అమర్దీప్, ప్రియాంకల బంధంపై తొలిసారి నోరు విప్పిన శివ్.. అలా చేయడం తప్పంటూ ఎమోషనల్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్లు అమర్ దీప్, ప్రియాంక జైన్ ల గురించి అందరికీ తెలిసిందే. అయితే జానకి కలగనలేదు సీరియల్ నుంచి వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకా కూడా వారిద్దరూ అదే బంధాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. వీరిద్దరితో పాటు శోభాశెట్టి కూడా కలిసి గ్రూపు గేమ్ ఆడారు. అయితే శోభా శెట్టి కంటే కూడా అమర్ దీప్.. ప్రియాంక జైన్ కే ఎక్కువ వాల్యూ ఇస్తుంటాడని చాలా సార్లు ప్రూవ్ అయింది. ముఖ్యంగా అమర్ దీప్.. శోభా, ప్రియాంక జైన్ లలో ప్రియాంకకే ఎక్కువ సపోర్ట్ చేస్తుంటాడు. అయితే తాజాగా వీరి బంధంపై శివ్ కుమార్ క్లారిటీ ఇచ్చాడు.
బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా.. ప్రియాంక జైన్ కోసం ఆమె ప్రియుడు శివ్ కుమార్ వచ్చాడు. అయితే చాలా కాలంగా అతడితో కలిసి ఉంటున్న ఆమెను.. అతడు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు. ఈక్రమంలోనే బిగ్ బాస్ షోకు కూడా వచ్చిన ఆమెతో ఫుల్ రొమాన్స్ చేశాడు. ముద్దుల వర్షం కురిపిస్తూ.. రచ్చ రచ్చ చేశాడు. అయితే ఆయన అశ్వినినీ పొగడ్డం చూసిన ప్రియాంక కాస్త కూడా ఓర్చుకోలేకపోయింది. మరి ఆమె అమర్ దీప్ తో కలిసి ఉంటే శివ్ కుమార్ ఏమనుకుంటాడని కాస్త కూడా ఆలోచించలేదు. ఓవైపు వీరిద్దరి తీరుతో అటు అమర్ భార్య తేజూ, ఆతడి తల్లి కూడా కాస్త ఫీలయ్యారు.

తాజాగా ప్రియాంక జైన్ ప్రియుడు కూడా అమర్ దీప్.. తన ప్రేయసి ప్రియాంక జైన్ తో ఉంటున్న తీరు చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిద్దరి బంధం గురించి చాలా విషయాలు చెప్పాడు. ముఖ్యంగా ప్రియాంక జీలితం, ఆమె ఫ్యామిలీ, వారి పెళ్లి ఎప్పుడు అనే దానిపై చాలా క్లారిటీ ఇచ్చాడు. అయితే అమర్ దీప్.. ప్రియాంక జైన్ మధ్య బంధం వల్ల తాను పడుతున్న ఇబ్బందుల గురించి కూడా వివరించాడు. అయితే ఆయన ఏం చెప్పాడు, ఎందుకు అమర్ దీప్ తీరుతో బాధ పడుతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమర్ దీప్, ప్రియాంక జైన్ లు కలిసి పని చేయడం వల్ల వారి మధ్య మంచి స్నేహ బంధం ఉందని శివ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా అమర్, ప్రియాంకలు ఒకరికొకరు రెస్ పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారని.. అది తనకు చాలా నచ్చుతుందని అన్నాడు. కానీ బాల్ టాస్క్ లో మాత్రం.. ప్రియాంక ఓ అమ్మాయి అని కూడా చూడకుండా.. అమర్ దీప్ అలా లేపి పడేయడం తనకు అస్సలే నచ్చలేదని అన్నాడు. ఆ ఎపిసోడ్ వచ్చిన రోజు.. తాను చాలా ఫీలైనట్లు గుర్తు చేశాడు. అది చెబుతూనే ఆయన ఎమోషనల్ అయిపోయాడు.

ప్రియాంక తల్లిదండ్రులు 24 గంటల పాటు షో చూస్తుంటారని... అమర్ దీప్ అలా చేయడాన్ని వాళ్లు కూడా జీర్ణించుకోలేకపోయారని శివ్ కుమార్ వివరించాడు. కానీ అదంతా గేమ్ అని ప్రస్తుతం దాన్ని చాలా లైట్ తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ప్రియాంక గెలిచేందుకే అక్కడకు వెళ్లిందని.. చాలా స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతుందని శివ్ కుమార్ అన్నాడు. కానీ ఆమె గెలిచే అవకాశం తనకు కనిపించట్లేదని.. కానీ గెలిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ గా నిలుస్తాడని జోస్యం చెప్పాడు.


Click it and Unblock the Notifications











