చచ్చిపోం.. చంపేస్తామని బ్లాక్‌మెయిల్.. నాలిక తప్ప ఒళ్లంతా దెబ్బలే.. కంటతడితో సావిత్రి

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 13 Highlights || Filmibeat Telugu

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 12వ రోజు చాలా భావోద్వేగాల మధ్య సాగింది. సెలబ్రిటీలు తాము తీసుకొన్న నిర్ణయాల వల్ల కోల్పోయిన వ్యక్తులను తలచుకొని కుమిలిపోయారు. జీవితంలో మళ్లీ రాబట్టుకొలేని విషయాలను చెప్పి విషాదంలో మునిగిపోయారు. శ్రీముఖి, శివజ్యోతి, పునర్నవి, మహేష్ విట్ట తదితరులు చెప్పిన తమ ఫ్లాష్ బ్యాక్ విషయాలు ప్రేక్షకులను సైతం ఎమోషనల్‌గా మార్చే విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

చావు దగ్గరికి వెళ్లొచ్చాను

చావు దగ్గరికి వెళ్లొచ్చాను

చావు దగ్గరికి వెళ్లి వచ్చిన వాళ్లకు జీవితం చాలా నేర్పిస్తుందనే నా విషయంలోనే నేను తెలుసుకొన్నాను. నా జీవితంలో చేసిన తప్పేమీ లేదు. ఓ అబ్బాయిని ప్రేమించడం తప్ప. ప్రేమలో పడిన ఆర్నేళ్లకే ఇంట్లో తెలిసి పోయింది. అలాంటి సమయంలో అందరి ఇంట్లో నీవు అతడికి దూరం కాకపోతే.. మేం చచ్చిపోతామని బ్లాక్‌మెయిల్ చేస్తారు. కానీ మా ఇంట్లో మాత్రం అతడిని చంపేస్తాం అని బెదిరించారు.

నా ఒళ్లంతా దెబ్బలే

నా ఒళ్లంతా దెబ్బలే

ప్రేమ వదులుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నాలిక మీద తప్పు ఒళ్లంతా దెబ్బలు పడ్డాను. నా ప్రియుడిని వదిలేయమంటూ నన్ను నా కుటుంబం దారుణంగా కొట్టింది. ఊరంతా ఒకవైపు.. నేను ఒకవైపుగా నిలిబడ్డ. ఏమౌతుంది.. మహా అయితే చంపేస్తారని ధైర్యం తెచ్చుకొన్నాను. అలా ఆరునెలలు వేదనకు గురయ్యాను. నేను నిజాయితీగా ఉన్నా నా కుటుంబం నమ్మలేదు.

 హైదరాబాద్ రంగుల ప్రపంచం

హైదరాబాద్ రంగుల ప్రపంచం

హైదరాబాద్ అనేది నాకు రంగుల ప్రపంచం. అక్కడికి వెళ్లి ఎలాగైనా బతుకొచ్చని తెలుసుకోలేకపోయాను. అలా అతడికి ఆర్నెళ్లు దూరంగా ఉన్నాను. మా ఆయనతో ఆర్నెళ్లు ఫోన్ కూడా మాట్లాడలేదు. కానీ మా ఇంట్లో వాళ్లకు నాపై నమ్మకం కలుగలేదు. నా నిజాయితీని శంకించినప్పుడు నేను ఎందుకు ఉండాలనే ఆలోచన వచ్చింది.

నిజాయితీగా ఉన్నా నమ్మలేదు..

నిజాయితీగా ఉన్నా నమ్మలేదు..

నన్ను అమితంగా ఇష్టపడుతున్నాడు. పెళ్లి చేసుకొంటున్న అన్నడు. అలాంటప్పుడు ఎందుకు మౌనం వహించడమనే ఫీలింగ్ కలిగింది. నా జీవితంలో అమ్మమ్మ, నాన్న, తమ్ముడికి రుణపడి ఉంటాను. నా ప్రేమను గెలిపించుకోవడానికి వారు సహకారం అందించారు. అమ్మ నేను ఆర్నెళ్లు నిజాయితీగా ఉన్న నన్ను నమ్మలేదు అని ఎమోషనల్ అయ్యారు.

మా ఆయన మహారాణిలా చూసుకొన్నాడు

మా ఆయన మహారాణిలా చూసుకొన్నాడు

జీవితం ప్రతీ మనిషికి రెండో ఛాన్స్ ఇస్తుంది. కానీ నాకు రెండో జీవితాన్ని ఇచ్చింది. నేను నమ్మినట్టుగానే మా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నన్ను మహరాణిలా చూసుకొన్నాడు. అందుకే జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ లైఫంతా నీతోనే.. నీవు అవునన్న, కాదన్న నీకు నేను తప్ప మరో ఆప్షన్ లేదు అంటూ శివజ్యోతి (సావిత్రి) భావోద్వేగానికి లోనైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X