అలీరెజాతో అదే బ్యాడ్ మెమొరీ.. అదొక్కటే నన్ను కుంగదీసింది.. శివజ్యోతి
ఎలిమినేషన్ తర్వాత వేదికపైకి చేరుకొన్న శివజ్యోతిని దగ్గరగా తీసుకొని నాగ్.. నీ జర్నీ చూసేద్దామా అని నాగ్ అన్నాడు. అనంతరం మళ్లీ అవకాశం వస్తే ఇంట్లోకి వెళ్తావా? అని అడిగితే నో చెప్పింది. అందుకు బదులుగా నీ జర్నీ చాలా బాగుంది. నవ్వు, ఏడుపు, ఎమోషన్స్ అన్నీ ఎక్కువే. బిగ్ బాస్ ఎక్సిపీరియెన్స్ బాగుంది. మళ్లీ ఛాన్సు వచ్చినా నేను వెళ్లను. ఎందుకంటే జీవితానికి సరిపడా ఓ ఫీలింగ్ నాకు దక్కింది. అందుకే చాలు ఇక నేను వెళ్లను. ఇది చాలూ అని నాగార్జున ప్రశ్నకు జవాబుగా చెప్పింది.
Recommended Video

పెట్టెలోకి నా మెమొరీస్
అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడుతూ శివజ్యోతి జర్నీ బాగుంది. దానిని చూస్తూ చాలా ఎమోషన్స్‌కు గురైంది. తొలిసారి బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టినప్పుడు ఈ పెట్టెలో నా మెమొరీస్ తీసుకెళ్తానని చెప్పింది. ఇప్పుడు ఇంటి సభ్యులతో ఉన్న ఒక్కొ అనుభూతిని చెప్పమని శివజ్యోతిని నాగార్జున అడిగారు.

టాస్క్‌లో బాబా తప్పుగా
ముందుగా బాబా భాస్కర్‌తో మాట్లాడుతూ.. ఓ టాస్క్‌లో తప్పుగా చెప్పారు. అదే నాకు బ్యాడ్ మెమొరీ. ఆ తర్వాత అన్నీ గుడ్ మెమొరీసే. ఇంటిలో నేను హ్యాపీగా ఉండటానికి బాబానే కారణం. నేను ఎప్పుడూ నవ్వడానికి బాబా నా వెంట ఉన్నాడు అని శివజ్యోతి చెప్పింది.

శ్రీముఖితో ఎలాంటి
శ్రీముఖితో నాకు ఎలాంటి పర్సనల్ విభేదాలు లేవు. టాస్క్ పరంగా కొన్ని గొడవలు ఉన్నాయి. ఆట పరంగా మా మధ్య గొడవలు జరిగాయి. అంతే తప్ప మా మధ్య అన్ని గుడ్ మెమొరీస్. ఇంట్లో నన్ను ఎత్తుకొని తిరుగుతుంది. అన్నం తినిపిస్తుంది. నన్ను బాగా చూసుకొంది అని శివజ్యోతి చెప్పింది.

వరుణ్ సందేశ్ గురించి
ఇక బయట ప్రపంచంలో కొందరని అన్న అనిపిలుస్తాను. కానీ ఇంటిలో నాకు అన్న అనిపిలిచింది కేవలం వరుణ్ సందేశ్‌నే. మా ఇద్దరికి ఎప్పుడూ ఓ రెస్పక్టబుల్ రిలేషన్ ఉంటుంది. ఆటపరంగా తప్ప ఎలాంటి విభేదాలు లేవు. వరుణ్‌ను చూస్తే మా అన్న గుర్తుకు వస్తాడు. నన్ను విన్నర్ అన్నాడు. బయట ప్రపంచానికి విన్నర్ కాకపోవచ్చు. కానీ వరుణ్ దృష్టిలో విన్నరైతే నేను విన్నర్‌నే అంటూ వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయింది.

అలీ రెజా నాకు జాన్
అలీ రెజా నాకు జాన్. అతడితో ఇంట్లో అన్నీ గుడ్ మెమొరీస్ ఉన్నాయి. ప్రతీ క్షణం నాకు సంతోషాన్ని ఇచ్చాడు. అలీ ఎలిమినేషన్ మాత్రమే నాకు బ్యాడ్ మెమొరీ. అంతకంటే నాకు ఎక్కువ నాకు వేరే చెడు సంగతులు లేవు. అలీ నాకు ఇంట్లో మంచిగా బిహేవ్ చేశాడు.

రాహుల్ నాపై అరిచాడు
రాహుల్ సిప్లిగంజ్‌తో ఒకే ఒక బ్యాడ్ మెమొరీ ఉంది. టాస్క్‌లో ఓ సారి నాపై అరిచాడు. అది తప్ప నాకు మరో చెడ్డ గుర్తు లేదు. రాహుల్‌తో ఇంట్లో అన్నీ గుడ్ మెమొరీస్ ఉన్నాయి అని శివజ్యోతి చెప్పింది. బిగ్ బాంబులో భాగంగా శ్రీముఖికి పూలమాల ఇచ్చి.. మిగితా నలుగురికి ముళ్ల మాల ఇచ్చారు. దాంతో శివజ్యోతి జర్నీ బిగ్‌బాస్‌లో ముగిసింది.


Click it and Unblock the Notifications











