షణ్ముఖ్ కేసులో పెను సంచలనం: నిజాలు చెబుతూ సూసైడ్ అంటూ.. లీకైన ఒరిజినల్ వీడియో

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిన అంశాల్లో ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ అంశం ఒకటి. చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన అతడు.. గంజాయి కేసులో అరెస్ట్ అవడం హాట్ టాపిక్‌గా మారింది.

అతడు జైలుకు వెళ్లిన తర్వాత ఈ కేసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందో తెలియాలంటే పూర్తిగా చూడాల్సిందే!

Shanmukh Jaswanth Said Truth to Police Video Goes Viral In Social Media

గంజాయి కేసులో అదుపులోకి: ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడన్న అభియోగంతో షణ్ముఖ్ జస్వంత్ సోదరుడు సంపత్ వినయ్‌పై కేసు నమోదు అయింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వాళ్ల ఫ్లాట్‌కు వచ్చి సోదాలు నిర్వహించారు. అప్పుడు వాళ్లకు 16 గ్రాముల గంజాయి లభ్యం అయింది. దీంతో వినయ్‌తో పాటు షణ్ముక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shanmukh Jaswanth Said Truth to Police Video Goes Viral In Social Media

మెడికల్ టెస్టులో దొరికారు: గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్, సంపత్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్లిద్దరిని పోలీసులు మెడికల్ టెస్టులకు తీసుకు వెళ్లారు. అక్కడ వీళ్లిద్దరి యూరిన్ శాంపిల్స్‌‌ను పరీక్షించగా.. ఇందులో వీళ్లు గంజాయి సేవించినట్లు తేలినట్లు తెలిసింది. దీంతో షణ్ముఖ్‌తో పాటు అతడి సోదరుడు సంపత్‌ను పోలీసులు జైలుకు తలరించారు.

Shanmukh Jaswanth Said Truth to Police Video Goes Viral In Social Media

బెయిల్‌పై వచ్చినప్పటికీ: గంజాయి కేసులో అరెస్ట్ అయిన షణ్ముఖ్ జస్వంత్, సంపత్ వినయ్ శనివారమే బెయిల్‌పై విడుదల అయినట్లు తెలిసింది. ఆ తర్వాత కూడా పోలీసులు విషయాలను వెల్లడించకున్నా.. ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో మీడియాలో షణ్ముఖ్ గురించి, అతడి సోదరుడి గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి.

Shanmukh Jaswanth Said Truth to Police Video Goes Viral In Social Media

షణ్ముఖ్ వీడియో వైరల్‌గా: షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో అరెస్ట్ అవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడు ఎలాంటి తప్పు చేయడని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా షణ్ముఖ్ జస్వంత్ పోలీసుల ముందు నిజం ఒప్పుకుంటోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Shanmukh Jaswanth Said Truth to Police Video Goes Viral In Social Media

డిప్రెషన్‌లో ఉన్నానంటూ: తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో షణ్ముఖ్ జస్వంత్ పోలీసులతో ఏడుస్తూ మాట్లాడాడు. ఇందులో వెనుక నుంచి కనిపిస్తోన్న అతడు.. ఎదురుగా ఉన్న వాళ్లతో 'చూడండి.. మీరే చూడండి. నేను చాలా రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నాను. సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకుంటున్నా' అని అతడు చెబుతున్న మాటలు వినిపించాయి.

Shanmukh Jaswanth Said Truth to Police Video Goes Viral In Social Media

గంజాయి గురించి కూడా: తాజాగా బయటకు వచ్చిన వీడియోలో షణ్ముఖ్ జస్వంత్ తాను గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నాడని కూడా అంటున్నారు. ఇందులో అది స్పష్టంగా కనిపించకున్నా పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాత్రం చాలా నిజాలు ఒప్పుకున్నాడని అంటున్నారు. దీంతో షణ్ముఖ్ చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X