సర్‌ప్రైజ్: బిగ్ బాస్‌లోకి దెయ్యంలా ఎంట్రీ ఇవ్వబోతున్న లేడీ యాంకర్.. క్లూ ఇచ్చేశారు.!

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'.. మూడు గొడవలు.. నాలుగు ఫైటింగులుగా సాగుతోంది. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఇందులో కంటెస్టెంట్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో రొమాన్స్, లవ్, ఏడుపులు సహా పలు ఎమోషన్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా ఈ షో గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

వైల్డ్ కార్డ్ ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే విధానం ఉంటుందన్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లలో ఇద్దరేసి సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షో మధ్యలో ఇంటిలోకి ప్రవేశించారు. ఈ సీజన్‌లో కూడా మొదటి వారం పూర్తయిన తర్వాతనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఫస్ట్ వీక్‌లో సీనియర్ నటి హేమ ఎలిమినేట్ అవగా.. అదే రోజు ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఇంటిలోకి ఎంటర్ అయింది.

 మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా...

మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా...

ఎంతో రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ - 3లో శనివారంతో ఐదు వారాలు ముగుస్తాయి. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం కూడా మరొకరు వెళ్లిపోతారు. ఏడుగురు సభ్యులు ఈ వారం నామినేట్ అయ్యారు. వారిలో ఎవరు వెళ్తారో తెలియదు కానీ, ఈ వారం ఒకరిని వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి పంపించబోతున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

చాలా మంది పేర్లు బయటకు

చాలా మంది పేర్లు బయటకు

ఈ వారం ప్రారంభంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎప్పటి నుంచో శ్రద్దా దాస్, ఇషా రెబ్బా, హెబ్బా పటేల్, యాంకర్ మంజూష, సహా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీళ్లెవరూ బిగ్ బాస్‌లోకి ఎంటరవుతున్నట్లు ప్రకటించలేదు. దీంతో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పడిపోయింది.

తాజాగా మరో యాంకర్ పేరు

తాజాగా మరో యాంకర్ పేరు

రెండు రోజుల నుంచి మరొకరి పేరు తెరపైకి వచ్చింది. ఆమె.. తెలుగు ప్రేక్షకులకు యాంకర్‌గా పరిచయమైన శిల్పా చక్రవర్తి. బుల్లితెరతో పాటు వెండి తెరపైన తెరమరుగైన సీనియర్ యాంకర్ శిల్పా చక్రవర్తి బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీనికితోడు కత్తి మహేశ్ కూడా దీనిపై పోస్ట్ చేశారు. అలాగే, ఈ వారం ఎలిమినేషన్ కూడా లేకపోవడంతో ఈ వార్తలు నిజమేనని అనుకున్నారంతా.

దెయ్యం లాంటి రూపం

ఇక, ఆదివారం రాత్రి ఎపిసోడ్ చివర్లో వచ్చే ప్రోమోలో బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నట్లు స్టార్ మా స్పష్టం చేసింది. ఆదివారం రాత్రి ప్రోమోలో రవి కృష్ణ, అలీ రేజాను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఎల్‌ఈడీలో ఏదో వీడియో చూపించారు. అందులో దెయ్యంలా ఉన్న రూపం కనిపించడంతో వాళ్లిద్దరితో పాటు షో చూస్తున్న అందరూ షాక్ అయ్యారు. దీంతో ఎవరో వస్తున్నారని అంతా అనుకున్నారు.

లీక్ చేసేశారు

లీక్ చేసేశారు

తాజాగా విడుదలైన ప్రోమోలో ఓ లేడీ బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఫొటోలను ఎదురుగా పెట్టుకుని ఏవేవో లెక్కలు వేస్తోంది. దీంతో వైల్డ్ కార్డ్ ఉంది నిజమేనని స్పష్టం అవుతోంది. అయితే, అందులో ఉన్నది అందరూ అనుకుంటున్న శిల్పా చక్రవర్తేనా కాదా అన్నది సస్పెన్స్‌గా ఉంచారు. దీంతో బిగ్ బాస్ షోపై ఆసక్తి రెట్టింపు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X