నేను హీరోయిన్ మెటీరియల్ కాదు.. శ్రీముఖిని బూతులు తిట్టేసిన శివజ్యోతి.. షాకింగ్ కామెంట్స్

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. నాగార్జున హోస్ట్‌గా జులై 21వ తేదీన ప్రారంభమై ఆడియన్స్‌కి మంచి కిక్కిస్తోంది. విజయవంతంగా పద్నాలుగో వారం ఫినిష్ చేసుకున్న ఈ షో నుంచి ఇటీవలే ఎలిమినేట్ అయింది శివజ్యోతి (సావిత్రి). ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివజ్యోతి.. బిగ్ బాస్ కంటిస్టెంట్స్ అందరి గురించి స్పందిస్తూ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి పోతే..

లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా.. నా ఏడుపే వాళ్లకు నచ్చింది

లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా.. నా ఏడుపే వాళ్లకు నచ్చింది

బిగ్ బాస్ చాలా బాగా నచ్చిందని, అదో అద్భుత ప్రపంచమని చెప్పింది శివజ్యోతి. ప్రతీ ఒక్కరూ లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని చెప్పింది. కాకపోతే ఒక్కసారి మాత్రమే అని చెప్పింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు తనకు బాగా నచ్చాయని తెలిపింది. నా ఏడుపే వాళ్లకు బాగా నచ్చింది.. అందుకే తన ఎమోషన్స్‌కే వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపింది.

గట్టి పోటీ ఇచ్చా.. కానీ జనాల్లో గెలవలేక పోయా

గట్టి పోటీ ఇచ్చా.. కానీ జనాల్లో గెలవలేక పోయా

బిగ్ బాస్ హౌస్‌లో తాను స్ట్రాంగ్ కంటిస్టెంట్ గా కొనసాగానని, చివరి దాకా గట్టి పోటీ ఇచ్చానని శివజ్యోతి చెప్పింది. హౌస్ లో డాన్సులు, టాస్క్‌లు అన్నింటిలో సక్సెస్ అయ్యా, కానీ జనాల్లో గెలవలేకపోయానేమో! అందుకే బయటకు రావాల్సి వచ్చిందని శివజ్యోతి తెలిపింది.

వాళ్లిదరిపై శివజ్యోతి ఇంట్రెస్ట్..

వాళ్లిదరిపై శివజ్యోతి ఇంట్రెస్ట్..

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్ సందేశ్ ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే బాగుంటుందనే దానిపై స్పందించిన శివజ్యోతి.. అలీ రెజా, శ్రీముఖి పేర్లు చెప్పింది. ఇది తన అభిప్రాయమని, ఫైనల్ గా ప్రేక్షకులదే తుది నిర్ణయమని చెప్పుకొచ్చింది.

నేను హీరోయిన్ మెటీరియల్ కాదు

నేను హీరోయిన్ మెటీరియల్ కాదు

శివజ్యోతితో పాటు తీన్మార్ ద్వారా ఫేమస్ అయిన బిత్తిరి సత్తి తుపాకి రాముడు సినిమాతో హీరో అయ్యాడు. దీంతో మీరు హీరోయిన్ ఎప్పుడవుతారు? అనే ప్రశ్న ఎదుర్కొన్న శివజ్యోతి.. తాను హీరోయిన్ మెటీరియల్ కాదని చెబుతూ కుండ బద్దలు కొట్టే సమాధానం చెప్పింది.

Recommended Video

విన్నర్ ఒక్కరే.. అంటూ వీడియోతో ముందుకు వచ్చిన శివజ్యోతి
బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌పై శివజ్యోతి కామెంట్

బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌పై శివజ్యోతి కామెంట్

బిగ్ బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్‌గా, సీజన్ 2 నాని హోస్ట్‌గా, సీజన్ 3 నాగార్జున హోస్ట్‌గా సాగింది. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనే దానిపై స్పందిస్తూ.. నాగార్జున బెస్ట్ అని చెప్పింది శివజ్యోతి. అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌ ఎవరైతే బాగుంటుందని భావిస్తున్నారు? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. నో కామెంట్ అని సింపుల్ గా కొట్టి పారేసింది సావిత్రక్క.

శ్రీముఖి పై బూతుల వర్షం

శ్రీముఖి పై బూతుల వర్షం

ఇక ఫైనల్ గా పార్టిసిపెంట్స్ అందరి గురించి ఒక్క మాటలో చెప్పిన శివజ్యోతి.. శ్రీముఖి పేరెత్తగానే బూతుల వర్షం కురిపించింది. లౌడ్ స్పీకర్, కోతి, పంది అన్నీ అదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నాకంటే పెద్ద లౌడ్ స్పీకర్ శ్రీముఖి అని చెప్పింది శివజ్యోతి. మహేష్ విట్టాను దొంగ బ్రదర్ అనేసింది. పునర్నవి, అషు రెడ్డి తన మొదటి స్నేహితులని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X