Bigg Boss Telugu: పాపులారిటీ ప్రకారం నెంబర్ వన్ గా షన్ను.. టాప్ ఫైవ్ లో ఎవరున్నారంటే?

తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు ఆరు వారాలు పూర్తి కాగా ఆరుగురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆసక్తికరంగా ఆరుగురిలో ఐదుగురు ఫిమేల్ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే హౌస్ లో టాప్ 5 ఎవరు అనే దాని మీద ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే పాపులారిటీ ప్రకారం హౌస్ లో టాప్ ఫైవ్ ఎవరు అనే విషయం మీద ఒక పాపులర్ మీడియా సంస్థ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

 టాప్ ఫైవ్ లో

టాప్ ఫైవ్ లో

బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టాప్ ఫైవ్ లో ఉన్న వారిలో ఒకరు మాత్రమే చివరి ఫైనల్ విన్నర్స్ గా గెలుస్తారు. అందుకే టాప్ ఫైవ్ లో ఉండడానికి హౌస్ సభ్యులు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే టాప్ ఫైవ్ లో ఎవరున్నారు అనే విషయం మీద పాపులర్ మీడియా సర్వే సంస్థ ఓ ఆర్ మాక్స్ సర్వే చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎవరెవరు టాప్ ఫైవ్ లో నిలిచారు అనే విషయానికి వస్తే షణ్ముఖ్, రవి, శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి, సన్నీ ఉన్నారు.

 షణ్ముఖ్ జస్వంత్

షణ్ముఖ్ జస్వంత్

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ టాప్ ఫైవ్ మోస్ట్ పాపులర్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడు. అక్టోబర్ 9 నుంచి 15 వరకు జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుని సర్వే సంస్థ సర్వే చేపట్టగా అందులో షణ్ముఖ్ టాప్ ప్లేస్ సంపాదించాడు. అయితే షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో పాపులారిటీ ఉంది కానీ హౌస్ లో ఎక్కువగా సిరి, జశ్వంత్ తో కలిసి సమయం గడుపుతున్నాడు, గేమ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే మాటలు మాత్రం షణ్ముఖ్ విషయంలో వినిపిస్తున్నాయి.

యాంకర్ రవి

యాంకర్ రవి

హౌస్ లో చాలా తెలివిగా ఆట ఆడుతున్న యాంకర్ రవి మోస్ట్ పాపులర్ తెలుగు బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ల లిస్ట్ లో రెండో స్థానం సంపాదించాడు. ఒకరకంగా యాంకర్ రవి తో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని సంబంధాలు పెట్టుకున్న కంటెస్టెంట్ లు బయటకు వెళ్లిపోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. నిన్న ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మ కూడా అలాంటి కామెంట్లు చేయడంతో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మిగతా హౌస్ సభ్యులు భావిస్తున్నారు

సింగర్ శ్రీరామచంద్ర

సింగర్ శ్రీరామచంద్ర

ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అయిన శ్రీ రామచంద్ర కూడా హౌస్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తనదైన గేమ్ ఆడుతూ ఆయన ముందుకు వెళుతున్నాడు. లవ్ ట్రాక్ నడిపిన హమీద ఎలిమినేట్ అయ్యాక కాస్త గేమ్ మీద ఫోకస్ పెడుతున్న శ్రీరామ్ ఈ లిస్టులో మూడవ స్థానంలో నిలిచాడు. శ్రీరామ్ టైటిల్ విన్నర్ రేస్ లో ఉంటాడు అని ముందు నుంచి అందరూ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి టాస్క్ లో కూడా శ్రీరామ్ మిగతా కంటెస్టెంట్ ల కు గట్టి పోటీదారు నిలబడుతున్నాడు.

మానస్ నాగులపల్లి

మానస్ నాగులపల్లి

హౌస్ లో చాలా కూల్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న మానస్ కూడా టాప్ ఫైవ్ లిస్టులో స్థానం సంపాదించారు. ఏకంగా నాలుగవ స్థానం సంపాదించి హౌస్ లో టాప్ ఫైవ్ ఉండాల్సిన వారిలో ఒకరిగా నిలిచాడు. ముందు నుంచి కూడా మానస్ చాలా సెటిల్డ్ గా ఆడుతూ వస్తున్నాడు. ఎమోషన్స్ విషయంలో అలాగే గేమ్ విషయంలో కూడా ఎవరు ఎన్ని సార్లు రెచ్చగొట్టాలని చూసిన తనదైన ఆట ఆడుతూ మన ముందుకు వెళుతున్నాడు.

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh @1 నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్లు Top 5 Contestants | Filmibeat Telugu
వీజే సన్నీ

వీజే సన్నీ

ముందు నుంచి కూడా ఒక్కసారైనా కెప్టెన్ అవ్వాలని తాపత్రయ పడుతున్న సన్నీ కూడా తనదైన ఆట ఆడుతూ మానస్ తో స్నేహం చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఈ లిస్టులో ఆయన అయిదవ స్థానం సంపాదించాడు. అక్టోబర్ 9 వ తారీకు నుంచి 15వ తారీఖు వరకు జరిగిన ఎపిసోడ్ ల ప్రకారం సోషల్ మీడియా నెటిజన్లు అభిప్రాయపడిన మేరకు ఈ ఐదుగురు టాప్ ఫైవ్ లో ఉంటారని అంటున్నారు. అయితే ఆట ఒక్క రోజులో కూడా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు టాప్ ఫైవ్ లో ఉంటారా లేదా అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X