For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Deepthi Sunaina తో బ్రేకప్. ఆ హక్కు ఉందంటూ.షాకింగ్‌గా స్పందించిన షణ్ముక్ జస్వంత్

  |

  షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా బ్రేకప్ స్టోరీ నిన్న రాత్రి నుంచి హాట్ టాపిక్ గా మారింది. సుమారు ఐదేళ్ల నుంచి వీళ్లిద్దరూ ప్రేమలో ఉండగా వీరు బ్రేకప్ చెప్పుకుంటారని ఇటీవల తెగ ప్రచారం జరుగుతోంది. దానికి ఊతం ఇస్తూ న్యూ ఇయర్ కు కొద్దిగా ముందుగా షణ్ముఖ్‌కు పెద్ద షాకిచ్చింది దీప్తి. ఆమె అతనికి బ్రేకప్ చెప్పగా దాని మీద ఇప్పుడు షన్ను స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

   బాగా ప్లస్ అయింది

  బాగా ప్లస్ అయింది

  బిగ్ బాస్ ఐదో సీజన్‌‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా వారిలో ఒకరిగా షణ్ముఖ్ జస్వంత్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ముందు అతనికున్న సోషల్ మీడియా క్రేజ్ చూసి అతనే టైటిల్ విన్నర్ అనుకున్నారు. దీనికితోడు అతడి ప్రేయసి దీప్తి సునైనా కూడా బయట నుంచి అతనికి ఎంతో సపోర్ట్ చేసింది. అంతేకాదు, అతడిని విమర్శించిన వాళ్లకు కౌంటర్లు ఇస్తూ వారితో గొడవ కూడా పడేది. ఆమె మద్దతు షన్నూకి డే వన్ నుంచి బాగా ప్లస్ అయింది.

  ముద్దులు.. హగ్గులు

  ముద్దులు.. హగ్గులు

  అయితే దాన్ని చేజేతులా అతనే నాశనం చేసుకున్నాడు. మరో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సిరి హన్మంతుతో షన్ను క్లోజ్ అయ్యాడు. బిగ్ బాస్ షో కంటే ముందే షణ్ముఖ్ జస్వంత్‌కు సిరి హన్మంత్ మంచి ఫ్రెండ్. దీంతో హౌస్‌లో మొదట కొన్ని రోజులు ఒకరంటే ఒకరికి పడనట్టు నటించినా ఆ తరువాత అన్నీ వదిలేసి సన్నిహితంగా ఉన్నారు. కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం, ఎప్పుడు చూడు ముద్దులు.. హగ్గులు చేసుకోవడంతో వారి మధ్య రచ్చ మాములుగా లేదు.

   షణ్ముఖ్ జస్వంత్ రన్నర్‌గా

  షణ్ముఖ్ జస్వంత్ రన్నర్‌గా

  వీళ్లిద్దరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు వచ్చిన సమయంలో కూడా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీ హాన్, షన్ను గర్ల్ ఫ్రెండ్ దీప్తి బయట నుంచి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అయితే ఈ హగ్గులు, ముద్దుల వ్యవహారంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్ముఖ్ జస్వంత్ రన్నర్‌గా మిగిలాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో సిరి హన్మంత్‌తో రొమాన్స్ చేయడం వల్ల షణ్ముఖ్ జస్వంత్ ఇమేజ్ ఓ రేంజ్‌లో డ్యామేజ్ అయిపోయింది. అతనిపై ప్రియురాలు దీప్తి సునైనా కూడా కోపంగా ఉందని, బ్రేకప్ తప్పదని ప్రచారం జరిగింది.

   షణ్ముఖ్‌కు బ్రేకప్

  షణ్ముఖ్‌కు బ్రేకప్

  ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును కూడా ఆమె షేర్ చేసింది. 'చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్ను, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ న్యూ ఇయర్ రోజు రావడానికి కొద్దీ క్షణాల ముందు షేర్ చేసి భారీ షాక్ ఇచ్చేసింది.

  ఇష్టంగా విడిపోవడమే బెటర్

  ఇష్టంగా విడిపోవడమే బెటర్

  'ఈ ఐదు సంవత్సరాల్లో మేము సంతోషంగా ఉండడంతో పాటు చాలా మందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరందరూ కోరుకున్నట్లుగా మేము కూడా కలిసుండాలి అనుకున్నాం. కానీ, అది కుదరడం లేదు. సోషల్ మీడియాలో కనిపించినంత తేలికైన ప్రయాణం కాదిది. కలిసుండాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అయితే, కష్టంగా కలిసుండడం కంటే ఇష్టంగా విడిపోవడమే బెటర్ అని అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

  చాలా కష్టాలు పడింది

  చాలా కష్టాలు పడింది

  అయితే ఆమె బ్రేకప్ ప్రకటన మీద షన్ను స్పందించారు. ఈ నిర్ణయం తీసుకునే అన్ని హక్కులు ఆమెకు ఉన్నాయి, ఆమె ఇప్పటి వరకు చాలా కష్టాలు పడింది. చివరకు ఆమె సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం ఏ దారిలో వెళ్లినా ఒకరికొకరు ఆసరాగా ఉంటాం, నేను మెరుగైన వ్యక్తిగా ఎదగడానికి మీ అందమైన 5 సంవత్సరాలు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. మీరు సంతోషంగా ఉండటానికి అర్హులు, టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ దీపూ అంటూ షన్ను చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఈ బ్రేకప్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

  English summary
  Shanmukh Jaswanth Reacts on deepthi sunaina breakup announcement
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X