అదే నిజమైతే.. శివ బాలాజీ నిజంగా గ్రేట్.. బిగ్‌బాస్ ప్రైజ్ మనీని ఏం చేశాడో తెలిస్తే షాకే..

By Rajababu

టాలీవుడ్‌లో శివబాలాజీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా శివ బాలాజీ ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. కానీ బిగ్‌బాస్ రియాలిటీ షోతో శివబాలాజీ పేరు మారుమోగింది. బుల్లితెరపై ఈ షో హిట్ కావడంతో శివ బాలాజీ పేరు హౌస్ హోల్డ్ నేమ్‌గా మారింది. పేరుతో పాటు మంచి రెమ్యునరేషన్, ప్రైజ్ మనీని ఆయన సొంతం చేసుకొన్నాడు. అయితే తనకు లభించిన ప్రైజ్ మనీని శివ బాలాజీ ఏమీ చేశాడన్నది ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ..

50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ..

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ని 70 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ రియాలిటీ షోలో శివ‌బాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే విజేతగా నిలిచినందుకు శివ బాలాజీకి బిగ్ బాస్ నుంచి 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ అందుకున్నాడు. దాంతో 70 రోజులపాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నందుకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ముట్టింది. శివ బాలాజీకి మాత్రం బిగ్ బాస్ షోలో 70 రోజులు ఉన్నందుకు అదనంగా 60 లక్షలు వచ్చినట్లు తెలిసింది.

Recommended Video

Bigg Boss Winner : Shiva Balaji Won because of Pawan Kalyan
శివబాలాజీ చేతికి 35 లక్షలు

శివబాలాజీ చేతికి 35 లక్షలు

బిగ్‌బాస్ ప్రైజ్ మనీ ద్వారా లభించిన 50 లక్షల రూపాయల్లో పన్నులు మినహాయించగా శివబాలాజీకి 35 లక్షలు అందినట్టు సమాచారం. ఈ మొత్తం టాలీవుడ్‌లో మోస్తారు నటుడికి ఎక్కువే. కానీ శివ బాలాజీ లాంటి సంపన్నుడికి పెద్దగా ఆనందం కలిగించదు. ఎందుకంటే శివబాలాజీ చాలా రిచ్ కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి.

ప్రైజ్ మనీని ఏంచేస్తానో తెలుసా?

ప్రైజ్ మనీని ఏంచేస్తానో తెలుసా?

బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలు ఉంటున్న సమయంలో ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు శివబాలాజీ ఏమి చెప్పారంటే.. విజేతగా నిలిస్తే వచ్చే సొమ్మును తాను ఏమీ చేస్తానో అనే విషయాన్ని అప్పుడే వేదిక మీదే వెల్లడిస్తానని చెప్పిన విషయం అందరికీ గుర్తుంటుంది. కానీ శివ బాలాజీ విజేతగా నిలిచిన ఆనందంలో ఆ విషయాన్ని మర్చిపోయాడు కానీ. తాను చేసిన ఘన కార్యాన్ని తెలుసుకుంటే గుండె కరిగిపోవడం ఖాయం.

 అనాథ పిల్లలకు ప్రైజ్ మనీ

అనాథ పిల్లలకు ప్రైజ్ మనీ

బిగ్ బాస్ షో ద్వారా త‌న‌కు లభించిన ప్రైజ్ మ‌నీని శివ బాలాజీ అనాథ పిల్ల‌ల‌ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయం శివ బాలాజీ సన్నిహితుల నుంచి తెలిసినట్టు మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో శివ బాలాజీ గొప్ప మనసును ప్రతీ ఒక్కరు హర్షిస్తున్నారు. బిగ్‌బాస్ విజేత నిలిచిన శివ ఇప్పుడు అందరి మనసును గెలుచుకొన్నారడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

 పవన్ కల్యాణ్ మనసు గొప్పది

పవన్ కల్యాణ్ మనసు గొప్పది

బిగ్‌బాస్ విజేతగా నిలిచిన శివ బాలాజీ ఇటీవల మీడియాతో తన అనుభూతులను పంచుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నవరం సినిమా నుంచి ఆయనతో నా జర్నీ మొదలైంది. అప్పటి నుంచి పవన్‌కు కనెక్ట్ అయిపోయాను. ఆయన మనసు గొప్పది. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత ‘కాటమరాయుడు' సినిమాలో మళ్లీ పవన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది అని శివ బాలాజీ తెలిపారు.

 అందుకే పవన్‌కు కత్తి ఇచ్చా

అందుకే పవన్‌కు కత్తి ఇచ్చా

సాధారణంగా పవన్ కల్యాణ్ తన పుట్టిన రోజు వేడుకనే జరుపుకోరు. అలాంటిది నా పుట్టినరోజు వేడుకను ఆయన స్వయంగా కాటమరాయుడు సెట్స్‌లో తన కుటుంబ సభ్యులందరినీ పిలిచి అందరి మధ్యలో పవన్ కల్యాణ్ దగ్గరుండి నా చేత కేక్ కట్‌ చేయించడం ఎప్పటికీ మర్చిపోను. చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది అని చెప్పారు. దీనికి ప్రతిగా పవన్‌కు ఏదైనా ఇవ్వాలని భావించాను. ప్రజా నాయకుడు అయినందున.. ఏదైనా స్పెషల్‌గా ఇవ్వాలని భావించి కత్తిని బహుకరించాను అని శివ బాలాజీ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X