Bigg Boss Telugu 8: శేఖర్ బాషా బిగ్ బాస్ రెమ్యూనరేషన్ లీక్.. 2 వారాలకు అన్ని లక్షలు!
ఇండియాలోని ఎన్నో భాషల్లో వస్తున్నా.. తెలుగులో మాత్రమే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అందుకే ఇక్కడ నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను తీసుకొస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ఎంతో ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇది ఆరంభంలోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితుల్లో 2వ వారంలో శేఖర్ బాషా షో నుంచి ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. మరి అతడు ఈ సీజన్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో చూద్దాం పదండి!
అన్‌లిమిటెడ్ కావడంతో
సాధారణంగా బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా తెలుగులో సూపర్ హిట్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో నడుస్తోన్న ఎనిమిదో సీజన్ మరింత సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. దీనికి కారణం ఇందులో గతంలో ఎన్నడూ చూపించని కంటెంట్‌ను ప్రసారం చేస్తుండడమే. అందుకే దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ సీజన్ బాగా సాగిపోతోంది.

శేఖర్ బాషా బాగా హైలైట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి మొదట 14 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్నారు. అందులో కొందరు మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. వారిలో ప్రముఖ నటుడు, రేడియో జాకీ అయిన శేఖర్ బాషా ఒకరు. ఇటీవలే ఓ కాంట్రవర్శీలో భాగం అయిన అతడు.. షోలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాడు.
మంచి పేరు.. పంచ్‌లతో
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుంచే శేఖర్ బాషా తన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా షోలో తనదైన రీతిలో జోకులు చెప్తూ ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే, బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. ఫలితంగా అతడి వ్యక్తిగతంగా మంచి పేరు వచ్చినా.. ఆటపరంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.
2వ వారంలో ఎలిమినేట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మొదటి వారంలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. అయితే, రెండో వారంలో మాత్రం ఎవరు వెళ్తారన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2వ వారం ఎలిమినేషన్‌లో సంచలనం కనిపించింది. ఇందులో బయట చాలా మంచి పేరు ఉన్న శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.
శేఖర్ రెమ్యూనరేషన్ లీక్
బిగ్ బాస్ హౌస్‌లోకి మంచి అంచనాలతో వచ్చి.. అందుకు అనుగుణంగానే పేరు సంపాదించుకున్న శేఖర్ బాషా 2 వారంలో ఎలిమినేట్ అయ్యాడు. దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. శేఖర్‌కు ఒక్కో వారానికి రూ. 2.50 లక్షలు తీసుకున్నాడని తెలిసింది.
అన్ని లక్షలు వచ్చాయి
బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. శేఖర్ బాషాకు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం రోజుకు రూ. 35 వేల చొప్పున వారానికి రూ. 2.50 లక్షలు చార్జ్ చేశాడట. అలా 2 వారాల పాటు ఉన్న శేఖర్ మొత్తంగా రూ. 5 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఇతగాడు మరోసారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











