twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాక్ నటుల కోసం పోరాడతానంటున్న బిగ్‌బాస్ బ్యూటీ.. రేప్ చేస్తామంటూ బెదిరింపులు!

    |

    పూల్వమా ఘటన నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న రోజు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. ఆత్మహుతి దాడులు జరిపి 49మంది భారత జవాన్లని పొట్టనబెట్టుకున్నారు. ఈ చర్యని ఇండియా మొత్తం తీవ్రంగా ఖండించింది. మాజిక్రికెటర్, పంజాబ్ మంత్రి అయిన నవజ్యోత్ సింగ్ సిద్దూ పాక్ కు అనుకూలంగా చేసిన కామెంట్స్ పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన బిగ్ బాస్ భామ శిల్పా షిండే సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్ కు బలవుతోంది.

    దేశం మొత్తాన్ని నిందించడం

    దేశం మొత్తాన్ని నిందించడం

    పుల్వామా ఘటన జరిగిన నేపథ్యంలో సిద్ధూ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి జాతి, మతం అంటూ ఉండవు. కొందరు వ్యక్తులు చేసిన పనికి దేశం మొత్తాన్ని నిందించడం సరికాదు అని సిద్దూ పుల్వామా ఘటన జరిగినప్పుడు మీడియాతో అన్నారు. సిద్దూ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీని ప్రభావంతో సిద్దూని కపిల్ శర్మ షో నుంచి కూడా తొలగించారు. దీనిని తప్పుబడుతూ శిల్ప షిండే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

    రేప్ చేస్తాం అంటున్నారు

    రేప్ చేస్తాం అంటున్నారు

    సిద్దూకు మద్దత్తు తెలిపినందుకు నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అని శిల్పా షిండే తెలిపింది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుందుకు సిద్ధం అవుతున్నా. సిద్దూకి మద్దత్తు తెలిపినందుకే రేప్ చేస్తాం అంటూ బెదింరించారు కూడా అని శిల్పా షిండే పేర్కొంది. ఇలాంటి ట్రోలింగ్ చేసేవారు ఉగ్రవాదులకంటే ప్రమాదకరం అని శిల్పా షిండే సంచలన వ్యాఖ్యలు చేసింది. అనవసరంగా సిద్దూ చేసిన వ్యాఖ్యలని వక్రీకరించారని శిల్పా షిండే పేర్కొంది.

    వాళ్లిద్దరూ స్నేహితులు

    వాళ్లిద్దరూ స్నేహితులు

    సిద్దూ ఉగ్రవాదానికి మద్దత్తు ఇవ్వలేదు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి శాంతియుత చర్చలు జరపాలని కోరారు. పూల్వమా ఘటన విషయంలో ఇమ్రాన్ ఖాన్ ని సిద్దూ ఎందుకు విమర్శించలేదు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లిద్దరూ ఏళ్ల తరబడి క్రికెట్ ఆడిన స్నేహితులు అనే విషయం గుర్తుంచుకోవాలి అని శిల్పా షిండే తెలిపింది.

    పాక్ నటుల కోసం పోరాటం

    పాక్ నటుల కోసం పోరాటం

    పుల్వామాలో ఉగ్ర దాడి జరిగిందని పాకిస్థాన్ నటుల్ని బ్యాన్ చేశారు. ఇది సరైన పద్దతి కాదు. నేను పాక్ నటుల హక్కుల కోసం పోరాటం చేస్తా అని శిల్పా షిండే మరోమారు వివాదం రాజేసింది. ఉపాధి పొందే హక్కులు ఎలా తొలగిస్తారు అని శిల్పా షిండే పేర్కొంది. బ్యాన్ విధిస్తే ఆ భాద ఎలా ఉంటుందో నాకు తెలుసు అని శిల్పా షిండే తెలిపింది. బిగ్ బాస్ 11 సీజన్ లో శిల్పా షిండే విజేతగా నిలిచింది.

    English summary
    Shilpa Shinde gets rape threats for supporting Navjot Singh Sidhu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X