అతడి సోదరుడు వినయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ అంశం సెన్సేషన్ అయిపోయింది. దీంతో పోలీసులు విషయాలను వెల్లడించకున్నా.. ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో మీడియాలో షణ్ముఖ్ గురించి, అతడి సోదరుడి గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.

అనుమానం.. అతడి కోసమే:సంపత్ వినయ్‌, షణ్ముఖ్ జస్వంత్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసు అధికారులు మీడియాతో 'ఓ కేసు విచారణలో భాగంగా సంపత్‌ కోసం వచ్చాము. అక్కడ సోదాలు చేస్తున్నప్పుడు గంజాయి దొరికింది. దీంతో సంపత్, షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారణం చేస్తున్నాము. వీళ్లకు గంజాయి సప్లై చేసిన వాళ్ల కోసం గాలిస్తాం' అని వివరించారు.

తల్లిదండ్రుల స్టేట్‌మెంట్:షణ్ముఖ్ జస్వంత్, సంపత్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్లిద్దరి యూరిన్ శాంపిల్స్‌‌ను పరీక్షించగా.. ఇందులో వీళ్లిద్దరూ గంజాయి సేవించినట్లు తేలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై షణ్ముఖ్ తల్లిదండ్రులు స్పందించారు. ఈ మేరకు ఓ మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారులు గంజాయి సేవించారన్న వార్తలను కొట్టిపారేశారు.

 Shanmukh Jaswanth Parents First Reaction On Case

షణ్ముఖ్‌ అరెస్ట్‌పై క్లారిటీగా:తాజాగా షణ్ముఖ్ పేరెంట్స్ మాట్లాడుతూ.. 'షణ్ముక్ జస్వంత్ ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు. బయట సర్క్యులేట్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. తన అన్నయ్య విషయంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు షణ్ముక్ సరిగ్గా సమాధానాలు ఇవ్వకపోవడం వల్లే అదుపులోకి తీసుకున్నారు' అంటూ వెల్లడించారు.

రంగంలోకి కల్యాణ్ సుంకర:షణ్ముఖ్ కేసును వాదిస్తున్న న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర 'యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ ,ఆయన సోదరుడు సంపత్ వినయ్ కేసు నేను చూస్తున్నాను. వారి తండ్రి నా వద్దనే ఉన్నారు. షణ్ముఖ్‌పై మీడియాలో వస్తున్న కథనాలకు ఏ సంబంధం లేదు. అన్ని ఆధారాలు పోలీస్ వారికి సమర్పిస్తున్నాం. మరిన్ని వివరాలు విపులంగా తెలియజేస్తాను' అని పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X