Shanmukh Jaswanth: కొత్త బ్యూటీతో షణ్ముఖ్ జస్వంత్ రొమాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో ప్రముఖ యూట్యూబర్లు దీప్తి సునైనా.. షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆరంభంలో ఎవరికి వారే క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ఇద్దరు.. ఆ తర్వాత జంటగా మారారు. ఇలా చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత గతేడాది ఆరంభంలో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఎవరికి వారే తమ తమ కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ మరొక బ్యూటీతో రొమాన్స్ సాగిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పెళ్లి చేసుకుంటారని..
ప్రొఫెషనల్‌గా పని చేస్తోన్న సమయంలోనే ప్రేమలో పడిన దీప్తీ సునయన, షణ్ముఖ్ జస్వంత్ చాలా కాలంగా జంటగా సందడి చేశారు. దీంతో వీళ్లిద్దరూ వ్యక్తిగతంగా కంటే జోడీగానే ఎక్కువ పాపులర్ అయ్యారు. తర్వాత అనేక వెబ్ సిరీసులు, కవర్ సాంగ్స్ లో జంటలుగా నటించి ఆకట్టుకున్నారు. దీంతో కష్ట సమయాల్లోనూ ఒకరికి ఒకరు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే దీప్తి, షన్నూ పెళ్లి కూడా చేసుకుంటారని చాలా రోజుల పాటు వార్తలు కూడా వచ్చాయి.

బ్యాడ్ ఇమేజ్..
బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లోకి షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో షన్నూ మరో సోషల్ మీడియా స్టార్ సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడు ఎలిమినేట్ కావడంతోపాటు బ్యాడ్ ఇమేజ్‌ను కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది.

గౌరవిస్తున్నట్లుగా..
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే బిగ్ బాస్ షో వల్ల షణ్ముఖ్ జస్వంత్ ఇమేజ్ డ్యామేజ్ అవడంతో దీప్తి సునైనా కూడా అతడిపై విముఖత వ్యక్తం చేసింది. ఫలితంగా సుదీర్ఘ బంధానికి పుల్‌స్టాప్ పెడుతూ అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన కూడా వదిలింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా దీప్తి సునయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టును చేశాడు. ఈ పోస్ట్ అప్పట్లో వైరల్ అయింది.

బిజీగా మారి..
బిగ్ బాస్ షో వల్ల చెడ్డపేరు రావడం.. లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఆ తర్వాత కొత్త వెబ్ సిరీస్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'ను ప్రకటించాడు. తర్వాత కొద్దిరోజులకు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలైది. ఈ వెబ్ సిరీస్ ను సుబ్బు కే తెరకెక్కించగా.. ఆహా నిర్మించింది. ఇలా వెబ్ సిరీస్, యూట్యూబ్ సిరీస్ లతో బిజీగా మారిపోయాడు షణ్ముఖ్. ఇక, దీప్తి సునైనా కూడా తన కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది.

జానూ వీడియోతో..
ఇటీవల జానూ అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసిన షణ్ముఖ్ జస్వంత్ తాజాగా అయ్యయ్యో అంటూ మరో కొత్త వీడియోతో దర్శనం ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సాంగ్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశాడు షణ్ముఖ్ జస్వంత్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఈ గ్లింప్స్ వీడియోలో షణ్ముఖ్ చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ అయ్యయ్యో అంటూ సాగిన మ్యూజిక్ వీడియోలో షన్నుకు కొత్త బ్యూటి జత కట్టింది.
ఆన్ స్క్రీన్ పెయిర్ రొమాన్స్..
షణ్ముఖ్ జస్వంత్ లేటెస్ట్ వీడియోలో అతనికి జోడీగా నటి ఫణి పూజిత నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ పెయిర్ బాగుంది. అందులో ఆమెతో చేసిన కొద్దిపాటి హగ్ రొమాన్స్ ఆకట్టుకునేలా ఉంది. తన ప్రేయసిని కలుసుకునేందుకు పరితపించే ఓ ప్రేమికుడిలా షణ్ముఖ్ జస్వంత్ కనిపిస్తున్నడు. ఈ మ్యూజిక్ వీడియోకు వినయ్ షణ్ముఖ్ దర్శకత్వం వహించగా.. ది ఫాంటిసియా మ్యాన్ సంగీతం అందించారు. వీడియోకు మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది. ఇలా కొత్త బ్యూటీతో షణ్ముఖ్ ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











