Bigg Boss ఐదో సీజన్‌లో అతడికే ఎక్కువ: షో చరిత్రలో రికార్డు నమోదు.. ఆమెను వెనక్కి నెట్టేస్తూ!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుంటూ.. టీఆర్పీ రేటింగ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా హిందీలో మొదలైన ఇది.. చిన్నగా దేశంలోని చాలా భాషల్లో పరిచయం అయింది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం తెలుగులోకి కూడా వచ్చింది. సరికొత్త విధానంతో సాగే గేమ్ షో అయినప్పటికీ మన ప్రేక్షకులకు బాగానే వంట పట్టింది. ఫలితంగా దీనికి వాళ్ల నుంచి ఆదరణ దక్కుతోంది. దీంతో మొదటి సీజన్ నుంచే సూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఫలితంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, త్వరలోనే ఐదోది కూడా మొదలవబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అనుమానాలతో మొదలు.. సూపర్ హిట్

అనుమానాలతో మొదలు.. సూపర్ హిట్

కొంత మంది సెలెబ్రిటీలను ఓ ఇంట్లో ఉంచి.. వాళ్లకు టాస్కులు ఇచ్చి.. చివరి వరకూ ప్రేక్షకుల ఆధరాభిమానాలతో ఎవరైతే నెగ్గుకు రాగలరో వాళ్లను విజేతలుగా ప్రకటించడమే బిగ్ బాస్ షో విధానం. ఇందులో ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి. తెలుగులోకి బిగ్ బాస్ షో పరిచయం అయిన సమయంలో దీన్ని ఇక్కడి వాళ్లు ఆదరిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఊహించని విధంగా ఈ షోను ప్రేక్షకులే సూపర్ హిట్ చేశారు. అంతేకాదు, ఏకంగా నాలుగు సీజన్లను ఒక దానికి మించి ఒకటి సక్సెస్ అయ్యేలా స్పందనను అందించారు.

ప్రమాదానికి గురైన జబర్ధస్త్ వర్ష: ఆ నటుడు స్పీడుగా నడపడంతో ఘటన.. షాకిస్తోన్న వీడియో
https://telugu.filmibeat.com/television/jabardasth-varsha-met-an-accident-in-super-serial-championship-season-3-show-101626.html

ముగ్గురు స్టార్లుతో.. నేషనల్ రేంజ్ రికార్డ్స్

ముగ్గురు స్టార్లుతో.. నేషనల్ రేంజ్ రికార్డ్స్


బిగ్ బాస్ తెలుగు షో జూనియర్ ఎన్టీఆర్ సారథ్యంతో మొదలైంది. ఏమాత్రం అంచనాలు లేని ఈ షోకు అతడు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఆ తర్వాత రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని కూడా తనదైన హోస్టింగ్‌తో సక్సెస్ చేశాడు. ఇక, మూడు, నాలుగు సీజన్లను సీనియర్ హీరో నాగార్జున విజయవంతంగా నడిపించారు. తద్వారా షో సక్సెస్‌లో ఈ ముగ్గురు తమ వంతు కృషి చేశారు. అందుకే మన బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా 18 పైచిలుకు రేటింగ్‌తో గత సీజన్‌ ఎపిసోడ్ నేషనల్ రికార్డును కూడా క్రియేట్ చేసి సత్తా చాటింది.

ఐదో సీజన్ వచ్చేస్తుంది.. మొదటిది ఇలా

ఐదో సీజన్ వచ్చేస్తుంది.. మొదటిది ఇలా

బిగ్ బాస్ ఆరంభం నుంచి ప్రతి ఏడాదీ బిగ్ బాస్ ప్రసారం అవుతోంది. అయితే, కోవిడ్ రెండో దశ కారణంగా ఐదో సీజన్‌ మొదలయ్యే అవకాశాలు లేవని ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత షో ఉంటుందన్న క్లారిటీ వచ్చింది. అంతేకాదు, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఇది ప్రసారం కాబోతుందన్న టాక్ కూడా వినిపించింది. కానీ, ఇటీవలే లోగో ప్రోమో కూడా విడుదలైంది. తద్వారా త్వరలోనే కొత్త సీజన్ రాబోతుందని ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ప్రియులంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి.. పేర్లు బయటకు

కంటెస్టెంట్ల ఎంపిక పూర్తి.. పేర్లు బయటకు

బిగ్ బాస్ ఐదో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. ఈ క్రమంలోనే ఇటీవలే షార్ట్ లిస్టును కూడా తయారు చేసి వాళ్లతో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక, ఇప్పటికి అందిన సమచారం ప్రకారం.. ఐదో సీజన్‌లో సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్, గీతా సింగ్, లోబో, సురేఖ వాణి, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యాంకర్ రవి, రఘు మాస్టర్, టిక్ టాక్ దుర్గారావులు పాల్గొనబోతున్నట్లు చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది.

ఐదో సీజన్‌లో సోషల్ మీడియా స్టార్ ఎంట్రీ

ఐదో సీజన్‌లో సోషల్ మీడియా స్టార్ ఎంట్రీ


బిగ్ బాస్ ఐదో సీజన్‌ నుంచి కంటెస్టెంట్ల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు నిర్వహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ, దాదాపుగా పూర్తి లిస్టు ముందే లీక్ అయిపోయింది. ఇందులో బుల్లితెర, వెండితెరకు సంబంధించిన చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు సోషల్ మీడియా సెలెబ్రిటీలు సైతం ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందులో తనదైన శైలి వీడియోలతో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోన్న షణ్ముఖ్ జస్వంత్ పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అతడు ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయిపోయింది.

ఆ కంటెస్టెంట్‌కు రికార్డు స్థాయి రెమ్యూనరేషన్

ఆ కంటెస్టెంట్‌కు రికార్డు స్థాయి రెమ్యూనరేషన్

బిగ్ బాస్ ఐదో సీజన్‌పై నిర్వహకులు మరింత ఫోకస్ చేశారు. దీన్ని గత సీజన్ల కంటే ఎక్కువ సక్సెస్ చేయాలని వాళ్లంతా పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఖర్చు ఎక్కువైగా బిగ్ సెలెబ్రిటీలనే తీసుకు రావాలని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఐదో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంపికైన షణ్ముఖ్ జస్వంత్‌కు దాదాపు కోటిన్నర రూపాయల వరకూ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. దీనితో పాటు అతడు విజయం సాధిస్తే మరో రూ. 50 లక్షలు వస్తాయి. ఇక, గతంలో శ్రీముఖి మాత్రమే రూ. కోటి తీసుకుంది. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ రికార్డు క్రియేట్ చేస్తున్నాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
షణ్ముఖ్ జస్వంత్ నేపథ్యం.. తాజాగా హిట్

షణ్ముఖ్ జస్వంత్ నేపథ్యం.. తాజాగా హిట్

సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు చేసుకుంటూ కెరీర్‌ను ఆరంభించాడు షణ్ముఖ్ జస్వంత్. ఈ క్రమంలోనే ఎంతో ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే, దీప్తి సునయనతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మధ్యలో వీళ్లిద్దరూ విడిపోయినా.. ఈ మధ్య మరోసారి కలుసుకున్నారు. ఇక, ఇటీవలి కాలంలో ఎక్కువగా వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఇటీవలే 'సూర్య' వెబ్ సిరీస్‌తో సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతానికి అతడు బిగ్ బాస్ కోసం సన్నద్ధం అవుతున్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X