పెళ్లై పిల్లలున్నా ఆగలేకపోతున్నావా?.. కొరియోగ్రాఫర్ జానీపై శివ శంకర్ మాస్టర్ కామెంట్స్ వైరల్

కొరియోగ్రాఫర్‌గా శివ శంకర్ మాస్టర్ క్రియేట్ చేసిన రికార్డులు అందరికీ తెలిసిందే. డ్యాన్స్ మాస్టర్‌గా కాకుండానే నటుడిగానూ శివ శంకర్ మాస్టర్ మెప్పించాడు. వెండితెరపై కొన్ని చిత్రాలు చేసిన శివ శంకర్ మాస్టర్ గత కొన్నేళ్లుగా బుల్లితెరపై తెగ సందడి చేస్తున్నాడు. తాజాగా బొమ్మ అదిరింది షోలో శివ శంకర్ మాస్టర్ రచ్చ చేశాడు. మాస్టర్ వేసిన పంచులకు జానీ మాస్టర్ పరువుపోయినట్టైంది. అసలు ఇంతకీ శివ శంకర్ మాస్టర్ చేసిన కామెంట్లు ఏంటో ఓ సారి చూద్దాం.

బొమ్మ అదిరింది వైరల్..

బొమ్మ అదిరింది వైరల్..

అదిరింది షో నుంచి బొమ్మ అదిరిందిగా మారడంతో లక్ బాగానే కలిసి వచ్చింది. ప్రతీ వారం ఎపిసోడ్ బాగానే హైలెట్ అవుతోంది. మొదటి ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. వైఎస్ జగన్ మీద సెటైర్లు వేసినట్టు చేసిన ఎపిసోడ్ ఫుల్ వైరల్ అయింది. మొదటి ఎపిసోడ్‌తోనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

స్పెషల్ అప్పియరెన్స్..

స్పెషల్ అప్పియరెన్స్..

ఇక ప్రతీవారం ఎపిసోడ్‌లో స్పెషల్‌గా గెస్ట్‌లను తీసుకురావడంతో మరింత ఆకర్షణీయంగా మారుతోంది. మొదట్లో సుమ, అలీ వంటి వారు గెస్ట్‌గా వచ్చారు. ఆ ఎపిసోడ్‌లు బాగానే వైరల్ అయ్యాయి. ఇక యాంకర్‌గా శ్రీముఖి, డ్యాన్సర్ పండు చేసే కామెడీ, జానీ మాస్టర్, నాగబాబు పంచులు అన్ని బాగానే హైలెట్ అవుతున్నాయి.

గతవారం అలా..

గతవారం అలా..

గత ఆదివారం కమెడియన్ రాహుల్ రామకృష్ణను గెస్ట్‌గా పిలిచారు. స్కిట్స్ జరుగుతూ ఉంటే మధ్యలో రాహుల్ వేసిన పంచ్‌లు బాగా వైరల్అయ్యాయి. చమ్మక్ చంద్ర స్కిట్‌లో, గల్లీబాయ్ స్కిట్‌లో రాహుల్ బాగానే ఇన్వాల్వ్ అయ్యాడు. అయితే ఈసారి మాత్రం శివ శంకర్ మాస్టర్‌ను రంగంలోకి దింపారు.

Recommended Video

Operation 533295 Movie Official Trailer
 జానీ మాస్టర్‌పై సెటైర్లు..

జానీ మాస్టర్‌పై సెటైర్లు..

బొమ్మ అదిరిందిలో డ్యాన్సర్ పండు ఎంత ఫ్ట్రస్ట్రేషన్‌తో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని బాధపడుతున్నాడు. అలాంటి పండుకు శివ శంకర్ మాస్టర్ తీసుకొచ్చిన అమ్మాయిపై కన్ను పడింది. ఆమెకు స్కార్ఫ్ కట్టి ఉండటంతో పండు ఆగలేకపోయాడు. జానీ మాస్టర్ కూడా అదే మాట అంటూ త్వరగా ఆ ముసుగు తీసేయండి మాస్టర్ అని శివ శంకర్ మాస్టర్‌ను కోరాడు. పెళ్లై పిల్లలున్నా కూడా ఆగలేకపోతున్నావా? అంటూ జానీ పరువుతీసేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X