హద్దులు మీరాడు, అందరూ ఆ కమెడియన్‌ను దూరం పెట్టారా?... షాకింగ్ లుక్!
Recommended Video

కపిల్ శర్మ... హిందీ టీవీ షోలు చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీ షోలతో ఒకప్పుడు హవా కొనసాగించిన ఈ స్టార్ ప్రస్తుతం డిప్రెషన్లోకి వెళ్లి షోలు చేయలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ ఏడాది సోనీ టీవీలో ప్రారంభమైన 'ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ' అనే షో కూడా మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఇతడితో పని చేయడానికి కూడా ఇతర ఆర్టిస్టులు ఎవరూ ఇష్టపడటం లేదుట. అందుకు కారణం అతడి వివాదాస్పద ప్రవర్తనే అని అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, పార్లమెంట్ మెంబర్ శతృఘ్న సిన్హా అతడిపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. తన కూతురు సోనాక్షి కూడా అతడికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

నా విషయంలో హద్దులు మీరి ప్రవర్తించాడు
నా విషయంలో కపిల్ శర్మ హద్దులు మీరి ప్రవర్తించాడు. అతడి షోలలో నా వాయిస్ మిమిక్రీ చేసి జోకులు వేసేవాడు. మిమిక్రీ చేయడం తప్పు కాదు.. ప్పవారైన లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, అమితాబ్ బచ్చన్‌ల వాయిస్‌ను కూడా మిమిక్రీ చేసే కళాకారులు ఉన్నారు. కానీ దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. అది దాటి ప్రవర్తించకూడదను అని శతృఘ్న సిన్హా అన్నట్లు ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది.

నా కూతురు సోనాక్షి కూడా వార్నింగ్ ఇచ్చింది
నా విషయంలో హద్దులు మీరి ప్రవర్తిస్తున్న కపిల్ శర్మకు తన కూతురు సోనాక్షి కూడా వార్నింగ్ ఇచ్చింది అని ఈ సందర్భంగా శతృఘ్న సిన్హా గుర్తు చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం కపిల్ శర్మ షోలు నడవటం లేదు. అయినా సరే అతడి గురించి శతృఘ్న సిన్హా ఇంతలా రియాక్ట్ అయ్యారేంటే.... అతడి చేష్టలతో ఈ సీనియర్ యాక్టర్ ఎంత హర్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.

మధ్యలోనే ఆగిపోయిన షో
ఈ ఏడాది మార్చిలో ‘ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్ శర్మ' అనే షో ప్రారంభం అయినప్పటికీ అది అర్దాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత తాగుడుకు అలవాటుపడి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన అతడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నట్లు సమాచారం.
లేటెస్ట్: హీరో ప్రభాస్, ఎన్టీఆర్, దిల్ రాజుకు ఛాలెంజ్!

బరువు పెరిగి షాకింగ్ లుక్
ప్రస్తుతం కపిల్ బరువు పెరిగి ఎవరూ గుర్తపట్టలేని లోకి మారిపోయాడని అంటున్నారు. ఇటీవల అతడు అమెరికాలో ఓ సూపర్ మార్కెట్లో తచ్చాడుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
లేటెస్ట్: సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!


Click it and Unblock the Notifications











