బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిగా అలా చేయించిన షన్ను.. షన్నుని ఆడుకుంటున్న నెటిజన్లు?
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇప్పటికే 6 వారాలు పూర్తి చేసుకోగా ఏడో వారం ఆసక్తికరంగా సాగుతుంది.. అయితే బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం నెటిజన్లకు చేతినిండా పనిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ కి సంబంధించి అనేక మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉండగా ఇప్పుడు షో కి సంబంధించిన ప్రతి విషయం కూడా హైలెట్ గా నిలుస్తుంది. తాజాగా బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి సారిగా షణ్ముఖ్ సబ్ టైటిల్స్ వేయించాడు.

ఆ వివరాల్లోకి వెళితే
నిన్నటి ఎపిసోడ్ లో సన్నీ-సిరిల మధ్య గుడ్ల కోసం జరిగిన పోటీలో మరో అమ్మాయి ఉంటే ''నా చేయి విరిగిపోయింది. నన్ను అలా చేశారు.. ఇలా చేశారు అని ఏడ్చేది. నువ్వు పోటీగా తీసుకున్నావు. ఈ వారం నిన్ను తీసేస్తే, తీసేయొచ్చు'' అని సిరితో షణ్ముఖ్ అనగా, ''ఏడు వారాలు ఉన్నాను. వెళ్లిపోతే పోతా'' అని సిరి క్యాజువల్‌గా తీసుకుంది. అయితే జెస్సికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వగా.. దానికి సిరి హెల్ప్ తీసుకున్నాడు జెస్సి.

ముందు టాస్క్ బాగా ఆడు
ఈ టాస్క్ విషయంలో, బిగ్ బాస్ నాకు సీక్రెట్ టాస్క్ ఇవ్వండి అని షణ్ముఖ్ అడిగితే రవి మధ్యలో అరే నువ్వు ముందు టాస్క్ బాగా ఆడు అనేసరికి షణ్ముఖ్ బాగా హార్ట్ అయ్యాడు. ఈ విషయం మీద సిరి, షణ్ముఖ్, సిరి గొడవ పడ్డారు. ఈ టాస్క్ లో తనని ఉపయోగించుకుని జెస్సి, సిరి గేమ్ ఆడడం షణ్ముఖ్ జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ వాళ్లందరూ నువ్వు టాస్క్ సరిగా ఆడు అంటున్నారు.. ఈ వెధవ డైలాగ్స్ నేను వినాలి అంటూ సిరితో షణ్ముఖ్ అనడం సంచలనంగా మారింది.

పిచ్చ లైట్
నన్ను అందరూ పిచ్చ లైట్ తీసుకున్నారురా, సిరి నువ్వు వాడికి హెల్ప్ చేసావ్.. నేను వెధవనయ్యాను.. అంటూ షణ్ముఖ్ కోపంగా వెళ్ళిపోగా తప్పేం లేదు అని జెస్సి షణ్ముఖ్ కి చెబుతున్నాడు.. నేను హెల్ప్ అడిగితే సిరి చేసింది. నువ్వెవడివిరా చెప్పడానికి.. నా ఫీలింగ్ గురించి చెప్పాడని అంటూ షన్ను జెస్సి మీద ఫైర్ అయ్యాడు.

నువ్వు ఫ్రెండ్ అని
అయితే నువ్వు ఫ్రెండ్ అని ఫీలయ్యా కాబట్టే నీ దగ్గరకి వచ్చా అని సిరి అంటే.. నన్ను వెధవని చేసావ్.. నాకు గేమ్ ఆడడం కూడా రాదు అది నా దరిద్రం అంటూ షణ్ముఖ్ ఫీలవుతున్నాడు.. ఓదారుస్తున్న సిరి.. అరే నువ్వు వెళ్ళిపోరా ఇక్కణ్ణుంచి అంటూ చెప్పడంతో సిరి వెళ్ళిపోయింది. ఒంటరిగా షణ్ముఖ్ ఏడుపు స్టార్ట్ చేసాడు. సిరి, జెస్సి లు కూడా ఏడుపు మొదలు పెట్టారు..
Recommended Video

తెలుగు బిగ్ బాస్ చరిత్రలో
అయితే షణ్ముఖ్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి దాకా ఎవరికీ సబ్ టైటిల్స్ వేయలేదు. కానీ రాత్రి పడుకునే ముందు సిరితో షణ్ముఖ్ మాట్లాడిన మాటలు మనం వినడం కోసం ఏకంగా సబ్ టైటిల్స్ వేశారు. అయితే జెస్సీ విషయంలో షణ్ముఖ్ రియాక్షన్ సరిగా లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











