For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shanmukha Priya అద్భుతం కూడా నీ ముందు తక్కువే.. లెజెండ్ సింగర్ల ప్రశంసలు.. Indian Idol 12 ఓటు వేయాలంటే!

  |

  జాతీయ టెలివిజన్ ఛానెల్ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12 సీజన్‌లో తెలుగు తేజం షణ్ముఖ ప్రియ సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. వైజాగ్‌కు చెందిన మ్యూజిక్ సెన్సేషన్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తున్నది. భారతీయ సినిమా పరిశ్రమలో మ్యూజిక్ లెజెండ్స్‌ మన్ననలు అందుకొంటూ షణ్ముఖ ప్రియ సంగీత ప్రియుల హృదయాల్లో గూడుకట్టుకొన్నది. ఇండియన్ ఐడల్ 12 సీజన్‌ ఫైనల్ రౌండ్‌లో భాగంగా ఆదివారం ('ఆగస్టు 1వ తేదీన) ఎపిసోడ్‌లో షణ్ముఖ ప్రియ హల్‌చల్ ఎలా ఉందంటే...

  తుది పోరుకు ఆరుగురు యువ సింగర్లు

  తుది పోరుకు ఆరుగురు యువ సింగర్లు

  ఇండియన్ ఐడల్ సీజన్ 12 తుది పోటీలో షణ్ముఖ ప్రియతోపాటు పవన్‌దీప్ రాజన్, అరుణిత కంజిలాల్, మహ్మద్ డానిష్, సయేలి కాంబ్లే, నిహాల్ టారో పోటీలో నిలిచారు. తాజా ఎపిసోడ్‌లో ఎవరికి వారే అద్భుతమైన ప్రతిభను చాటుకొన్నారు. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా జరిగిన ప్రత్యేక ఎపిసోడ్‌కు మ్యూజిక్ లెజెండ్స్ కుమార్ సాను, కవితా కృష్ణమూర్తి గెస్టు‌లుగా హాజరయ్యారు. యువ నేపథ్య సంగీత కారుల ప్రతిభను చూసి ఆనందంతో పొంగిపోయారు.

  ఘాటు ఫొటోలతో పవన్ హీరోయిన్ రచ్చ: హద్దు దాటేసి మరీ అందాలు ఆరబోత.. చూస్తే షాక్ అవుతారు!

  షణ్ముఖ ప్రియ అద్భుతంగా

  షణ్ముఖ ప్రియ అద్భుతంగా

  ఫ్రెండ్‌షిప్ డేను పురస్కరించుకొని ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎపిసోడ్‌లో షణ్ముఖ ప్రియ వేదికపైన మెరిసారు. అద్బుతమైన గళంలో సీనియర్ సింగర్స్‌కు ఏ మాత్రం తీసుపోని విధంగా తన టాలెంట్‌ను ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్‌లో మిస్టర్ ఇండియా చిత్రంలో స్వర్గీయ శ్రీదేవీపై చిత్రీకరించిన హవా హవాయ్ అనే పాటను ఆలపించారు. రెండవ పాటగా అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, నమ్రతా శిరోద్కర్ నటించిన నటించిన పుకార్ చిత్రంలోని కే సెరా సెరా పాటను పాడి ఆకట్టుకొన్నారు.

  Janaki Kalaganaledu Today Promo 97th episode: లేడి గెటప్ లో రామ ముగ్గుల పాఠాలు.. జ్ఞానాంబ ఎంట్రితో న్యూ ట్విస్ట్

  ప్రాణం పెట్టి పాడిన పాటలకు..

  ప్రాణం పెట్టి పాడిన పాటలకు..


  షణ్ముఖ ప్రియ పాడిన పాటకు ఆర్కెస్ట్రాలోని సాంకేతిక నిపుణులు అద్బుతంగా స్పందించారు. ప్రాణం పెట్టి పాడిన పాటలకు సంగీత కారులు పోటాపోటీగా మ్యూజిక్ అందిచడంతో షణ్ముఖ పాడిన పాటలు ఈ ఎపిసోడ్‌కు హుషారును పుట్టించడమే కాకుండా మరికొంత అభిమానులను సొంతం చేసుకోవడానికి దోహదపడింది.

  నీది హాలీవుడ్ స్థాయి ప్రతిభ

  నీది హాలీవుడ్ స్థాయి ప్రతిభ

  షుణ్ముఖ ప్రియ పాడిన తీరుకు సింగర్ కవితా కృష్ణమూర్తి, కుమార్ సాను మాటలు పెగల్లేదు. అద్భుతం అంటూ కవితా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అద్భుతం మాట కూడా నీ ప్రతిభ ముందు చిన్నపోయింది. నీ ప్రతిభ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోదు. ఏన్నో ఏళ్లుగా పాడిన సీనియర్ సింగర్ మాదిరిగా పాడుతున్నావు. ఇక నీకు ఎదురే లేదు అంటూ షణ్ముఖ ప్రియపై ప్రశంసలు గుప్పించింది. కుమార్ సాను స్పందిస్తూ.. You are simply Superb అంటూ ఒక్కమాటలో తేల్చేశాడు.

  Karthika Deepam అంజి కోసం మోనిత వేట.. కుట్రలను అడ్డుకొనేందుకు దీప ఆట

  షణ్ముఖ ప్రియను ఆకాశానికి ఎత్తేస్తూ...

  షణ్ముఖ ప్రియను ఆకాశానికి ఎత్తేస్తూ...

  షణ్ముఖ ప్రియ ప్రతిభను చూసి జడ్జీలు హిమేష్ రెషామ్మియా, అనుమాలిక్, సోను కక్కర్ మరోసారి షాక్ అయ్యారు. సోను కక్కర్ మాట్లాడుతూ.. మనం హాలీవుడ్‌లోని షకీరా, రిహాన్నా, టేలర్ స్విఫ్ట్ లాంటి వాళ్లను ఆరాధిస్తారు. ఆయా దేశాల వారు మాకు వాళ్లు ఉన్నారని గొప్పగా చెప్పుకొంటారు. ఇప్పుడు మనం మనకు షణ్ముఖ ప్రియ ఉందని గొప్పగా చెప్పుకోవచ్చు అంటూ ప్రశంసించారు. మిగితా జడ్జీలు కూడా షణ్ముఖ ప్రతిభను ఆకాశానికి ఎత్తేశారు.

  క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన యాంకర్ మంజూష.. రష్మీ, అనసూయకు పోటీ ఇచ్చేలా హాట్ స్టిల్స్

  'Ram Gopal Varma Cheated Me' Says Shanmukha Priya
  ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ ఫినాలే..

  ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ ఫినాలే..


  ఇండియన్ ఐడల్ 12 సీజన్ ఫైనల్ ఆగస్టు 15వ తేదీన ప్రసారం కానున్నది. ఈ పోటీలో పాల్గొంటున్న ఫైనలిస్టులు తమకు ఓటు చేయని వేడుకొంటున్నారు. ఈ షోను నిర్వహిస్తున్న అధికారిక ఛానెల్ సోనికి చెందిన www.sonyliv.com లోగానీ, లేదా sonyliv app ను డౌన్ లోడ్ చేసుకొని ఓటింగ్ చేయవచ్చు. లేదా https://www.firstcry.com/ ద్వారా గానీ ఓటు చేయానికి వెసులుబాటు కలిగించారు.

  English summary
  Singer Shanmukhapriya in the race of Indian Idol 12 title. She is winning top legends fo Indian cinema and National wide audience, Music lovers. Grand finale will be on August 15th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X