డిమాన్ పవన్‌ను నిలదీసిన శేఖర్ మాస్టర్.. స్టేజ్‌పై ఏడ్చేసిన రీతూ చౌదరి
BB Jodi Season 2: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బిగ్‌బాస్ లవ్ బర్డ్ రీతూ చౌదరి- డీమాన్ పవన్ మరోసారి వార్తల్లో నిలిచింది. బిగ్‌బాస్‌లో నడిచిన వీరి లవ్ ట్రాక్‌కు అప్పట్లో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, తాజాగా ప్రారంభమైన బీబీ జోడీ సీజన్ 2లో ఈ జోడీకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది స్టార్ మా. భారీ అంచనాలు, సోషల్ మీడియాలో హంగామా, అభిమానుల ఆశల మధ్య స్టేజ్‌పై అడుగుపెట్టిన ఈ జోడీ... మొదటి పెర్ఫామెన్స్‌తోనే షోలో హీట్ పెంచింది. కానీ రెండో పెర్ఫామెన్స్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. డిమాన్ పవన్ ను శేఖర్ మాస్టర్ నిలదీయడంతో స్టేజ్‌పై ఏడ్చేసింది రీతూ చౌదరి. ఇంతకీ ఏమైందంటే..?
తొలి పెర్ఫామెన్స్‌తో అవాక్కయిన జడ్జీలు
గతవారం బ్లాక్‌బస్టర్ థీమ్‌లో రీతూ-డీమాన్ జోడీ ఇచ్చిన తొలి పెర్ఫామెన్స్, జడ్జీలను సైతం ఆశ్చర్యపరిచింది. స్టేజ్‌పై వీరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ, రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శేఖర్ మాస్టర్ సహా జడ్జీలు 'వాటే కెమిస్ట్రీ' అంటూ తెగ మెచ్చుకున్నారు. 'స్టేజ్‌పై మీరు ఏం చేస్తారో చూడాలనే ఆసక్తి ఉంది' అంటూ సదా కూడా ఫిదా అయ్యారు. దీంతో ఈ జోడీ బీబీ జోడీ-2లో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని చాలామంది అంచనా వేశారు.

రెండో పెర్ఫామెన్స్‌లో మారిన సీన్!
అయితే తాజాగా విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో ఆ అంచనాలన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. 'డ్యాన్స్ ఆఫ్ ఇండియా' థీమ్‌లో భాగంగా దేశీయ నృత్య శైలులను బీబీ జోడిలు ప్రదర్శిస్తున్నాయి. ఈ టాస్క్‌లో రీతూ చౌదరి- డీమాన్ పవన్ జంట సెమీ క్లాసికల్ డ్యాన్స్‌ను ఎంచుకుంది.
కానీ, స్టేజ్‌పై వీరి పెర్ఫామెన్స్ మొదలైన కొద్దిసేపటికే లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇద్దరి మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం, స్టెప్పుల సింక్ మిస్ అవడం, ఎక్స్‌ప్రెషన్స్‌లో గందరగోళం... ఇవన్నీ పెర్ఫామెన్స్‌ను వీక్ గా మార్చాయి. రీతూ ఒక్కోసారి తనకు నచ్చినట్లు చేయడం, డీమాన్ పవన్ స్టెప్పులతో మ్యాచ్ కాకపోవడం ప్రేక్షకులను కూడా అయోమయంలో పడేసింది.
పెర్ఫామెన్స్ ముగిసిన వెంటనే జడ్జ్ శేఖర్ మాస్టర్ సూటిగా ప్రశ్నలు ప్రశ్నించారు. 'మీరు ఏ ఫామ్ ఎంచుకున్నారు? మీ పెర్ఫామెన్స్‌లో క్లారిటీ లేదు. ముఖ్యంగా మీరు (డీమాన్) చాలా కన్ఫ్యూజ్ అయినట్లు కనిపించారు' అంటూ నిలదీశారు. ఈ కామెంట్స్ తో డీమాన్ పవన్ పూర్తిగా బ్యాక్ ఫుట్‌లోకి వెళ్లిపోయారు. దీంతో రీతూ చౌదరి భావోద్వేగానికి లోనయ్యారు. స్టేజ్‌పైనే ఆమె కన్నీళ్లు పెట్టుకుని, 'నాకు అసలు డ్యాన్స్ రాదు మాస్టర్... ఇదే ఫస్ట్ టైమ్... నాకు చాలా భయమేస్తుంది' అంటూ ఎమోషనల్ అయ్యింది. రీతూ ఏడుపుతో ఆ క్షణం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. పోటీ షోలో ఇలాంటి సీన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు.
రీతూ-డీమాన్ జోడీకి జడ్జీలు కఠినంగా మార్కులు తగ్గించారు. నయని కేవలం 2 మార్కులు ఇవ్వగా, సత్య 3 మార్కులు ఇచ్చి 'మేము కూడా డ్యాన్స్ నేర్చుకుని ఇక్కడికి వచ్చాం... మీరు కూడా కమ్‌బ్యాక్ ఇవ్వాలి' అంటూ సలహా ఇచ్చింది. ఈ తక్కువ మార్కులతో రీతూ-డీమాన్ జోడీ పాయింట్ల పట్టికలో వెనుకబడిపోయింది. అదే సమయంలో మిగిలిన జోడీలు మంచి స్కోర్‌తో ముందుకు దూసుకెళ్లే అవకాశం దక్కించుకున్నాయి.
బిగ్‌బాస్‌లో లవ్ ట్రాక్‌తో పాపులారిటీ సంపాదించిన రీతూ-డీమాన్ జోడీకి, బీబీ జోడీ-2 మాత్రం కొత్త సవాల్‌గా మారింది. డ్యాన్స్ రియాలిటీ షోలో కేవలం కెమిస్ట్రీ ఉంటే సరిపోదని, కఠినమైన ప్రాక్టీస్, కోఆర్డినేషన్, టెక్నిక్ కూడా అంతే ముఖ్యమని ఈ ఎపిసోడ్ స్పష్టం చేసింది.ఇక ఈ ఎదురుదెబ్బ నుంచి రీతూ-డీమాన్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తారా? లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పరిమితమవుతారా? అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











