తేజూ ప్రియాంకతో అందుకే మాట్లాడలేదు.. తను చేసిన తప్పు వల్లే ఇదంతా.. మరోసారి శివ్ షాకింగ్ కామెంట్లు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి అందులో ఉన్న కంటెస్టెంట్ల గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ షోలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డ స్పా, స్పై బ్యాచ్ ల గురించి అయితే అందరికీ తెలిసిందే. స్పా బ్యాచ్ అయిన శోభాశెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ లు మొదటి నుంచి కలిసి గేమ్ ఆడారు. వారంతా సీరియల్ నటులు, చాలా కాలంగా స్నేహితులు కావడంతో.. షోలో కలిసే కనిపించారు. ముఖ్యంగా జానకి కలగనలేదు సీరియల్ నుంచి స్నేహితులు అయిన ప్రియాంక, అమర్ దీప్ ల గురించి చాలానే పుకార్లు వచ్చాయి. షోలోకి వచ్చాకా కూడా వీరిపై చాలా ట్రోల్స్ వచ్చాయి.
ఫ్యామిలీ వీక్ వరకు అంతగా లేకపోయినా ఆ తర్వాత వీరిద్దరి బంధంపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా.. తన భర్త కోసం వెళ్లిన అమర్ దీప్ భార్య తేజస్విని ప్రియాంక జైన్ తో మాట్లాడలేదు. శోభాశెట్టితో మాట కలిపినప్పటికీ.. ప్రియాంకను కనీసం చూడలేదు. ఆమెకు కేక్ కూడా తనిపించలేదు. దీంతో చాలా హర్ట్ అయిన ప్రియాంక జైన్ బయటకు మన రిలేషన్ ఎలా వెళ్తుందో అంటూ అమర్ తో మాట్లాడింది. ఇదే విషయాన్ని శోభాశెట్టి వద్ద కూడా చర్చించింది. దీంతో వీరిద్దరి బంధం హైలెట్ అయింది. అలా చాలా వార్తలు వచ్చాయి.

అయితే అదే ఫ్యామిలీ వీక్ లో ప్రియాంక జైన్ కోసం ఆమె ప్రియుడు శివ్ కుమార్ వెళ్లాడు. అందరితో చక్కగా మాట్లాడాడు. ఎవరినీ బాధ పెట్టలేదు. బయటకు రాగానే పెళ్లి చేసుకుందాం అంటూ కూడా ప్రియాంక జైన్ కు వివరించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ్ కుమార్.. అమర్ దీప్, ప్రియాంక జైన్ ల బంధం గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. వాళ్లు కేవలం స్నేహితులు మాత్రమే అని.. రెండేళ్లుగా కలిసి పని చేయడం వల్ల ఆ స్నేహం వారి మధ్య ఉందని అన్నాడు. అయితే ఇదంతా విన్న యాంకర్.. మరి ప్రియాంకతో అమర్ దీప్ భార్య తేజస్విని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాడు.
దీనికి ప్రియాంక జైన్ లవర్ శివ్ కుమార్.. షాకింగ్ కామెంట్లు చేశారు. అమర్ దీప్ వైఫ్ తేజస్విని... తన భర్తను చాలా మిస్ అయిందని.. అందుకే అక్కడకు వెళ్లాక అమర్ దీప్ ను తప్ప ఎవరినీ చూడలేదని చెప్పారు. ఆమె అతడితోనే ఎక్కువ సమయం గడపాలనుకుందని వెల్లడించాడు. అందుకే ఆమె ఎవరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. కానీ తనతో మాత్రమే మాట్లాడలేదు అనుకున్న ప్రియాంక జైన్.. ఆ విషయాన్ని అమర్ దీప్, శోభాశెట్టిలతో మాట్లాడడం వల్ల ఇంద పెద్ద ఇష్యూ అయిందని వెల్లడించారు.

ప్రియాంక జైన్ అలా ఫీలై చెప్పడం వల్లే అందరికీ ఇన్ని అనుమానాలు వచ్చాయని శివ్ కుమార్ చెప్పుకొచ్చారు. ప్రియాంక ఇలా చేయడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని.. తాను ఫీలైనా కనీసం కామెంట్లు చేయకపోతే ఏమీ జరక్కపోయేదని శివ్ కుమార్ వివరించారు. ఫ్యామిలీ వీక్ కంటే ముందు తేజూను తాను కలిసినట్లు చెప్పారు. షో అంతా బాగానే సాగుతుందని... తేజూ కూడా చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిందని అన్నారు.


Click it and Unblock the Notifications











