నాగార్జున అడగలేనివి అడుగుతా.. అసలు క్యారెక్టర్ బయటపెడుతా.. బిగ్‌బాస్ బజ్‌పై శివాజీ కామెంట్స్..
Shivaji on Bigg Boss Buzz: తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన పేరు హీరో శివాజీ ( Shivaji). ఒకప్పుడు వరుస సినిమాలతో హీరోగా ప్రేక్షకులను అలరించిన శివాజీ, కొన్నేళ్ల గ్యాప్ తర్వాత బిగ్‌బాస్ ద్వారా తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. బిగ్‌బాస్ షోలో పాల్గొనడం మాత్రమే కాదు, తన స్పష్టమైన అభిప్రాయాలు, నిజాయితీతో మాట్లాడే తీరు వల్ల ఈ తరం ప్రేక్షకుల్లో కూడా ఆయనకు కొత్త ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ప్రస్తుతం బిగ్‌బాస్ బజ్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు శివాజీ. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
'బిగ్‌బాస్ బజ్' ఉద్దేశమే వేరు
ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ బిగ్‌బాస్ బజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బిగ్‌బాస్ బజ్ అనేది కంటెస్టెంట్లకు చివరి అవకాశం. బిగ్‌బాస్ స్టేజ్‌పై చాలా విషయాలు చెప్పలేరు. అలాంటి సమయంలో వాళ్లకు తమ మాట చెప్పుకునే ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతోనే బిగ్‌బాస్ బజ్‌ను రూపొందించారు' అని చెప్పారు. ఇక హోస్ట్ నాగార్జున అడగలేని ప్రశ్నల గురించి మాట్లాడుతూ 'నాగార్జున గారు అడగలేని ప్రశ్నలు చాలానే ఉంటాయి. ఆ ప్రశ్నల్ని నేనే అడుగుతాను. ప్రేక్షకులు అడగాలనుకునే ప్రశ్నలు, షో చూస్తూ నాకు వచ్చిన సందేహాలు... అన్నింటినీ బిగ్‌బాస్ బజ్‌లో ఓపెన్‌గా అడుగుతాను'అని అన్నారు.

క్యారెక్టర్ బయట పెట్టడమే నా పని
బిగ్‌బాస్ బజ్‌లో తన స్టైల్ గురించి శివాజీ స్పష్టత ఇచ్చారు. 'కొంతమంది కంటెస్టెంట్లు టెన్షన్ పడతారు. మరికొందరు నన్నే డామేజ్ చేయాలని ట్రై చేస్తారు. అలాంటి టైమ్‌లో నేను సైలెంట్‌గా ఉండి, వాళ్లు హౌస్‌లో దాచిన అసలు క్యారెక్టర్‌ను బయట పెట్టడమే నా పని' అని చెప్పారు. బిగ్‌బాస్ బజ్‌లో అడిగే ప్రశ్నల్లో దాదాపు 90 శాతం ప్రశ్నలు బిగ్‌బాస్ ఆడియోస్ నుంచి వచ్చినవేనని, మిగిలిన 10 శాతం మాత్రం తాను షో చూస్తూ ఫీల్ అయిన సందేహాలని తెలిపారు, ఎందుకు అలా చేశావు? ఎలా చేశావు?' అంటూ నేరుగా ప్రశ్నించడం తన స్టైల్ అని అన్నారు.
బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ సపోర్ట్
ప్రతి షోకు ఒక సిస్టమ్ ఉంటుందని, బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ తన ఆలోచనలకు అనుగుణంగా బిగ్‌బాస్ బజ్‌ను నడిపిస్తోందని శివాజీ చెప్పారు. 'ఇది ఒక బాధ్యత. బాధ్యత తీసుకున్నాక దాన్ని సంపూర్ణంగా చేయాలి. నా టాలెంట్ ఏంటో కూడా చూపించాలి కదా' అంటూ తన కమిట్‌మెంట్‌ను వివరించారు. 'మీరు బిగ్‌బాస్ షో రోజూ చూస్తారా?' అన్న ప్రశ్నకు శివాజీ స్పష్టంగా సమాధానం ఇచ్చారు. 'కచ్చితంగా చూస్తాను. చూడకపోతే ఎలా అడుగుతాను? డైలీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటా' అని అన్నారు.
బిగ్‌బాస్ షోకు వస్తున్న రేటింగ్స్ గురించి మాట్లాడుతూ, 'నాన్ ప్రైమ్ టైమ్ అయినా, రాత్రి 10:30కి 5 నుంచి 6 టీఆర్పీ రావడం చిన్న విషయం కాదు. ఈ క్రెడిట్ అంతా బిగ్‌బాస్ టీమ్‌కే చెందుతుంది. అలాంటి షోకు అనుబంధంగా ఉన్న ప్రోగ్రామ్ చేస్తున్నామంటే మనకంటూ ఓ స్పెషల్ ఉండాలి' అని చెప్పారు. ఇటీవల సుమన్ శెట్టితో చేసిన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతూ.. 'ఆ ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగింది. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పటికీ ఆ వీడియో మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసింది' అని తెలిపారు.
బిగ్‌బాస్ నా జీవితంలో కీలకం
సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెరగడానికి బిగ్‌బాస్ కారణమా? అన్న ప్రశ్నకు శివాజీ చాలా ఆసక్తికరంగా స్పందించారు. 'నా జీవితంలో బిగ్‌బాస్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. 105 రోజుల పాటు ఒక మనిషిని చూస్తే అతడు నిజంగా ఎలా ఉన్నాడో అర్థమవుతుంది. ప్రతీ క్షణం నటించడం ఎవరికీ సాధ్యం కాదు. ఎక్కడో ఒకచోట అసలు రూపం బయటపడుతుంది. చివరికి బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో అయినా దొరికిపోవాల్సిందే' అని చెప్పారు.
బిగ్‌బాస్ ద్వారా తన క్యారెక్టర్, అటిట్యూడ్ అన్నీ ప్రేక్షకులకు చేరాయని, ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని భావిస్తున్నానని అన్నారు. 'నేను దీన్ని అదృష్టంగా భావిస్తాను' అంటూ ఇంటర్వ్యూను ముగించారు. ప్రస్తుతం శివాజీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బిగ్‌బాస్ బజ్‌కు శివాజీ అందిస్తున్న ఈ ప్రత్యేకతే, ఆ షోను మరింత ఆసక్తికరంగా మార్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











