Bigg Boss 7 Telugu నన్ను కెలికితే ఊరుకోను.. శోభాశెట్టిని ఆడుకొన్న యాక్టర్ శివాజీ

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో తొలివారం ఎలిమినేషన్‌ను ముగించుకొని రెండోవారంలోకి ప్రవేశించింది. రెండోవారం ఆరంభంలోనే ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ మొదలుపెట్టారు. అయితే రెండోవారం నామినేషన్ల సందర్భంగా ఇంటిలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం, ఆరోపణలు, విమర్శలతో హౌస్ దద్దరిల్లింది. ఈ సందర్బంగా శివాజీ, కార్తీకదీపం మోనిత అలియాస్ శోభా శెట్టి మధ్య జరిగిన గొడవ ఎలా ఉందంటే?

రతికని డాక్టర్ గౌతమ్ నామినేట్ చేస్తూ.. లవ్ యాంగిల్ అనిపిస్తుందని చెప్పావుగా అని అంటే.. లవ్ యాంగిల్ చెప్పలేదు. పాయింట్ మాట్లాడు అంటూ రతిక గట్టిగ అరిచింది.దాంతో నేను నీ కంటే గట్టిగా అరువ గలను. నాకు అరవడం వచ్చు అని గౌతమ్ అంటే.. పాయింట్ మాట్లాడు.. పిచ్చి పిచ్చి నామినేషన్ వద్దు అంటూ రతిక ఘాటుగా స్పందించింది.

Shivaji Face off with Shobha Shetty in Bigg Boss 7 Telugu 2 week Nominations

శోభాశెట్టిని యాక్టర్ శివాజీ మాట్లాడుతూ.. నీతో నేను వాదన పెట్టుకోలేను. నీవు నన్ను నామినేట్ చేశాడు. నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని శివాజీ నామినేట్ చేశాడు. దాంతో నామినేట్ చేయాలనిపిస్తే ఏదైనా వాలీడ్ పాయింట్ చెప్పి నామినేట్ చేయండి అని శోభాశెట్టి అన్నారు. మీరంతా కలిసి కట్టుగా ఆడుతున్నట్టు కనిపిస్తున్నది. నేను వాదన మొదలుపెడితే.. తట్టుకోలేవు అంటూ శివాజీ ఘాటుగా స్పందించాడు.

అయితే శివాజీ, శోభాశెట్టి మధ్య మాట మాట పెరిగింది. నేను కూడా ఆర్టిస్టునే అని శోభా శెట్టి అంటే.. ఆర్టిస్టువి కాబట్టే ఇంప్రెస్ చేశావు అని శివాజీ అంటే.. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని శోభా శెట్టి బదులిచ్చింది. ఆ రోజు ఇంప్రెస్ చేయమనేగా చెప్పింది అంటూ శివాజీ జవాబు ఇచ్చాడు. ఏ పాయింట్ అని శోభా శెట్టి అంటే.. ఇంప్రెస్ చేయమనడమే పాయింట్ కదా అని శివాజీ జవాబిచ్చాడు.

శోభా శెట్టి దగ్గరకు వెళ్లి సమాధానం చెప్పడానికి ప్రయత్నించడంతో నా దగ్గరకు వచ్చి.. కెలుక్కుంటున్నావు అని శోభా శెట్టి అనడంతో.. నేను కెలుక్కుంటున్నానా? నేను నీ దగ్గరికి వచ్చానా? అని శివాజీ నిలదీశాడు. నీకు ఆడటం రాదు. ఆడటం నేర్చుకో అంటూ వెళ్తుంటే.. మీరు చెబితే వెళ్లను.. బిగ్‌బాస్ చెబితే నేను వెళ్లిపోతాను అని శోభాశెట్టి అనడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X