బిగ్‌బాస్ నుంచి శివజ్యోతి అవుట్.. బాబా భాస్కర్ గురించి షాకింగ్ న్యూస్

Recommended Video

Bigg Boss Telugu 3 : Shiva Jyothi Eliminated || బాబా భాస్కర్ పై నాగార్జున ఫైర్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 రియాలిటీ షో చివరి దశకు చేరుకొన్నది. బాబా భాస్కర్, శ్రీముఖి అలీరెజా, శివజ్యోతి, వరుణ్ సందేశ్ లాంటి టాప్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో 14వ వారం ఎలిమినేషన్ ఉత్కంఠగా మారింది. అయితే ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అయితే మిగితా వారు టాప్ 5 జాబితాలో చేరుతారనే విషయం క్రేజీగా మారింది. అయితే ఈ వారం ఎక్కువగా ఎవరికి ముప్పుందనే విషయం పరిగణనలోకి తీసుకొంటే..

 ఇప్పటికే ఫైనల్లో రాహుల్ సిప్లిగంజ్

ఇప్పటికే ఫైనల్లో రాహుల్ సిప్లిగంజ్

శుక్రవారం ఎపిసోడ్‌లో బాబా భాస్కర్ నామినేషన్ నుంచి సేఫ్ కావడంతో ఇక గురి అలీరెజా, శివజ్యోతిపై పడింది. అయితే మిగితా వారిలో శ్రీముఖి, వరుణ్ సందేశ్‌లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనే విషయం తెలిసిందే. ఈ నామినేషన్ ప్రక్రియలో జరిగిన టాస్క్‌లలో రాహుల్ గెలిచి టికెట్ టు ఫినాలే‌ను సొంతం చేసుకోవడంతో ఫైనల్‌లోకి చేరుకొన్న మూడో సీజన్ తొలి సెలబ్రిటీగా మారారు.

శివజ్యోతి ఎలిమినేషన్

శివజ్యోతి ఎలిమినేషన్

ఇక తాజా సమాచారం ప్రకారం.. శ్రీముఖి, వరుణ్ సందేశ్‌కు భారీగా ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. దాంతో వీరిద్దరూ శనివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి బయటపడ్డారట. కాగా ఇక శివజ్యోతి కంటే అలీ రెజా మెరుగైన ఓట్లు సంపాదించుకోవడం వల్ల బయటపడటంతో శివజ్యోతి నామినేట్ అయినట్టు సమాచారం.

సామాన్యురాలిగా ప్రవేశించి అసాధారణ ప్రతిభ

సామాన్యురాలిగా ప్రవేశించి అసాధారణ ప్రతిభ

కడపటి వార్తలు అందే సరికి శివజ్యోతి ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిందనేది సమాచారం. ఇక ఆమె ఇంటి నుంచి ఆదివారం మధ్యాహ్నానికి సొంత ఇంటికి చేరుకొనే అవకాశం ఉంది. సామాన్యురాలిగా ప్రవేశించిన శివజ్యోతి పేరున్న సెలబ్రిటీలను ధీటుగా ఎదురించడమే కాకుండా బుల్లితెర అభిమానుల నుంచి మంచి మద్దతు కూడగట్టుకొన్నది.

బాబాకు సూపర్‌స్టార్ల ఫ్సాన్స్ అండ

బాబాకు సూపర్‌స్టార్ల ఫ్సాన్స్ అండ

ఇదిలా ఉండగా, తాజా ఎలిమినేషన్ ప్రక్రియలో బాబా భాస్కర్ సేఫ్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే బాబా భాస్కర్‌కు తెలుగులో ఫ్యాన్ బేస్ లేకపోవడంతో తమిళనాడు నుంచి పలువురు హీరోల ఫ్యాన్స్ విపరీతంగా ఓట్లు వేసినట్టు తెలుస్తున్నది. చాలా మంది సూపర్‌స్టార్లతో పనిచేయడం.. అంతేకాకుండా తమ వాడు తెలుగులో విజయం సాధించాలనే పట్టుదల తమిళులలో వచ్చిందనే విషయం సోషల్ మీడియాలో కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X