సన్నీకి రాడ్ అంటూ షన్ను షాకింగ్ కామెంట్స్.. కంటెస్టెంట్స్ మధ్యలో చిచ్చు పెట్టిన ఆడియెన్స్ సందేహాలు!
బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ మొత్తానికి ఆఖరి పోరు లోకి అడుగుపెట్టబోతోంది. ఇన్ని రోజులు జరిగినా గేమ్ ఒక లెక్క, ఇప్పుడు జరగబోయే ఆట మరొక లెక్క అనే తరహాలో ఉంటుంది అని అర్ధమవుతుంది. ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇప్పటినుంచి వారి ఎమోషన్స్ ను కూడా దాటేసి ఊహించని పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక చాలా కాలం తర్వాత ప్రేక్షకుల సందేహాలను కూడా బిగ్ బాస్ లో ప్రవేశపెట్టారు. అయితే చివరికి ఆ ప్రశ్నలు కంటెస్టెంట్స్ మధ్యలో అనేక రకాల సందేహాలను కలిగిస్తూ వారి మధ్య చిచ్చు పెట్టే విధంగా మారాయి. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచి వాతావరణంలోనే గొడవలు
కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇన్ని రోజులు ఒక లైన్ లోనే గేమ్ ఆడుతూ వచ్చారు. కానీ ఇకనుంచి ఫైనల్ కు చేరాలి అంటే అంతకు మించి అనేలా పోరాడాల్సి ఉంటుంది. అయితే వారికి ముందుగా బిగ్ బాస్ అన్ని రకాల ఎమోషన్స్ ను క్రియేట్ చేస్తున్నాడు. మంచి వాతావరణం నెలకొనడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా గొడవలు పడే సమయానికి ఊహించని విధంగా మారతారు. అయితే ఒక్కొక్కరు వారికి ఇచ్చిన టాస్క్ లో బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ ఊహించని విధంగా ఒక ట్విస్ట్ ఇచ్చాడు.

షన్ను గ్రూప్ లో శ్రీరామ్
ఈరోజు ఇంటి సభ్యులు అందరూ కూడా ప్రేక్షకుల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక గతంలో జెస్సీ ఘటన జరిగినప్పుడు షన్ను మెచ్చుర్ గా లేడు అంట శ్రీరామ్ చెప్పాడు. కానీ ర్యాంకింగ్ టాస్క్ లో మీరే మళ్ళీ షన్ను మెచ్యూర్ అంటూ సెకండ్ ప్లేస్ లో పెట్టారు. మీ ఒపీనియన్ ఎందుకు మారింది? ఇప్పుడు షన్ను గ్రూప్ లో ఉన్నారా అంటూ ఒక ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు శ్రీరామ్ షాక్ అయ్యాడు. ఇక షన్ను కూడా నాకు ఒక గ్రూప్ కూడా ఉందా అంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.

సన్నికి పెద్ద రాడ్
ఇక ఆడియోన్స్ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ లా వాడుకుంటున్నాడు అని మీకు అనిపించట్లేదా..? అని మనస్ కు ఒక అభిమాని ప్రశ్న విసిరాడు. అసలు అలాంటి ప్రశ్నలు ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే మానస్ సన్నీ ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీ గా ఉన్నారు. ఈ ప్రశ్న పై సిరి కూడా ఆశ్చర్యపోయింది. ఇది మానస్ కు ప్రశ్న కాదు. సన్నీకి పెద్ద రాడ్ అంటూ షణ్ముఖ్ తనదైన శైలిలో వివరణ ఇవ్వడం విశేషం. షన్ను అలా చెప్పడంతో శ్రీరామచంద్ర పక్కున వేశాడు.

సిరిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు?
ఇక షణ్ముఖ్ ఏ విధంగా ప్రశ్నించారు. సిరి అంటే మీరు ఎందుకు అంత పొసెసివ్ గా ఫీలవుతారు. సిరిని ప్రతిసారీ ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? తనని తనలా ఎందుకు ఉండనివ్వరు అంటూ షణ్ముఖ్ జస్వంత్ అడగడంతో.. అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కాజల్ అయితే చప్పట్లు కొడుతూ సంబరపడిపోయింది. ఇక నేను ఇది అయితే ముందుగానే ఊహించాను అంటూ షన్ను చాలా క్లారిటీగా వివరణ ఇచ్చాడు . ఇక శ్రీ రామచంద్ర తనని కంట్రోల్ చేస్తూన్నవా అని అడగడంతో అలా ఏమీ లేదు అంటూ సిరి ఎప్పటిలాగే మళ్లీ అబద్ధాలు చెప్పేసింది. సిరి వివరణ ఇచ్చినప్పటికీ.. అలా కాకపోతే అలాంటి ప్రశ్న రాదు అంటూ షణ్ముఖ్ చాలా ఓపెన్ గా వివరణ ఇచ్చాడు.

కాజల్ ఎమోషనల్..
ఇక సన్నీకి ఈ విధంగా ప్రశ్న ఎదురయింది. అందరి ముందు కాజల్ ని ఎందుకు హ్యూమిలేట్ చేస్తారు? స్టాండ్ తీసుకొని మీకోసం ఎవిక్షన్ పాస్ విన్ అయింది అని వివరణ ఇవ్వడంతో.. కాజల్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ థాంక్యూ అని వివరణ ఇచ్చింది. ఇక కాజల్ కు ఇలాంటి ప్రశ్న ఎదురయ్యింది. మీరు మొదట్లో జెస్సితో ఫ్రెండ్లిగా ఉండేవారు. మళ్లీ రవితో ఇప్పుడు ఇంకా మానస్ తో ఉన్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్ళడానికి ఇలా ఫ్రీగా ఉంటున్నారా అని వివరణ ఇవ్వడంతో.. అందరూ కూడా ఇదే అడుగుతారని మాట్లాడుకున్నారు. ఇక కాజల్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది.

షన్ను కంటే స్ట్రాంగ్ ప్లేయర్..
ఇక మీరు షన్ను కంటే స్ట్రాంగ్ ప్లేయర్ కానీ మిమ్మల్ని మీరు ఎందుకు అలా కన్సిడర్ చేసుకోవడం లేదు అంటూ సిరి కి మరొక ప్రశ్న ఎదురయింది.. మీరు షన్ను కన్నా స్ట్రాంగ్ ప్లేయర్ అన్న విషయాన్ని షణ్ముఖ్ జస్వంత్ మరోసారి గుర్తు చేశాడు. ఇక ఓట్ల విషయంలో సన్నీ శ్రీరామ్ మధ్యలో కూడా గొడవ మొదలయింది. చూస్తుంటే ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు కంటెస్టెంట్స్ మధ్యలో మరొక కొత్త తరహా చర్చను మొదలు పెట్టినట్లు ఉన్నట్లు అర్థమవుతోంది. మరి ఈ వారం కంటెస్టెంట్స్ టాస్క్ లను ఏ విధంగా పూర్తి చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











