షాక్: బిగ్‌బాస్‌లోకి ఇద్దరు సెలబ్రిటీలు.. ఇంట్లోకి బర్నింగ్‌స్టార్.. ఓట్ల కుంభవర్షం.. ఎన్ని కోట్లో.!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 50 Highlights

బిగ్‌బాస్‌లో 50వ రోజు ఎలాంటి ఎలిమినేషన్‌ లేకుండా ఆసక్తిగా సాగిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు సభ్యులు మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చారు. వీరి రాకముందు ఇంటి సభ్యుల మనసులో ఏముందో తెలుసుకోవడానికి చిన్న గేమ్ ఆడారు. ఉద్విగ్న క్షణాల మధ్య ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పడంతో ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు. ఇంట్లోకి ఒకరు యాంకరమ్మ.. కొత్త బర్నింగ్‌స్టార్ ప్రవేశించారు.బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందంటే..

వాటర్ బెలూన్ గేమ్

వాటర్ బెలూన్ గేమ్

బిగ్‌బాస్ వేదికపైకి వచ్చిన నాని ఇంటి సభ్యులతో మాట్లాడారు. సరదాగా మాట్లాడుతూ వారికి ఆరు బయట చిన్న గేమ్ పెట్టారు. నామినేషనల్ ఉన్న వారిని ఒకలైన్‌లో నిలబెట్టి.. మరో లైన్‌లో నామినేషన్‌లో లేనివారిని నిలబెట్టారు. నామినేషన్‌కు గురైన వారిని వాటర్ బెలూన్లతో కొట్టి వారు ఇంటిలో ఎందుకు ఉండకూడదో చెప్పాలని సూచించారు.

ఊపిరి పీల్చుకొన్న సభ్యులు

ఊపిరి పీల్చుకొన్న సభ్యులు

మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చి ఎలిమినేషన్ల ప్రక్రియను చేపట్టారు. ఇంటిలోని సభ్యులకు ఎలిమినేషన్ లేదన్న విషయం తెలియక టెన్షన్ పడ్డారు. చివరికి ఒక్కొక్కరిని ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపుతూ చివరికి ఎలిమినేషన్ లేదని చెప్పడంతో సభ్యులు ఆనందంలోకి మునిగిపోయారు.

12 కోట్ల ఓట్లు

12 కోట్ల ఓట్లు

ఎలిమినేషన్‌కు గురైన వ్యక్తులను ఇంటిలోకి పంపించాలన్న ఓటింగ్‌లో రికార్డు స్థాయి ఓట్లు వచ్చాయి. సుమారు 12 కోట్ల ఓట్లు రావడం బిగ్‌బాస్ చరిత్రలోనే ఓ రికార్డు. 11 కోట్ల 70 లక్షల ఓట్లకుపైగా వచ్చాయని నాని తెలిపారు. ఈ విషయాన్ని సభ్యులకు తెలుపగా నోర్లు వెల్లబెట్టారు.

ఇంట్లోకి యాంకర్ శ్యామల

ఇంట్లోకి యాంకర్ శ్యామల

ఎలిమినేటెడ్ సభ్యుల నుంచి తొలుత యాంకర్ శ్యామల ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చింది. వేదికపైకి వచ్చిన శ్యామలతో నాని విషయాలు అడిగి తెలుసుకొన్నారు. బయటకు వెళ్లడానికి బలమైన కారణం లేకపోవడం వల్ల నన్ను మళ్లీ ఇంటిలోకి పంపించారని శ్యామల అభిప్రాయపడ్డారు. నేను ఎలిమినేట్ అయ్యాక మీరు బయటకు వస్తారని ఊహించలేదు అని అందరూ అభిప్రాయపడ్డారని నానికి చెప్పారు.

ఇంట్లోకి కొత్త బర్నింగ్‌స్టార్

ఇంట్లోకి కొత్త బర్నింగ్‌స్టార్

ఇక బిగ్‌బాస్‌లోకి రెండో సెలబ్రిటీగా కామన్ మ్యాన్ నూతన్ నాయుడు బరిలోకి దూకాడు. కలర్‌ఫుల్‌గా డ్రస్ వేసుకొని ఇంట్లోకి ప్రవేశించారు. నూతన్ డ్రస్ చూసి నాని షాకితిన్నారు. సంపూర్ణేష్‌బాబు మద్దతుతో నేను సంపూర్ణంగా బర్నింగ్‌ స్టార్‌గా మారబోతున్నానని చెప్పాడు. నూతన్‌ను కొత్త బర్నింగ్ స్టార్ చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X