కంటతడి పెట్టిస్తోన్న చైతన్య మాస్టర్ చివరి ఫోన్ కాల్.. శేఖర్ మాస్టర్ ఏమోషనల్ కామెంట్స్ వైరల్!
ఢీ డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో పెట్టి మరీ సూసైడ్ చేసూన్నారు. ప్రైవేట్ ఆల్బమ్ సొంగ్స్ చేసే ఛాన్స్ లు కూడా వస్తున్న తరుణంలో.. అయిన అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు అందరికి విషాధం నింపింది.
ఢీ డాన్స్ రియాలిటీ షో ద్వారా చైతన్య మాస్టర్ మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు అని చెప్పాలి. విపరీతంగా స్టేజ్ షోలు ఇచ్చే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇక ఆయన మారణంపై శేఖర్ మాస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

చనిపోవడానికి కారణం: ఢీ ద్వారా వచ్చిన పాపులారిటీతో బయట ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. ఆయన సెల్ఫీ వీడియో బట్టి ఈ కొరియోగ్రాఫర్ కెరియర్ కోసం, కుటుంబ అవసరాల కోసం విపరీతంగా అప్పులు చేసాడని కొందరు చెబుతున్నారు.
అలాగే ఒక ఈవెంట్ డబ్బులు ఆగిపోవడం వలన కూడా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఇక ఆ అప్పులు తీర్చలేక భారం పెరిగిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఢీ డాన్స్ షో ద్వారా కూడా పెద్దగా ఆదాయం రాదని చైతన్య మాస్టర్ మాటలతో స్పష్టం అయ్యింది.

కంటతడి పెట్టిస్తున్న చివరి మాటలు: ఇక చైతన్య మాస్టర్ చివరిగా మాట్లాడాడని ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక డాన్సర్ కోసం స్టేజ్ షో కోసం నిర్వాహకులతో చైతన్య మాట్లాడుతున్నారు. ఇక ఆ వైరల్ వీడియోలో చైతన్య చాలా కూల్ గా మాట్లాడుతూ మంచి డాన్సర్ ని సెట్ చేసే బాద్యత నాది అంటూ హోప్ ఇస్తున్నాడు.
అయితే ఇది ఎప్పుడో జనవరిలో ఆడియో కాల్ అయ్యి ఉంటుందనే మాట వినిపిస్తోంది. నిత్యం డాన్స్ కోసం, కెరియర్ కోసం మాత్రమే ఆలోచించే చైతన్య ఆలోచించే వాడని, ఎవరికి కష్టం వచ్చిన నేనున్నా అంటూ భరోసా ఇస్తూ ధైర్యం చెప్పేవాడని తోటి డాన్సర్ మాస్టర్స్ చెబుతున్నారు.

బాధలో ఉన్నట్లు చూడలేదని: ఎప్పుడు కూడా బాధలో ఉన్నట్లు చూడలేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే గత నెల రోజుల నుంచి కాస్తా ముభావంతో ఎవరితో మాట్లాడకుండా ఉండేవాడంటూ ఆమె తల్లి చెబుతున్నారు.
జీవితం మీద కోటి ఆశలతో, ఎన్నో కలలతో బ్రతికే చైతన్య లాంటి యంగ్ కొరియోగ్రాఫర్ ఇలా అర్ధంతరంగా ప్రాణాలు తీసుకోవడం తోటి డాన్సర్స్ సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక చైతన్య మరణంపై రష్మి, ఆదితో పాటి ఢీ డాన్స్ కొరియోగ్రఫర్స్ కూడా రియాక్ట్ అయ్యారు.
శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కామెంట్: అలాగే శేఖర్ మాస్టర్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. నీ లాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్ ని కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త విన్నప్పుడు నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం చైతన్య అని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టాలో రాసుకొచ్చారు.

చైతన్య మాస్టర్ అలా చేయాల్సింది కాదు: దీనిని బట్టి శేఖర్ మాస్టర్ ని చైతన్య మరణం చాలా బాధపెట్టిందని అర్ధం అయితే చైతన్య మరణం కారణంగా ఒక విషయం అర్ధమవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంత నిబ్బరంగా ఉన్నా కూడా తట్టుకోలేని స్థాయిలో సమస్యలు వెంటాడుతూ ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి దారులు కనిపించనపుడు ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చే ముందు మనల్ని ప్రేమించే వారు సమాజంలో చాలా మంది ఉంటారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే సమస్యకి పరిష్కారం దొరకొచ్చు అని వారి సన్నిహితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











